Begin typing your search above and press return to search.
స్త్రీవాదులు ఈ ఘోరంపై ఎలా స్పందిస్తారు?
By: Tupaki Desk | 10 Oct 2016 10:48 AM GMTభారతీయ సమాజంలో మహిళలను దేవతలుగా గౌరవిస్తుంటారు. ఇంట్లో తల్లి - చెల్లి నుంచి జీవితాంతం వెంట ఉండే భార్య వరకు ఆడవారికి ఉండే గౌరవం అనూహ్యమైంది. అందుకే భారతీయ చట్టాల్లో కూడా మెజార్టీ మహిళలకు పక్షపాతంగా ఉన్నాయి. అయితే మహిళా సమాజానికి మచ్చ తెచ్చే కొందరి ప్రవర్తన చూస్తే ఈ అభిప్రాయాలను వెనక్కి తీసుకోవాలని అనిపిస్తుంది. దేశం కోసం సేవ చేసిన ఓ సైనికుడి కుటుంబలో జరిగిన ఘటన ఇందుకు నిదర్శనం.
జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీకి చెందిన ఓ రిటైర్డ్ ఆర్మీ డాక్టర్ కోడలి వేధింపులు తట్టుకోలేక కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడింది. ఈ దుర్ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనలో అయిదుగురు చనిపోగా ఆర్మీ డాక్టర్ కత్తిపోటు గాయాలతో అత్యంత విషమ పరిస్థితిలో ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య చికిత్స పొందుతున్నారు. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం కుటుంబ సభ్యులంతా మాజీ ఆర్మీ డాక్టర్ కోడలి వేధింపులతో మానసికంగా తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు అంచనా వేస్తున్నారు. ఈ మాజీ డాక్టర్ కొడుకు - కోడలి మధ్య వారి ఏడేళ్ల కూతురి కస్టడీ గురించి వివాదం కొనసాగుతోందని పోలీసులు గుర్తించారు. సుకాంతో సర్కార్ అనే ఈ వైద్యుడి కుటుంబం కోకార్ ప్రాంతంలోని తన బంధువైన డాక్టర్ చౌదరికి చెందిన అపార్ట్ మెంట్ లో ఉంటున్నారు. వాళ్లు నోయిడా నుంచి రాంచీకి కొద్దిరోజుల ముందే వచ్చారు. ఆదివారం మధ్యాహ్నం డాక్టర్ చౌదరి సుకాంతోకు ఫోన్ చేయగా ఆయన లిఫ్ట్ చేయలేదు. ఆయన ఫ్లాట్ కు వచ్చి అపార్ట్ మెంట్ లో పడి ఉన్న శవాలను చూసి పోలీసులకు సమాచారం అందించారు. కొన ఊపిరితో ఉన్న సుకాంతోను ఆసుపత్రికి తరలించారు. బాధితులు సుకాంతో కోడలి గురించి విడివిడిగా రాసిన సూసైడ్ నోట్ లను స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/