Begin typing your search above and press return to search.

బ్యాంకుల‌కు 5 వ‌రుస సెల‌వుల‌పై తాజా క్లారిటీ!

By:  Tupaki Desk   |   31 Aug 2018 5:23 AM GMT
బ్యాంకుల‌కు 5 వ‌రుస సెల‌వుల‌పై తాజా క్లారిటీ!
X
సెప్టెంబ‌రు 1 నుంచి 5 వ‌ర‌కు వ‌రుస సెల‌వులు అంటూ వ‌చ్చిన వార్త‌ల‌పై తాజాగా క్లారిటీని ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు జాతీయ బ్యాంకు ఉద్యోగ సంఘం నేత‌లు. వ‌రుస‌గా ఐదు రోజులు సెల‌వులు అన్న దాన్లో నిజం పాక్షిక‌మేన‌ని వారు చెబుతున్నారు. తాజాగా వారు చెబుతున్న దాని ప్ర‌కారం.. వ‌రుస‌గా ఐదు రోజుల సెల‌వుల్లో నిజం స‌గ‌మేన‌ని.. ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని చెబుతున్నారు.
వ‌రుస సెల‌వుల కార‌ణంగా ఏటీఎంల‌లో కొర‌త ఏర్ప‌డుతుంద‌న్న మాట‌ల్లో నిజం లేద‌ని.. వ‌రుస సెల‌వుల‌తో బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ స్తంభించిపోతుంద‌న్న మాట‌ల్లోనూ నిజం లేద‌ని చెబుత‌న్నారు. బ్యాంకింగ్ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌రుస‌గా మూడు రోజుల‌కు మించి సెల‌వులు ఉండ‌వ‌న్నారు. వారు ఇస్తున్న తాజా క్లారిటీ ఏమంటే..

+ సోష‌ల్ మీడియాలో వ‌రుస‌గా ఆరు రోజులు బ్యాంకుల మూత అంటున్నారు.. అందులో నిజం లేదు.

+ శ‌నివారం ఒక‌పూట బ్యాంకులు ప‌ని చేస్తాయి. కాబ‌ట్టి..అత్య‌వ‌స‌ర ప‌నులు ఉన్న వారు ప‌నులు చేసుకోవ‌చ్చు.

+ ఆదివారం ఎప్ప‌టిలానే సెల‌వు.

+ సోమ‌వారం జ‌న్మాష్ట‌మి. ఇది ఆప్ష‌న‌ల్ హాలీడే. అంటే.. కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు ప‌ని చేస్తాయి.. మ‌రికొన్ని చోట్ల ప‌ని చేయ‌వు. ఈ కారణంతో ప్ర‌జ‌ల‌కు పెద్ద‌గా ఇబ్బంది ఉండ‌దు.

+ మంగ‌ళ‌.. బుధ‌వారాల్లో రిజ‌ర్వ్ బ్యాంక్ ఉద్యోగులు స‌మ్మె నోటీసు ఇచ్చారు. వారు ఒక‌వేళ చేస్తే.. రిజ‌ర్వ్ బ్యాంక్ కార్య‌క‌లాపాలు మాత్ర‌మే ప్ర‌భావితం అవుతాయే త‌ప్పించి.. బ్యాంకుల రోజువారీ లావాదేవీల‌కు ఎలాంటి ఇబ్బంది ఉండ‌దు.

+ గురు.. శుక్ర‌వారాలు య‌థావిధిగా బ్యాంకులు ప‌ని చేస్తాయి. రెండో శ‌నివారం.. ఆదివారం సెల‌వు. మొత్తంగా చూస్తే.. వ‌రుస‌గా సెలువులు ఉన్న‌ట్లు చెబుతున్న దాన్లో నిజం సగ‌మే.