Begin typing your search above and press return to search.

వాటె గుడ్ న్యూస్..హమ్మయ్య!

By:  Tupaki Desk   |   27 April 2020 5:30 PM GMT
వాటె గుడ్ న్యూస్..హమ్మయ్య!
X
ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్న ఓ అంశంపై కేంద్రం ఈరోజు క్లారిటీ ఇచ్చింది. ఇది కేవలం క్లారిటీ కాదు. పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే... దక్షిణ కొరియా - ఇటలీ తదితర దేశాల్లో కరోనా తగ్గిపోయిన వారిలో మళ్లీ ప్రబలడం కనిపించింది. ఇండియాలో కొన్ని కేసులు ఇలాంటివి తేలాయి. ఇలాంటి కేసులు మానవ బాంబులు అన్నట్లు ప్రచారం అయ్యింది. ఎందుకంటే నయమైన వారు సమాజంలో తిరుగుతన్నపుడు వారికి మళ్లీ కరోనా వస్తే తెలియకుండానే ఇతరులకు అది సోకే పరిస్థితి వస్తుంది. దీనిపై పరిశోధన జరిపిన కేంద్రం ఒక మంచి న్యూస్ చెప్పింది.

కరోనా రెండో సారి వచ్చిన వారి వల్ల సమాజానికి ఏం భయం లేదని - ఇలాంటి వారి వల్ల ఇతరులకు కరోనా సోకదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు కోలుకున్న వారందరు ప్లాస్మా డొనేట్ చేసి ఇతరులకు చికిత్స చేయడానికి దోహదపడాలని కేంద్రం పేర్కొంది. దీనివల్ల మనం త్వరగా దీని నుంచి బయటపడే అవకాశం ఉందని ప్రభుత్వం అభిప్రాయపడింది. ఇక కరోనా కేసులు ఇండియాలో పెరుగుతున్నా కూడా మరో గుడ్ న్యూస్ కూడా ఈరోజు నమోదైంది.

నార్త్ ఈస్ట్ ఇండియాలో 5 రాష్ట్రాలు కరోనా కేసులే లేకుండా బయటపడ్డాయని ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయమంత్రి జితేంద్ర సింగ్ తెలియజేశారు. కరోనా రహిత రాష్ట్రాలుగా అరుణాచల్ ప్రదేశ్ - నాగాలాండ్ - త్రిపుర - మణిపూర్ - సిక్కింలు నిలిచాయన్నారు. మరో మూడు రాష్ట్రాలయిన మిజోరం - మేఘాలయా - అసోంలో ఇంతకుముందు కేసులున్నా... తాజాగా కొత్త కేసులు నమోదు కావటం లేదని... దీంతో కరోనా నుంచి ఈశాన్య భారతం బయటపడిందని కేంద్రం వెల్లడించింది. రైళ్లు - వాహనాలు బంద్ అయిన నేపథ్యంలో ఈ ప్రాంతంలో నిత్యావసరాల కొరతను కార్గో విమానాలతో తీర్చినట్లు వెల్లడించారు.