Begin typing your search above and press return to search.
వైరస్ నివారణకు మరో దేశీయ వ్యాక్సిన్ సిద్ధం
By: Tupaki Desk | 16 July 2020 3:20 PM ISTమహమ్మారి వైరస్ కు విరుగుడు కనిపెట్టే పనిలో వైద్య సంస్థలు.. శాస్త్రవేత్తలు.. పరిశోధకులు.. వైద్యులు విస్తృతంగా పరిశోధనలు.. ప్రయోగాలు చేస్తున్నారు. ప్రపంచ దేశలంతా వ్యాక్సిన్ కనిపెట్టడంలో తలమునకలయ్యాయి. ఈ వ్యాక్సిన్ కనిపెట్టడంలో భారత్ ముందంజలో ఉంది. ఆ వైరస్ నివారణకు మందు కొన్ని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రమంలో భారత్ నుంచి మరో వ్యాక్సిన్ సిద్ధమైంది. వైరస్ ను ప్రధానంగా ప్రభావం చూపే ఊపిరితిత్తుల వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తొలి స్వదేశీ వ్యాక్సిన్ రెడీ అయ్యిది.
పుణెకు చెందిన సెరమ్ ఇన్ స్టిట్యూట్ పూర్తి స్వదేశీయంగా తయారు చేసిన ‘న్యుమోకోకల్ పాలిసచారైడ్ కొంజుకేట్ వ్యాక్సిన్’కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఏ) బుధవారం ఆమోదం తెలిపింది. వైరస్ కు సబ్ వ్యాక్సిన్‌గా దీన్ని భావిస్తున్నారు. ఈ ‘న్యుమోనికోకల్’ న్యుమోనియా, ఇతర ఊపిరితిత్తుల సమస్యలపై పోరాడుతుంది. పైగా ఇది తక్కువ ధరకే లభిస్తుందని తయారీదారులు ప్రకటించారు. సెరమ్ ఇనిస్టిట్యూట్ తయారు చేసిన ఈ వ్యాక్సిన్ గతేడాది డిసెంబరులోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అర్హత పొందింది. తాజాగా డీజీసీఏ ఆమోదం కూడా దక్కడంతో ఈ నెలాఖరుకు ఈ వ్యాక్సిన్ మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది.