Begin typing your search above and press return to search.
ఈసారి గుంటూరు జిల్లాలో చేపల వర్షం
By: Tupaki Desk | 16 Aug 2015 6:46 AM GMTవినటానికి వింతగా ఉన్నా.. అసాధ్యం కానిది చేపల వర్షం. వాన అనగానే జోరున నీళ్లు ఆకాశంలో నుంచి పడటం తెలిసిందే. అప్పుడప్పుడు విచిత్రమైన వాతావరణ పరిస్థితుల్లో నీళ్లు బదులుగా వడగళ్ల వాన మామూలే. దీనికి కాస్త భిన్నంగా చేపలు..పాములు.. సాలీళ్లు.. ఇలా చాలానే వర్షాలు ప్రాశ్చాత్య దేశాల్లో కనిపించేవే.
అస్ట్రేలియా.. న్యూజిలాండ్ దేశాల్లో చేపల వర్షాలు అప్పుడప్పుడు పడుతుంటాయి. వీటి గురించి గొప్పగా చెప్పుకుంటుంటారు. ఈ మధ్యనే (జూన్.. జులై మధ్యలో) కృష్ణా జిల్లాలోని ఒకట్రెండు చోట్ల చేపల వర్షం పడటం తెలిసిందే. దీనిపై మీడియాతో పాటు.. సామాన్య ప్రజానీకం కూడా అబ్బురంగా చెప్పుకున్నారు. చేపల వర్షం అద్భుతం కాకున్నా.. మన ప్రాంతాల్లో ఇలాంటి చాలా అరుదుగా చోటు చేసుకుంటాయి.
తాజాగా గుంటూరు జిల్లా నగరం మండలం ఉయ్యూరివారి పాలెంలోని పొలాల్లో చేపలు భారీగా లభించాయి. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షంతో.. ఉదయాన్నే పొలాలకు వెళ్లిన రైతులకు తమ పొలాల్లో చేపలు పెద్ద ఎత్తున దర్శనమిచ్చాయి. గత రాత్రి కురిసిన భారీ వర్షాల్లో చేపల వర్షం కూడా పడి ఉంటుందని భావిస్తున్నారు. మొత్తానికి పొలాల్లో చేపలు భారీగా పడి ఉన్న నేపథ్యంలో.. వాటిని చూసేందుకు స్థానికులతో పాటు.. చుట్టుపక్కల గ్రామాల వారు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు.