Begin typing your search above and press return to search.
ఫలితం తేలాల్సినవి 5 రాష్ట్రాలు.. బైడెన్ కు కావాల్సిన ఓట్లు 6
By: Tupaki Desk | 5 Nov 2020 12:50 PM GMTచేతిలో రెండు ఓవర్లు.. కావాల్సిన పరుగులు ఆరు మాత్రమే అయితే.. గెలుపు అవకాశం ఎంతన్న విషయాన్ని అడిగిన వెంటనే వచ్చే ప్రశ్న.. చేతిలో ఎన్ని వికెట్లు ఉన్నాయని. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇప్పుడు అలాంటి పరిస్థితే నెలకొంది. మేజిక్ ఫిగర్ అయిన 270 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లకు ఇప్పుడు 264 ఓట్లు సాధించిన డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్.. మరో ఆరు ఓట్లు అవసరమవుతాయి. ఇంకా ఐదు రాష్ట్రాల్లో ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. ఏముంది.. సింఫుల్ గా లెక్క తేలిపోతుందని అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే.. క్రికెట్ లో మాదిరి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎప్పుడైనా.. ఏమైనా జరిగే వీలుందన్నది మర్చిపోకూడదు.
బైడెన్ కు అవసరమైన ఆరు ఓట్లను ఫలితం వెలవడాల్సిన ఐదు రాష్ట్రాలు ఇస్తాయా? ఆ అవకాశం ఎంత ఉందన్న విషయంలోకి వెళితే.. అక్కడి పరిస్థితులు. బైడెన్ గెలుపు అవకాశాల్ని మదింపు చేస్తే ఇలాంటి పరిస్థితి ఉంది. బైడెన్ భవిష్యత్తును తేల్చే ఆ ఐదు రాష్ట్రాలు ఇవే.
1. పెన్సిల్వేనియా
2. జార్జియా
3. నార్త్ కరోలినా
4. నెవెడా
5. అలస్కా
పెన్సిల్వేనియా విషయానికి వస్తే.. ప్రస్తుతానికి ఇక్కడ ట్రంప్ కే అధిక్యత ఉంది. 50.7 శాతం ఓట్లతో అధిక్యతలో ఉన్నారు. 49.2 శాతం ఓట్లు బైడెన్ కు పోల్ అయ్యాయి. ఇంకా లెక్కించాల్సిన పోస్టల్ ఓట్ల మీద డెమొక్రాట్లు ఆశగా ఎదురుచూస్తున్నారు.
జార్జియా విషయానికి వస్తే.. ఈ రాష్ట్రంలోనూ ట్రంప్ దే పైచేయి. అయితే.. ట్రంప్.. బైడెన్ మధ్య వ్యత్యాసం చాలా స్వల్పంగా ఉంది. ట్రంప్ కు 49.6 శాతం ఓట్లు వస్తే.. బైడెన్ కు 49.2 శాతం ఓట్లు పోల్ అయ్యాయి. ఇద్దరి మధ్యా నువ్వా నేనా? అన్నట్లుగా పోటీ సాగుతోంది. అయితే.. ఉన్న స్వల్ప అధిక్యత పోస్టల్ ఓట్లలో ఎక్కడ చేజారిపోతుందోనన్న ఆందోళన ట్రంప్ వర్గీయుల్లో నెలకొంది.
నార్త్ కరోలినా రాష్ట్రానికి వస్తే.. ఇక్కడా ట్రంప్ అధిక్యతలో ఉన్నారు. జార్జియాతో పోలిస్తే.. నార్త్ కరోలినా రాష్ట్రంలో ట్రంప్ పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది. ఎందుకంటే.. ఆయనకు ఇప్పటివరకు లెక్కించిన ఓట్లలో 50.1 శాతం రాగా.. బైడెన్ కు 48.7 శాతం ఓట్లు ఉన్నాయి. ఇంకా బ్యలెట్ ఓట్లు.. పోస్టల్ ఓట్లు లెక్కలోకి తీసుకోవాల్సి ఉంది.
నెవెడా రాష్ట్రానికి వస్తే.. ఇక్కడ బైడెన్ అధిక్యతలో ఉన్నారు. 49.3 శాతం ఓట్లలో ఆయన అధిక్యతలో ఉంటే.. ట్రంప్ నకు 48.7 శాతం ఓట్లు వచ్చాయి. ఈ రాష్ట్రంలో ఇదే అధిక్యతను బైడెన్ కొనసాగితే..ఆయనకు మేలు జరగటం ఖాయం. బైడెన్ కు మరో సానుకూలాంశం ఏమంటే.. ఇప్పటివరకు అక్కడ 75 శాతం ఓట్లను లెక్కించారు. ఇంకా 25 శాతం ఓట్లు లెక్కించాల్సి ఉండటం.. కొందరు బైడెన్ కు పాజిటివ్ అంటే.. మరికొందరు ట్రంప్ నకు అనుకూలమంటున్నారు. మరి.. ఓటర్ల తీర్పు ఏమిటో చూడాలి.
అలస్కా రాష్ట్రానికి వస్తే.. ఇక్కడ ఓట్ల లెక్కింపు చాలా ఆలస్యమవుతుందని చెబుతున్నారు. ఇప్పటివరకు ఇక్కడ లెక్కించిన ఓట్లు..మొత్తం పోలైన ఓట్లలో 60 శాతం కంటే తక్కువగా చెబుతున్నారు. వీటిల్లో 62.9 శాతం ఓట్లు ట్రంప్ కు వస్తే..బైడెన్ కు 33 శాతం ఓట్లు ఉన్నాయి. 45 శాతం ఓట్లను లెక్కించాల్సి ఉన్న నేపథ్యంలో.. బైడెన్ కు కలిసి వస్తుందా? అన్నది ప్రశ్న. మొత్తంగా చూస్తే.. పోటీ నువ్వా నేనా? అన్నట్లుగా ఉండటమే కాదు.. సీట్ల గెలుపులో ముందంజలో ఉన్నా.. గెలుపు తీరానికి చేరతానా? లేదా? అన్న టెన్షన్ పుట్టేలా పరిస్థితులు ఉండటం గమనార్హం.