Begin typing your search above and press return to search.

లైవ్ అప్డేట్స్ : 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు

By:  Tupaki Desk   |   11 Dec 2018 12:04 PM GMT
లైవ్ అప్డేట్స్ : 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు
X
2019 మేలో జరిగే సార్వత్రిక సమరానికి ముందు దేశంలోని అతి కీలకమైన పెద్ద రాష్ట్రాలు మధ్యప్రదేశ్ - రాజస్థాన్ - చత్తీస్ ఘడ్ తో పాటు తెలంగాణ - మిజోరంలకు ఎన్నికలు జరిగాయి. సార్వత్రికానికి సెమీ ఫైనల్ గా భావిస్తున్న ఈ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడుతున్నాయి. దేశం మొత్తం బిగబట్టి చూస్తున్న ఈ ఎన్నికల ఫలితాల కోసం ఈ ఉదయం 8 నుంచే లెక్కింపు మొదలెట్టారు.. మొదట పోస్టల్ బ్యాలెట్లు - తర్వాత ఈవీఎంలు లెక్కిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో గెలుపు ఎవరిదనేది ఉత్కంఠ రేపుతోంది. టీఆర్ఎస్-కాంగ్రెస్ కూటమి విజయం కోసం పోరాడుతున్నాయి. ఇక మధ్యప్రదేశ్ - రాజస్థాన్ - చత్తీస్ ఘడ్ - మిజోరంలలో బీజేపీ- కాంగ్రెస్ హోరాహోరీగా తలపడుతున్నాయి.

క్షణక్షణం అభ్యర్థుల మెజార్టీ - గెలుపుపై తుపాకీ లైవ్ అప్డేట్ ఇస్తోంది. అంతేకాదు తెలంగాణలో ప్రతిష్టాత్మక భావిస్తున్న నేతల గెలుపోటములపై సమాచారాన్ని నిమిషం నిమిషం తెలియజేస్తాం. పైన టేబుల్స్ లో ఏ రాష్ట్రంలో ఏ పార్టీకి మెజార్టీ.. గెలిచిన స్థానాలను మీరు చూడొచ్చు.. మరింత సమాచారం కొరకు తుపాకీ.కామ్ ఫాలో అవ్వండి

*8.53 : కొడంగల్ లో పోస్టల్ బ్యాలెట్ లో టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం మహేందర్ రెడ్డి ఆధిక్యం, తొలి రౌండ్ లో ఈవీఎం పోలింగ్ లో రేవంత్ రెడ్డి ఆధిక్యం

*8.55: తొలి రెండు రౌండ్లలో నిర్మల్ ఎమ్మెల్యే, తాజా మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి వెనుక. కాంగ్రెస్ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి వెనుకంజ

*8.55: తుంగతుర్తిలో టీఆర్ఎస్ అభ్యర్థి గాదరి కిషోర్ 48 ఓట్ల ఆధిక్యం

* 8.56: జగిత్యాలలో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ తొలి రెండు రౌండ్లలో ఆధిక్యం

*8.59: సిద్దిపేటలో టీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి హరీష్ రావు 13 వేల ఆధిక్యంతో దూసుకుపోతున్నారు.

*8.59: తొలి రెండు రౌండ్లలో మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముందంజ

*9.12: ప్రతిష్టాత్మక కూకట్ పల్లి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి సుహాసినిపై టీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు ఆధిక్యం

*9.12: వేములవాడలో టీఆర్ఎస్ అభ్యర్థి చెన్నమేని రమేశ్ బాబు ఆధిక్యం

*9.13: నాగార్జున రెడ్డిలో కాంగ్రెస్ శాసనసభాపక్షనేత , కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి వెనుకంజ.. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య ముందజం

*9.12: మధిరలో తొలి రౌండ్ లో కాంగ్రెస్ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్క టీఆర్ఎస్ అభ్యర్థికంటే వెనుకబడ్డారు.

*9.15: వరంగల్ పశ్చిమలో టీఆర్ఎస్ అభ్యర్థి ధాస్యం వినయ్ భాస్కర్ ముందంజ

*9.15: పాలేరులో టీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధిక్యం

*9.15: సూర్యపేటలో మంత్రి జగదీశ్ రెడ్డి వెనుకంజ. కాంగ్రెస్ అభ్యర్థి దామోదర్ రెడ్డి ముందంజ

*9.18: కొడంగల్ లో రేవంత్ రెడ్డి రెండో రౌండ్లో 651 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు

*9.17: సత్తుపల్లిలో టీడీపీ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య ఆధిక్యం

*9.17: జూబ్లిహిల్స్ లో మాగంటి గోపినాథ్ (టీఆర్ఎస్) అభ్యర్థి ముందంజ

*9.18: కొడంగల్ లో రేవంత్ రెడ్డి రెండో రౌండ్లో 651 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు

*9.19: ఖైరతాబాద్ లో టీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ ముందంజలో ఉన్నారు.

*9.19: కోదాడలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ భార్య పద్మారెడ్డి వెనుకంజలో ఉన్నారు. అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు.

*9.21: సిరిసిల్లలో 3వేల ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి కేటీఆర్ ముందంజ

*9.23: సనత్ నగర్ లో టీఆర్ఎస్ అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధిక్యం

*9.23: జనగామలో కాంగ్రెస్ అభ్యర్థి పొన్నాల లక్ష్మయ్య వెనుకంజ

*9.25: ఖానాపూర్ లో బీజేపీ అభ్యర్థి అశోక్ ముందంజ

*9.25: కామారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్ అలీ వెనుకంజ.. టీఆర్ఎస్ అభ్యర్థి గంపగోవర్ధన్ ముందంజ

*9.25:పెద్దపల్లిలో టీఆర్ఎస్ అభ్యర్థి మనోహర్ రెడ్డి ఆధిక్యం

*9.26:మంథనిలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీధర్ బాబు ఆధిక్యం

*9.26: మూడో రౌండ్లో జగిత్యాలలో జీవన్ రెడ్డి వెనుకంజ. టీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ ముందంజ

*9.27: జడ్చర్లలో టీఆర్ఎస్ ఆధిక్యం

*9.27: సెటిలర్లు ఎక్కువగా ఉన్న శేరిలింగంపల్లిలో 3వేల ఆధిక్యంతో టీఆర్ఎస్ ఆధిక్యం. టీడీపీ అభ్యర్థి భవ్య ఆనందప్రసాద్ వెనుకబడ్డారు.

*9.27: షాద్ నగర్ లో టీఆర్ఎస్ అభ్యర్థి అంజయ్య ముందంజ

*9.30: గజ్వేల్ లో కాంగ్రెస్ అభ్యర్థి, సీఎం కేసీఆర్.. కాంగ్రెస్ అభ్యర్థిపై 5వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

*9.30: చెన్నూర్ లో టీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ ముందంజ

*9.31:ఆంధోల్ లో టీఆర్ఎస్ అభ్యర్థి క్రాంతి కిరణ్ ఆధిక్యం

*9.32: హుజూర్ నగర్ లో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధిక్యం.. టీఆర్ఎస్ అభ్యర్థి సైదారెడ్డి వెనుకంజ

*9.33: కొల్లాపూర్ లో మంత్రి జూపల్లి ఆధిక్యం

*9.32: పరకాలలో కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ వెనుకంజలో ఉండడం విశేషం. టీఆర్ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి వెనుకంజ

*9.34: నల్గొండలో సంచలనం.. బలమైన కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి ఆధిక్యం..

*9.46: మానకొండూర్ లో టీఆర్ఎస్ అభ్యర్థి రసమయి బాలకిషన్ ఆధిక్యం

*9.46: వనపర్తిలో టీఆర్ఎస్ అభ్యర్థి నిరంజన్ రెడ్డి ఆధిక్యం

*9.48: ముషీరాబాద్ లో టీఆర్ఎస్ అభ్యర్థి ముఠాగోపాల్ ఆధిక్యం

*9.50: సంగారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డి ఆధిక్యం

*9.51: కూకట్ పల్లిలో నాలుగో రౌండ్ లో టీఆర్ఎస్ అభ్యర్థి కృష్ణారావు ఆధిక్యం

*9.52: గద్వాలలో కాంగ్రెస్ అభ్యర్థి డీకే అరుణ వెనుకబడడం సంచలనంగా మారింది. అక్కడ టీఆర్ెస్ ముందంజలో ఉంది.

*9.53: మధిరలో మూడో రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి భట్టి విక్రమార్క ముందంజలోకి వచ్చారు..

*9.54: చాంద్రాయణ గుట్టలో ఎంఐఎం అభ్యర్థి అక్బరుద్దీన్ ఆధిక్యం..

*9.54: సిద్దిపేటలో టీఆర్ఎస్ అభ్యర్థి హరీష్ రావు దూకుడు.. నాలుగో రౌండ్ ముగిసే సరికి 35 వేలకు పైగా ఆధిక్యం.

లైవ్ ఆప్డేట్స్- 5 రాష్ట్రాల ఎన్నికలు

దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. తెలంగాణలో టీఆర్ఎస్ జోరు కనిపిస్తుండగా.. రాజస్థాన్ లో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్ లోనూ కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు సాధిస్తుండడం విశేషం. మిజోరంలో ఎంఎన్ఎఫ్ ఆధిక్యంలో ఉంది.

* 5 రాష్ట్రాల ఎన్నికల్లో వివిధ పార్టీల అభ్యర్థులు ముందంజలో ఉన్న స్థానాలు ఇవే..
------------------
రాజస్థాన్ లో - బీజేపీ 78, కాంగ్రెస్ 101, బీఎస్పీ 3, ఇతరులు 13

మధ్యప్రదేశ్ లో -బీజేపీ 102, కాంగ్రెస్ 104, బీఎస్పీ 5, ఇతరులు 6

చత్తీస్ ఘడ్ లో - బీజేపీ 27, కాంగ్రెస్53, బీఎస్పీ+జేసీసీ 6, ఇతరులు 2

మిజోరం లో- బీజేపీ 1, కాంగ్రెస్8, ఎంఎన్ఎఫ్ 26, ఇతరులు 0

తెలంగాణలో -టీఆర్ఎస్ 88, కాంగ్రెస్ 15, బీజేపీ 4, ఎంఐఎం 5, ఇతరులు 3

*11.00: అచ్చంపేటలో బాలరాజు (టీఆర్ఎస్) ఆధిక్యం

*11.00: ఖైరతాబాద్ లో చింతల రాంచంద్రరెడ్డి (బీజేపీ) వెనుకంజ, దానం నాగేందర్ (టీఆర్ఎస్) ముందంజ

*11.00: అంబర్ పేటలో కిషన్ రెడ్డి (బీజేపీ) ముందంజ

*11.00: మహేశ్వరలో సబితా ఇంద్రారెడ్డి (కాంగ్రెస్) ఆధిక్యం

*11.00: శేరిలింగంపల్లిలో అరికపూడి గాంధీ (టీఆర్ఎస్) ఆధిక్యం

*11.01: కుతుల్బాపూర్ వివేకానంద (టీఆర్ఎస్) ఆధిక్యం

*11.02: తాండూర్ లో పట్నం మహేందర్ రెడ్డి (టీఆర్ఎస్) ఆధిక్యం

*11.02: మెదక్ లో పద్మా దేవందర్ రెడ్డి (టీఆర్ఎస్) ఆధిక్యం

*11.02:ములుగులో సీతక్క (కాంగ్రెస్) ఆధిక్యం

*11.02: చొప్పదండిలో సుంకె రవికిషన్ (టీఆర్ఎస్) ఆధిక్యం

*11.02:కొడంగల్ లో ఐదోరౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డిపై ముందంజలో ఉన్నారు.

*11.02: కొత్తగూడెంలో కాంగ్రెస్ అభ్యర్థి వనమా వేంకటేశ్వరరావు ఆధిక్యం

*11.02 : సిద్దిపేటలో హరీష్ రావు 7వ రౌండ్ ముగిసేసరికి 50వేల పైచిలుకు ఆధిక్యం

*ఖమ్మం జిల్లా పినపాక, కొత్తగూడెం, అశ్వారావుపేటలో కాంగ్రెస్ ముందంజ

*11.02: నాగర్ కర్నూల్ లో టీఆర్ఎస్ ముందంజ

*11.02: హుజూరాబాద్ లో టీఆర్ఎస్ అభ్యర్థి ఈటెల రాజేందర్ ముందంజ..

*12.00:మంత్రి, సిద్దిపేట టీఆర్ఎస్ అభ్యర్థి హరీష్ రావు 92వేల మెజార్టీతో గెలుపొందారు. లక్ష మెజార్టీకి 8వేల దూరంలో ఆయన నిలిచిపోయారు.

*12.00: ఆదిలాబాద్ లో మంత్రి, కాంగ్రెస్ అభ్యర్థి జోగురామన్న ముందంజ

*12.00: కంటోన్మెంట్ లో సాయన్న (టీఆర్ఎస్) గెలుపు

*12.00: కోరుట్లలో విద్యాసాగర్ రావు (టీఆర్ఎస్ ) గెలుపు

*12.00:గజ్వేల్ లో సీఎం కేసీఆర్ ముందంజ, 8వ రౌండ్ ముగిసేసరికి 31వేల ఆధిక్యంలో కేసీఆర్.

*12.00:మంథనిలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీధర్ బాబు 8వ రౌండ్ ముగిసేసరికి 10వేల ఓట్ల మెజార్టీ

*12.00: తాండూర్ లో రోహిత్ రెడ్డి (కాంగ్రెస్) 7వేల మెజార్టీ

*12.00: కొడంగల్ లో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి 7వేల ఓట్ల ఆధిక్యం

*12.25: సిద్దిపేట టీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి హరీష్ రావు సంచలనం సృష్టించారు. ఆయన తన సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై లక్షా 2వేల మెజార్టీతో 16వ రౌండ్ ముగిసేసరికి దూసుకుపోతున్నారు.

*12.25: గద్వాలలో బండ కృష్ణామోహన్ రెడ్డి (టీఆర్ఎస్), కాంగ్రెస్ అభ్యర్థి డీకే అరుణపై ఆధిక్యం..

*12.30 : మంత్రులు తుమ్మల, జూపల్లి, చందూలాల్, స్పీకర్ మధుసూదనచారి ఎదురీత

*12.30: అంబర్ పేటలో కిషన్ రెడ్డి (బీజేపీ) 32వేల ఆధిక్యం

*1:32: కొల్లాపూర్‌లో మంత్రి జూపల్లి కృష్ణారావు ఓటమి పాలయ్యారు

*1.33 : ఓటమి మరింత బాధ్యతను పెంచింది : రేవంత్‌ రెడ్డి

*ఈరోజు సాయంత్రం తెలంగాణభవన్ లో టీఆర్ఎస్ ఎల్పీ ఎమ్మెల్యేల సమావేశం

*టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా కేసీఆర్ ను ఎన్నుకోనున్నారు..

*మంచి ముహూర్తాల దృష్ట్యా రేపు 12వ తేదీ లేదా, 14వ తేదీన కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

*కేసీఆర్ ఒక్కరా, లేదా మంత్రులను ప్రమాణ స్వీకారం చేస్తారా అన్నది తేలాల్సి ఉంది.