Begin typing your search above and press return to search.

ఒక వారంలో దేశంలో ఐదు కరోనా ‘ఒమిక్రాన్’ కేసులు

By:  Tupaki Desk   |   5 Dec 2021 12:16 PM GMT
ఒక వారంలో దేశంలో ఐదు కరోనా ‘ఒమిక్రాన్’ కేసులు
X
కరోనా సెకండ్ వేవ్ సమయంలో భారత ప్రజలు చేసిన నిర్లక్ష్యానికి జనం పిట్టాల్లా రాలిపోయారు. శ్మశనాలు కూడా నిండిపోయి శవాలను నదుల్లో పారేసిన ధైన్యం కనిపించింది. ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతున్న ఒమిక్రాన్ కూడా అంతే వేగంగా దూసుకొస్తోంది. భారతదేశంలో ఒమిక్రాన్ మొదటి రెండు కేసులు ఈ వారం ప్రారంభంలో కర్ణాటకలో బయటపడ్డాయి. 24 గంటల వ్యవధిలో గుజరాత్, మహారాష్ట్రల్లో మరో రెండు కేసులు నమోదయ్యాయి.

ఇప్పుడు టాంజానియా నుంచి ఢిల్లీకి వచ్చిన ఒక వ్యక్తి ఆసుపత్రిలో చేరాడు. అతడికి కొత్త కోవిడ్ వేరియంట్ ఒమిక్రాన్‌ సోకిందని తేలింది.కరోనా పాజిటివ్‌గా అతడు గుర్తించబడ్డాడు. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య ఐదుకి చేరింది.

“నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్‌కు పన్నెండు నమూనాలు పంపబడ్డాయి. అందులో ఒకటి ఓమిక్రాన్ వేరియంట్‌గా తేలింది. ఈ రోగి భారతీయుడు కావడం గమనార్హం. కొన్ని రోజుల క్రితం టాంజానియా నుంచి తిరిగి వచ్చాడు ” అని పీటీఐ వార్త సంస్థ తెలిపింది.

కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నవంబర్ 25న దక్షిణాఫ్రికాలో మొదటిసారిగా కనుగొనబడింది. దీనిని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) "ఆందోళన కలిగించే కొత్త కరోనా డేంజర్ రకం"గా అభివర్ణించింది. "ఒమిక్రాన్ అపూర్వమైన సంఖ్యలో స్పైక్ మ్యుటేషన్‌లను కలిగి ఉంది. వాటిలో కొన్ని ఇప్పటివరకూ ఉన్న కరోనా వైరస్ లన్నింటికంటే శక్తివంతమైనదిగా గుర్తించింది. దీనిపై ఆందోళన వ్యక్తం చేసింది" ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

ఒమిక్రాన్ తీవ్రమైన అంటువ్యాధి అని రుజువు అయ్యింది..అయితే ఎంత ఘోరమైనదో చూడాల్సి ఉంది. వ్యాక్సిన్ కాలక్రమేణా తక్కువ ప్రభావవంతంగా మారుతుంది. అందుకే టీకాలు తప్పనిసరిగా వేసుకోవాలి. ఇప్పటివరకు ప్రపంచ జనాభాలో అత్యధికంగా టీకాలు వేయబడిన శాతం మన భారత్ లోనే. సో ఇక్కడ ఈ వైరస్‌ను అంతం అవుతుందని.. ఆర్థిక వ్యవస్థను మళ్లీ ముందుకు తీసుకువెళుతుందని విశ్వసిస్తున్నారు.