Begin typing your search above and press return to search.
ఏప్రిల్ 1 నుంచి మారనున్న ఐదు ఐటీ రూల్స్.. అవేమంటే?
By: Tupaki Desk | 17 March 2021 2:30 AM GMTఆదాయ పన్ను (ఐటీ) నిబంధనల్లో చోటు చేసుకోనున్న ముఖ్యమైన మార్పుల గురించి బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్. ఈ కొత్త మార్పులు ఏప్రిల్ 1, 2021 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇంతకీ.. ఆ వచ్చే మార్పులు ఏమిటన్నది చూస్తే..
1.
ప్రావిడెంట్ ఫండ్ కు ఏడాదికి రూ.2.5లక్షలకు పైగా డిపాజిట్ చేసే వ్యక్తులకు వడ్డీకి పన్ను వర్తిస్తుంది. ఉద్యోగి ఈపీఎఫ్ లో అధిక విలువ కలిగిన డిపాజిటర్లకు పన్ను విధించేందుకు ఈ చర్య తీసుకోనున్నారు. నెలకు రూ.2లక్షల కంటే తక్కువ సంపాదించే ఏ వ్యక్తి అయినా ఈ ప్రతిపాదన వల్ల ప్రభావితం కారు.
2.
ఎక్కువమంది ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేయటానికి అధిక టీడీఎస్ లేదంటే టీసీఎస్ రేట్లను ప్రతిపాదించారు. ఐటీ రిటర్నులు దాఖలు చేయని వారికి అధిక రేట్లు విధించేందుకు ప్రత్యేక నిబంధనను ఆదాయపన్ను చట్టంలో 206ఎబి, 206సిసిఎ తీసుకొచ్చారు.
3.
సీనియర్ సిటిజన్లకు పన్ను భారం తగ్గించే పనిలో భాగంగా 75 ఏళ్లు పైబడిన వ్యక్తులకు ఆదాయపన్నురిటర్నులుదాఖలు చేయకుండా మినహాయింపు ఇచ్చారు. ఈ మినహాయింపు ఇతర ఆదాయం లేని సీనియర్ సిటిజటన్లకు మాత్రమే లభిస్తుంది. పెన్షన్ ఖాతా ఉన్న బ్యాంకు నుంచి లభించే పెన్షన్.. వడ్డీ ఆదాయంపై ఆధారపడి ఉంటుంది.
4.
ఆదాయపన్ను రిటర్నులను దాఖలు చేయటం మరింత సలువుగా చేసే పనిలో భాగంగా వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు ముందుగా నింపిన ఐటీఆర్ జారీ చేస్తారు. జీతం.. పన్నుచెల్లింపులు.. టీడీఎస్ మొదలైన వివరాలు ముందే ఆదాయపన్ను ఫారంలో పూరించి ఉంటాయి. రిటర్నులు దాఖలు మరింత సులువు చేయటానికి.. లిస్టెడ్ సెక్యూరిటీల నుంచి మూలధన లాభాల వివరాలు.. డివిడెండ్ ఆదాయం.. బ్యాంకుల నుంచి వడ్డీ.. పోస్ట్ ఆఫీస్ మొదలైనవి కూడా ముందే ఉంటాయి.
5.
ఉద్యోగులకు ఇచ్చే సెలవు ప్రయాణ రాయితీ (ఎల్ టీసీ) కి బదులుగా సంస్థలు నగదు రూపంలో ఇస్తే.. ఆ మొత్తాన్ని ఆదాయంగా పరిగణించి పన్ను వేయకుండా మినహాయింపు ఇవ్వాలన్న ప్రతిపాదన చేసింది. కరోనా కారణంగా ప్రయాణాలు చేయలేని పరిస్థితి ఉండటంతో.. తమ ఎల్ టీసీ పన్ను ప్రయోజనాన్ని పొందలేకపోయిన వ్యక్తుల కోసం ఈ మినహాయింపు ఇస్తారు.