Begin typing your search above and press return to search.
భారీ కోత: భారత ఆర్థిక వ్యవస్థ -10.5%
By: Tupaki Desk | 8 Sep 2020 5:40 PM GMTకరోనా మహమ్మారి నేపథ్యంలో భారత జీడీపీ మైనస్ లలోకి జారీ పోయింది. ఎంతలా అంటే కనివినీ ఎరుగని రీతిలో ఏకంగా మైనస్ 23.9కు దిగజారింది. 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఈ దారుణ పతనం వెలుగుచూసిందని రేటింగ్ ఏజెన్సీలు వెల్లడిస్తున్నాయి.
తాజాగా అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ రేటుకు భారీ కోత విధించింది. ఏకంగా 10.5శాతం మేర కుచించుకుపోనుందని అంచనావేసింది. ఇదే సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో -5శాతం ఉంటుందని మొదట అంచనావేసి ఇప్పుడు దానిని సవరించి గత అంచనాలతో పోలిస్తే రెండింతల కంటే ఎక్కువ నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.
ఏప్రిల్ -జూన్ క్వార్టర్ లో ప్రపంచంలోనే అత్యల్ప వృద్ధి రేటు నమోదైన దేశాల్లో భారత్ ఒకటి అని తెలిపింది. భారత్ తోపాటు బ్రిటన్ , స్పెయిన్ లలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. లాక్ డౌన్ తో ప్రజారవాణా, కొనుగోళ్లపై భారీ ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొంది.