Begin typing your search above and press return to search.
సభకు ఐదుగురు ఎమ్మెల్యేల ఆబ్సెంట్...?
By: Tupaki Desk | 17 Jan 2019 10:46 AM GMTతెలంగాణ శాసనసభ సమావేశాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రమాణస్వీకారం చేయించారు. మొదట సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత ఆరుగురు మహిళా సభ్యులు ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేయగా - అనంతరం అక్షర క్రమంలో మిగతా సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణస్వీకార కార్యక్రమం రెండున్నర గంటల పాటు కొనసాగింది.
అయితే - మొత్తం 119 మంది ఎమ్మెల్యేల్లో ఇవాళ 114 మంది శాసనసభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఐదుగురు ఎమ్మెల్యేలు గైర్హాజరు అయ్యారు. అయితే, వీరు ఐదుగురు సీనియర్లే కావడం గమనార్హం. ఎంఐఎం ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఓవైసీ - జాఫర్ హుస్సేన్ - టీఆర్ ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు - టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య - బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సభకు హాజరు కాలేదు. కాగా, స్పీకర్ ఎన్నిక పూర్తయిన తర్వాతే ప్రమాణం చేస్తానని రాజాసింగ్ ఇప్పటికే చెప్పిన విషయం తెలిసిందే. సర్పంచ్ ఎన్నికల బిజీ వల్ల రాలేకపోతున్నట్లు సండ్ర వెంకట వీరయ్య పేర్కొన్నారు.
ఇదిలాఉండగా - తెలంగాణ శాసనసభలో ఎమ్మెల్యేల ప్రమాణస్వీకార కార్యక్రమం పూర్తయిందింది. ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేయించారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేగా సీఎం కేసీఆర్ ప్రమాణస్వీకారం చేసిన అనంతరం ఆరుగురు మహిళా సభ్యులు ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. రేఖానాయక్(టీఆర్ ఎస్) - డి.అనసూయ(సీతక్క)(కాంగ్రెస్) - గొంగిడి సునీత(టీఆర్ ఎస్) - హరిప్రియ బానోతు(కాంగ్రెస్) - పద్మా దేవేందర్ రెడ్డి(టీఆర్ ఎస్) - సబితా ఇంద్రారెడ్డి(కాంగ్రెస్) వరుసగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం వరుస క్రమంలో మిగతా ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేశారు.