Begin typing your search above and press return to search.
టాప్- 20 ప్రపంచ ఆరాధ్యుల్లో మనోళ్లే ఐదుగురు
By: Tupaki Desk | 15 Dec 2021 11:32 AM GMTమన దేశంలో వ్యక్తి ఆరాధన ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలిసిందే. అది రాజకీయాలైనా? సినిమాలైనా? క్రీడలైనా అంతే...మితిమీరిన వ్యక్తి పూజ కొన్నిసార్లు ఇబ్బందులు కలిగించిన ఉదాహరణలున్నాయి. అయినా, భారతీయులు అభిమాన ధనులే. ఇందుకు నిదర్శనం పైన చెప్పుకొన్న మూడు రంగాల ప్రముఖులే ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆరాధించే వ్యక్తుల జాబితాలో ఉన్నారు.
పురుషుల జాబితాలో ప్రధాని మోదీ, క్రికెటర్ విరాట్ కోహ్లీ.. మహిళల్లో ప్రియాంక చోప్రా 2021లో ప్రపంచంలోని అత్యంత ఆరాధించే ప్రముఖుల లిస్ట్ల్ లో నిలిచారు. ఎప్పటిలాగే ఇందులో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కూ చోటు దక్కింది.
ఇక బాలీవుడ్ దిగ్గజాలైన సూపర్ స్టార్ షారుక్ ఖాన్, బిగ్ బీ లేకుండా ఉంటారా? అదే సమయంలో, నటీమణులు ప్రియాంక చోప్రా, ఐశ్వర్య రాయ్ బచ్చన్‌తో పాటు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ సుధా మూర్తి 2021 ప్రపంచంలోని అత్యంత ఆరాధించే మహిళల జాబితాలో ఉన్నారు. బ్రిటీష్ అంతర్జాతీయ ఇంటర్నెట్ ఆధారిత మార్కెట్ రీసెర్చ్, డేటా అనలిటిక్స్ సంస్థ యూగోవ్ ఈ జాబితాను మంగళవారం విడుదల చేసింది.
ఏటా ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో విశేష సేవలందించిన, ప్రజాదరణ కలిగిన నేతలు, సెలబ్రెటీల జాబితాను ఇది ప్రకటిస్తుంది. సర్వే తీరును వివరిస్తూ, 38 దేశాల్లోని ప్యానెలిస్ట్‌ల నుంచి ఓపెన్-ఎండ్ నామినేషన్‌లను సేకరించారు. 42,000 మంది కంటే ఎక్కువమందిని సర్వే చేసినట్లు పేర్కొంది. మన ప్రధాని మోదీ.. 2021 సంవత్సరానికి ఈ జాబితాలో 8వ స్థానంలో నిలిచారు.
మోదీప్రపంచ రాజకీయ నాయకుల కంటే అగ్రస్థానంలో ఉన్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్, చైనా వ్యాపార దిగ్గజం జాక్ మా, పోప్ ఫ్రాన్సిస్, పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వంటి అనేక మంది కంటే మోదీ ముందుండడం విశేషం. అమెరికా మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా వరుసగా రెండో ఏడాది కూడా అగ్రస్థానంలో నిలిచారు.
అమెరికన్ బిజినెస్ మాగ్నెట్ బిల్ గేట్స్‌తో పోటీ పడ్డారు. గేట్స్ ఇప్పుడు రెండవ స్థానానికి మారారు. చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ మూడవ స్థానంలో కొనసాగుతున్నారు. ఈ జాబితాలో ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో, యాక్షన్ స్టార్ జాకీ చాన్, టెక్ మేధావి ఎలాన్ మస్క్, ఫుట్‌బాల్ సంచలనం లియోనెల్ మెస్సీ, చైనా వ్యాపారవేత్త జాక్ మా మిగిలిన టాప్ 10 స్థానాల్లో ఉన్నారు.
ప్రపంచంలో అత్యధికంగా ఆరాధించే పురుషులు 2021:
1. బరాక్ ఒబామా
2. బిల్ గేట్స్
3. జి జిన్‌పింగ్
4. క్రిస్టియానోరొనాల్డో
5. జాకీ చాన్
6. ఎలోన్ మస్క్
7. లియోనెల్ మెస్సీ
8. నరేంద్ర మోడీ
9. వ్లాదిమిర్ పుతిన్
10. జాక్ మా
11. వారెన్ బఫెట్
12. సచిన్ టెండూల్కర్
13. డోనాల్డ్ ట్రంప్
14. షారుక్ ఖాన్
15. అమితాబ్ బచ్చన్
16. పోప్ ఫ్రాన్సిస్
17. ఇమ్రాన్ ఖాన్
18. విరాట్ కోహ్లీ
19. ఆండీ లౌ
20. జో బిడెన్