Begin typing your search above and press return to search.

కేరళలో ఒకే ఫ్యామిలీలో ఐదుగురికి కరోనా

By:  Tupaki Desk   |   8 March 2020 8:54 AM GMT
కేరళలో ఒకే ఫ్యామిలీలో ఐదుగురికి కరోనా
X
నెత్తి నోరు మొత్తుకున్నా.. ఎవరికి వారు బాధ్యతగా వ్యవహరించకపోతే.. మిగిలిన వారికి ఎంత ఇబ్బందిగా మారుతుందన్న వైనం తాజాగా కేరళలోని ఎపిసోడ్ ను చూస్తే ఇట్టే అర్థం కాక మానదు. కరోనా (కోవిడ్ 19) వైరస్ భయాందోళన నేపథ్యంలో ప్రతి ఎయిర్ పోర్టులోనూ స్క్రీనింగ్ టెస్టుల్ని నిర్వహిస్తున్నారు. అయితే.. విదేశాల నుంచి వచ్చిన వారు.. పరీక్షలు చేయించుకోకుండా ఉండటంతోపాటు.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎంత ప్రమాదమన్న వైనం కేరళ ఎపిసోడ్ ను చూస్తే ఇట్టే అర్థమైపోతుంది.

శనివారం వరకూ దేశంలో 34 కరోనా కేసులు నమోదు కాగా.. తాజాగా వెలుగు చూసిన ఐదు కేసులతో కలిపి మొత్తం 39 మందికి కరోనా సోకినట్లుగా గుర్తించారు. తాజాగా కేరళలో కరోనా సోకిన ఐదుగురిలో ముగ్గురు ఇటీవలే ఇటలీ నుంచి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఎయిర్ పోర్టులో తమ వివరాలు సరిగా నమోదు చేయకపోవటం ద్వారానే ఈ పరిస్థితి చోటు చేసుకుందని చెబుతున్నారు. ఇంటికి వెళ్లిన వారి కారణంగా.. ఇంట్లోని మరో ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చింది.

ఎయిర్ పోర్టులో వివరాలు అందించని కారణంగా అధికారులు వారికి పరీక్షలు నిర్వహించలేదని చెప్పారు. ఇటలీ నుంచి వచ్చిన ముగ్గురు తర్వాత తమ బంధువుల్ని కూడా కలుసుకున్నారని.. వారికి కూడా వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు చెబుతున్నారు. మొన్నటివరకూ కేరళలో కరోనా కేసుల్ని కంట్రోల్ చేయగలిగారన్న పేరు వస్తున్న వేళ.. ఒకేసారి ఐదు కేసులు తెర మీదకు రావటంపై భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.