Begin typing your search above and press return to search.

చీతాల రాకతో భయంతో వణుకుతున్న ఆ ఐదు ఊళ్లు

By:  Tupaki Desk   |   19 Sep 2022 4:09 AM GMT
చీతాల రాకతో భయంతో వణుకుతున్న ఆ ఐదు ఊళ్లు
X
వెండితెర మీద మంచు పర్వతాలు.. దాని అందాల్ని చూసినంతనే పరవశించిపోవటమే కాదు.. ఆ సినిమాటిక్ అనుభూతిని రియల్ టైంలో మిస్ అవుతున్నామని తెగ ఫీలైపోయేటోళ్లు చాలామందే కనిపిస్తారు. కానీ.. ఆ రీల్ ను అలా చూపించటం కోసం రియల్ గా ఆ చిత్ర టీం పడిన కష్టాన్ని ఆ ఆనంద క్షణాల్లో మర్చిపోతుంటాం. ఇప్పుడు చెప్పే ఉదంతం కూడా ఆ కోవలోకే వస్తుంది. నాణెనికి ఒక వైపు ఉండే బొమ్మకు భిన్నంగా మరోవైపు బొరుసు కూడా ఉంటుందన్న వాస్తవం మర్చిపోవటం చాలామంది చేసేదే.

ఏడు దశాబ్దాల క్రితం దేశంలో అంతరించిన చీతాల్ని దేశానికి తీసుకొచ్చిన ఆనందాన్ని దేశంలో పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తమవుతుంటే.. ఆ చీతాల్ని వదిలిన మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్కు సమీపంలోని నాలుగైదు గ్రామాల వారు భయంతో వణుకుతున్నారు.

నమీబియా నుంచి తీసుకొచ్చిన ఈ చీతాలు తమ పొట్ట కొట్టటం ఖాయమని అక్కడి గ్రామీణులు భయాందోళనలకు గురవుతున్నారు. చీతాల రాకతో.. పార్కుకు సంబంధించిన భూసమీకరణ పనులు మరింత వేగం పుంజుకోవటం ఖాయమని చెబుతున్నారు.

అదే జరిగితే నాలుగైదు ఊళ్ల వారు నిర్వాసితులు అవుతామన్న ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. చీతాల రాకతో నాలుగైదు గ్రామాల భవిష్యత్తు ఆందోళనకరంగా మారిందని వాపోతున్నారు. గడిచిన పదిహేనేళ్లుగా కునో పార్కు కోసం జరుపుతున్న భూసేకరణతో ఆర్థికంగా ఎంతో చితికిపోయినట్లుగా వాపోతున్నారు.

అయితే.. ఈ చీతాల కారణంగా పర్యాటకం పెరిగి.. ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్న వాదనకు భిన్నంగా నాలుగైదు గ్రామాల వారు మాత్రం ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. చీతాల రాకతో కచ్ఛితంగా పార్కు కు సంబంధించిన భూసేకరణ కార్యక్రమం మరింత వేగం పుంజుకోవటం ఖాయమని.. దీంతో.. తమ ఉపాధికి కష్టంగా మారుతుందంటున్నారు.

చీతాల రాకతో.. జరిగే లాభం కంటే కూడా నష్టమే ఎక్కువన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చీతాల రాకతో తమకు భయం పెరిగిందని.. తామిప్పుడు ఎక్కడికి వెళ్లాల్సి ఉంటుందో అన్న ఆందోళనను అక్కడి స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. మరి.. వీరి ఆందోళనకు తెర దించేలా ప్రభుత్వం తమ విధానాల గురించి స్పష్టంగా పేర్కొంటే బాగుంటుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.