Begin typing your search above and press return to search.
వైఎస్ వివేకాపై ఫిష్ వెంకట్ కామెంట్..అసలు ట్విస్ట్ ఇదే
By: Tupaki Desk | 3 Sep 2019 10:28 AM GMTటాలీవుడ్ కమెడియన్ కం నటుడు ఫిష్ వెంకట్ తాజాగా వివాదాల్లో చిక్కుకున్నాడు. ఏపీ సీఎం జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై తాజాగా కొన్ని సంచలన వ్యాఖ్యలు ఫిష్ వెంకట్ సోషల్ మీడియా ఖాతాపై పోస్టు అయ్యాయి. జగన్ ను విమర్శిస్తూ ఈ ట్వీట్లు ఉన్నాయి.
కాగా ఈ తిట్లు పెద్ద దుమారం రేగడం.. వైసీపీ అభిమానులు ఫిష్ వెంకట్ పై విమర్శల దాడి పెంచడంతో తాజాగా ఫిష్ వెంకట్ స్పందించారు. అసలు తన పేరు మీద ట్విట్టర్ లో నకిలీ అకౌంట్ ను ప్రారంభించి కొందరు వైఎస్ వివేకా హత్య, జగన్ ను తిడుతూ కామెంట్ చేశారు. తన దృష్టికి రావడంతో సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపాడు.
జయ్ చౌదరి అనే వ్యక్తి తన పేరిట ట్విట్టర్ లో ఇలా నకిలీ ఖాతా పెట్టి జగన్ ను తిడుతూ షేర్ చేశాడని ఫిష్ వెంకట్ తెలిపాడు. అయితే పోలీసులు కేసు నమోదైన వెంటనే ఫిష్ వెంకట్ పేరు మీద ఉన్న ట్విట్టర్ అకౌంట్ డిలీట్ కావడం ఆసక్తి రేపుతోంది.
ఫిష్ వెంకట్ స్వతహాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద అభిమాని. జగన్ ను కలిసి ఆయన పాదయాత్రలో కూడా పాల్గొన్నారు. అలాంటి ఫిష్ వెంకట్ పేరు మీద వైసీపీని తిట్టడంతో ఇది దుమారం రేపింది. దీనిపై ఫిష్ వెంకట్ వివరణ ఇచ్చారు. తాను ఎంతో అభిమానించే వైఎస్ ఫ్యామిలీని ఎలా తిడుతానని.. తన పేరిట నకిలీ అకౌంట్లు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. కాగా ఎక్కడి నుంచి ఆ పోస్ట్ సోషల్ మీడియాలో షేర్ అయ్యిందనే విషయంపై పోలీసులు ఆరాతీస్తున్నారు.