Begin typing your search above and press return to search.

ఐదు రాష్ర్టాల ఫ‌లితాలు..ఫైన‌ల్ రిజ‌ల్ట్ ఇదే

By:  Tupaki Desk   |   11 March 2017 11:29 AM GMT
ఐదు రాష్ర్టాల ఫ‌లితాలు..ఫైన‌ల్ రిజ‌ల్ట్ ఇదే
X
పెద్ద నోట్ల రద్దు తర్వాత మొదటిసారిగా ఐదు రాష్ర్టాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్త‌యింది. ఉదయం 8 గంటల నుంచి ఆయా లెక్కింపు కేంద్రాల్లో లెక్కింపు మొదలయి సాయంత్రం అయిదు గంట‌ల వ‌ర‌కు కొన‌సాగింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు వినియోగించిన నేపథ్యంలో కౌంటింగ్ మొదలైన రెండు మూడు గంటల వ్యవధిలోనే అసెంబ్లీలకు అధిపతులెవరన్నది తేలిపోనుంద‌ని అంచ‌నా వేసిన‌ప్ప‌టికీ తీవ్ర జాప్యం జ‌రిగింది. కీలక రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌ లో ఓట్ల లెక్కింపునకు 75 జిల్లాల్లో 78 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 20వేల మందికిపైగా భద్రతా సిబ్బందిని ఆయా కేంద్రాల వద్ద మోహరిస్తున్నారు. 70 స్థానాలున్న ఉత్తరాఖండ్‌ లో ఓట్ల లెక్కింపునకు 15 కేంద్రాలు ఏర్పాటుచేయగా, 117 స్థానాలున్న పంజాబ్‌ లో 27 ప్రాంతాల్లో 54 కేంద్రాలు నెలకొల్పారు. గోవాలో ఉత్తరగోవా - దక్షిణ గోవాలో ఏర్పాటు చేసిన రెండు కేంద్రాల నుంచి 40 నియోజకవర్గాల అభ్యర్థుల భవితవ్యాన్ని ప్రకటించారు. 60 సీట్లున్న మణిపూర్‌ లోనూ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఓట్ల లెక్కింపు జ‌రిగింది.

ఓట్ల లెక్కింపు ప్రక్రియ వివాద రహితంగా, ప్రశాంతంగా సాగిపోయేందుకు కఠినమైన మార్గదర్శకాలను ఎన్నికల సంఘం నిర్దేశించింది. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇందులో కేంద్ర బలగాలు కౌంటింగ్ కేంద్రాల్లో భద్రతను పర్యవేక్షిస్తాయి. రాష్ట్ర పోలీసులు లెక్కింపు కేంద్రాల వెలుపల ఉంటారు. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన భద్రతాబలగాలు కేంద్రాల పరిసరాల్లోకి అనుమతిలేని వ్యక్తులు రాకుండా నిరోధిస్తాయి.

ఉత్త‌ర్ ప్ర‌దేశ్ (403 సీట్లు)

బీజేపీః 323 (+275) - ఎస్‌ పీ + కాంగ్రెస్ః 58 సీట్లు (-196) - బీఎస్‌ పీః 19(-61) - ఇత‌రులుః 3 (-18)

పంజాబ్‌

కాంగ్రెస్ః 77 (+31) - ఆప్ః 22(+22) - అకాళీద‌ళ్ + బీజేపీః 18 సీట్లు(-50) - ఇత‌రులుః0

ఉత్త‌రాఖండ్ (70 సీట్లు)

బీజేపీః 57 సీట్లు (+26) - కాంగ్రెస్ః 11 సీట్లు(-21) - బీఎస్‌ పీః 0 (-3) - ఇత‌రులుః2 (-2)

మ‌ణిపూర్(60సీట్లు)
కాంగ్రెస్ః27 సీట్లు (-15) - బీజేపీః 22(+22) - లెఫ్ట్ః1(-7) - ఇత‌రులుః10 సీట్లు

గోవా (40 సీట్లు)
కాంగ్రెస్ః18 సీట్లు (+9) - బీజేపీః14 సీట్లు (-9) - ఇత‌రులుః 8 (+8)

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/