Begin typing your search above and press return to search.
అమరావతిలో ఐదు దశలేంటి..?
By: Tupaki Desk | 21 July 2015 4:45 AM GMTఒక ఇంటిని కట్టాలంటే బోలెడంత కసరత్తు. సగటు వ్యక్తికి ఇంటి నిర్మాణం తలకు మించిన భారమే. మరి.. ఒక రాజధాని నగర నిర్మాణం అంటే.. మాటలా. వ్యక్తికి ఇల్లు ఎలానో.. ఒక ప్రభుత్వానికి రాజధాని నగర నిర్మాణం అంటే అదే స్థాయి భారమే. అలాంటి భారీ ప్రయత్నానికి ఏపీ సర్కారు అడుగు ముందుకసింది. తన అనుభవాన్ని రంగరించి మరీ చంద్రబాబు తన సత్తాను రాజధాని నిర్మాణంలో ప్రదర్శించాలని భావిస్తున్నారు.
ఆంధ్రులకు తమదైన సొంత రాజధాని నగరాన్ని నిర్మించేందుకు డీటైల్డ్ ప్లాన్ ను తెర మీద తీసుకొచ్చారు. అమరావతి ఎలా ఉంటుంది? ఎక్కడేం ఉంటాయన్న అంశంపై ఇప్పటికే భారీ కసరత్తు జరిగింది. మొత్తం రాజధానిని ఐదు దశల్లో నిర్మించాలని భావిస్తున్నారు. ఇంతకీ ఆ ఐదు దశలేంటన్న అంశంపై దృష్టిసారిస్తే..
మొదటి దశ; మొత్తం రాజధానిగా వేసుకున్న ప్రాంతంలో 18 శాతం మేర అభివృద్ధి పరుస్తారు. ప్రభుత్వానికి గుండెకాయ లాంటి ప్రభుత్వ పరిపాలన భవనాల సముదాయాన్ని నిర్మిస్తారు. ప్రభుత్వ భవనాల నిర్మాణాన్ని ఈ దశలో పూర్తి చేస్తారు. ఈ దశ పూర్తి అయితే.. ప్రభుత్వ ఉద్యోగులు పూర్తిస్థాయిలో రాజధాని ప్రాంతం నుంచే పని చేసే వీలు ఉంటుంది. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు.. అనుబంధ నివాస గృహాలు.. కార్యాలయాల క్లస్టర్లు అందుబాటులోకి వస్తాయి. మొదటి దశలో.. రాజధాని ప్రాంతంలో 26వేల మంది వరకు జనాభా నివసించే వీలు ఉంటుంది. ఈ దశలో 2.49 మిలియన్ చదరపు మీటర్లలో నిర్మాణాన్ని పూర్తి చేస్తారు. ఈ దశలో భారీగా ఉద్యోగ కల్పన జరుగుతుంది. సుమారు లక్ష వరకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది.
రెండో దశ; కీలకమైన కేంద భాగంలో 18శాతం మేర నిర్మాణం జరుపుతారు. ఈ దశ పూర్తి అయితే.. 94వేల మంది జనాభాకు నివసించే వెసులుబాటు ఉంటుంది. ఈ దశలో.. మొదటి దశలో నిర్మించిన ప్రాంతం నుంచి వాణిజ్య ప్రాంతం వరకూ అభివృద్ధి పరుస్తారు. రెండో దశలో రవాణా మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు. ఈ దశలో వాణిజ్య.. రవాణా అంశాల మీదనే ప్రధానంగా దృష్టి పెట్టే వీలుంది. ఈ దశలో ఉద్యోగాల కల్పన భారీగా ఉంటుంది. దాదాపు 1.6లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే వీలుంది. మొదటి దశతో పోలిస్తే.. రెండో దశలో నిర్మాణం సుమారు ఒకటిన్నర రెట్లు అధికంగా ఉండే వీలుంది.
మూడో దశ; మొదటి.. రెండో దశల్లో మాదిరే మూడో దశలోనూ రాజధాని కేంద్ర భాగంలో 18 శాతం మేర అభివృద్ధి చేస్తారు. ఈ దశ పూర్తి అయితే.. మరో లక్ష మంది నివాసం ఉండే వీలుంటుంది. రెండో దశకు కాస్త అటూ ఇటూగా నిర్మాణ స్థలం (4.404 మిలియన్ చదరపు మీటర్లు) ఉంటుంది. మొదటి.. రెండో దశల మాదిరే ఈ దశలోనూ రాజధాని తూర్పు భాగంలోనే నిర్మాణాలపై దృష్టి పెడతారు. ఈ దశలో భారీ స్థాయిలో వాణిజ్య అవసరాలు తీర్చేలా నిర్మాణాలు ఉంటాయి. ఈ దశ పూర్తి అయ్యే నాటికి భారీ వాణిజ్య అవకాశాలకు తగినంత నిర్మాణాలు అందుబాటులోకి వచ్చేస్తాయి. మొదటి రెండు దశలతో పోలిస్తే.. ఉద్యోగ కల్పన భారీగా ఉంటుంది. ఒక అంచనా ప్రకారం 1.52లక్షల కొత్త ఉద్యోగాలు వచ్చే వీలుంది.
నాలుగో దశ; మొదటి మూడు దశల నిర్మాణం పూర్తయి.. రాజధాని నిర్మాణంలో అత్యంత కీలకమైన నాలుగో దశకు వచ్చేసరికి రాజధాని ప్రాంతంలో చాలా వరకు కుదురుకునే వీలుంది. మొదటి మూడు దశలతో పోలిస్తే.. ఈ దశలో రాజధాని కేంద్ర స్థానంలో అభవృద్ధి పరిచే స్థలం కేవలం 11 శాతమే (మొదటి మూడు దశల్లో ఇది 18 శాతం ఉంటుంది). నిర్మాణ స్థలం తక్కువే అయినప్పటికీ.. ఉద్యోగాల కల్పన మూడు దశల కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. దాదాపు 1.77లక్షల మందికి ఉపాధి అవకాశాలు ఈ దశ అవకాశం కల్పిస్తుంది. ఈ దశలో భారీగా ప్రాజెక్టు పూర్తి కావటంతో పాటు.. రాజధానిలో పెట్టుబడులు పెట్టేవారికి అనువుగా రాజధాని తయారు అవుతుంది. పెట్టుబడులు పెట్టే వారికి స్వాగతం పలుకుతూ.. ఈ దశ సిద్ధమవుతుంది. వాణిజ్య సంస్థలతో పాటు.. వర్సిటీలు.. భారీ నివాస క్లస్టర్లు.. వెట్ ల్యాండ్ పార్కు అందుబాటులోకి వస్తాయి. ఈ దశ మొత్తం పూర్తిగా వాణిజ్య అవసరాలకు పరిమితం కావటంతో.. మిగిలిన మూడు దశలతో పోలిస్తే అతి తక్కువ జనాభా నివాసానికి అవకాశం ఉండేలా ఉంటాయి.
ఐదో దశ; ఏపీ రాజధాని నిర్మాణానికి ఆఖరి దశ ఇది. ఇది కానీ పూర్తి అయితే.. రాజధాని నిర్మాణం ఇప్పుడు అనుకుంటున్న ప్రణాళిక పూర్తి అయిపోయినట్లే. ఈ దశలో అభివృద్ధి మొత్తం వ్యూహాత్మకంగా ఉంటుంది. రాజధానిలోని కేంద్రభాగంగా నిర్మాణం మొదటి నాలుగు దశల కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. 35శాతం మేర అభివృద్ధి పరుస్తారు. ఈ కారణంగానే.. ఈ దశలో భూమి అవసరం ఎక్కువగా ఉంటుంది. మిగిలిన దశల కంటే భారీగా భూమి అవసరం ఉంటుంది. మిగిలిన దశల కంటే తక్కువ స్థాయి నిర్మాణాలు ఉంటాయి. ఈ దశలో నదీ తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేయటంతో పాటు.. నదీ తీరం చూసేలా గృహనిర్మాణంతోపాటు.. ఇండోర్ క్రీడీ మైదానాలు.. వాణిజ్య కేంద్రాలు.. కన్వెన్షన్ కేంద్రం.. లాంటివి అందుబాటులోకి వస్తాయి. ఇక.. రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేసే డౌన్ టౌన్ వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చెందుతుంది. ఈ దశలో రెండు.. మూడు.. నాలుగు దశలతో పోలిస్తే ఉద్యోగ కల్పన తక్కువగా ఉంటుంది.