Begin typing your search above and press return to search.

రూ.65వేల ఐస్ క్రీమ్ లు ఆర్డర్ చేసిన ఐదేళ్ల బుడ్డోడు!

By:  Tupaki Desk   |   17 Dec 2021 5:00 AM IST
రూ.65వేల ఐస్ క్రీమ్ లు ఆర్డర్ చేసిన ఐదేళ్ల బుడ్డోడు!
X
చిన్నపిల్లలు ఫోన్లలో గేమ్స్ ఆడడం వల్ల ఎన్నో అనర్ధాలు జరుగుతున్న విషయం తెల్సిందే. చిన్నారుల ఆరోగ్య సమస్యలు, సైబర్ మోసాలు వంటివి జరుగుతున్నాయి. ఓ బాలుడు గేమ్ ఆడుతుండగా... కొన్ని నోటిఫికేషన్లు వచ్చాయి. ఇంకేం అతడికి తెలియకా చకాచకా క్లిక్ చేశాడు. అంతే చాంతాడా అంతా లిస్టుతో ఉన్న ఫుడ్ ఐటెమ్స్ బుక్ అయ్యాయి.

ఖరీదైన ఐస్ క్రీములు, డ్రింకులను ఊబర్ ఈట్ యాప్ ద్వారా ఆర్డర్ పెట్టాడు. అవన్నీ కూడా ఆ బుడ్డోడి తండ్రి ఆఫీసు అడ్రస్ కు వచ్చాయి. కాగా ఆయన ఆ ఆరోజు ఆఫీసుకు వెళ్లలేదు. అయినా కూడా ఈ ఫుడ్ ఐటెమ్స్ కోసం వెళ్లాల్సి వచ్చింది.

బాలుడు ఆర్డర్ చేసిన ఐటమ్స్ లో మొత్తం 14 జార్ల డుల్సి డీలిచె స్ప్రెడ్, ఆరు ఐస్ క్రీమ్ బాక్సులు, ఐదు మిల్క్ బాటిళ్లు, ఏడు కేకులు ఆర్డర్ చేశాడని తెలుస్తోంది. గేమ్ ఆడుతున్న సమయంలోనే తెలియక వీటిని ఆర్డర్ పెట్టినట్లు ప్రముఖ ఐస్ క్రీమ్ కంపెనీ గెలాటో మెస్సినా తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పేర్కొంది.

అవి తెలియక ఆర్డర్ చేసినా కూడా బాలుడి తండ్రి ఆఫీసు అడ్రస్ లో డెలివరీ చేసినట్లు పేర్కొంది. అయితే వీటన్నింటిన చూసిన చిన్నారి తండ్రి మాత్రం ఒక్కసారిగా విస్తుపోయాడట. వాటిని ఏం చేయాలో తెలియక ఆఫీసులోని ఆయన స్నేహితులకు పంచి పెట్టాడట.

గేమ్ ఆడుతూ చిన్నారి ఫుడ్ డెలివరీ చేసిన విషయాన్ని అతడి తండ్రి గ్రహించలేకపోయారు. కాగా బుక్ అయినట్లు మెసేజ్ వచ్చిన తర్వాత ఈ విషయం తెల్సింది. అగ్నిమాపక శాఖలోని ఓ విభాగంలో పనిచేసే ఆయన... చేసేది లేక వచ్చిన ఫుడ్ అంతా కూడా తీసుకున్నారు. ఇక ఆఖరకు వచ్చిన బిల్లును చూసి షాకయ్యారు.

చిన్నారి చేసిన తప్పిదం వల్ల ఏకంగా రూ.65వేల మూల్యం చెల్లించుకున్నారు. ఆ బిల్లు కూడా బుడ్డోడి కంటే పొడవుగా ఉండడం గమనార్హం. బిల్లుతో కూడిన బాలుడి ఫొటో సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం వైరల్ గా మారింది.

చిన్నారి ఇంతపెద్ద మొత్తంలో ఫుడ్ ఆర్డర్ చేయడంపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. బాలుడి కంటే బిల్లు పెద్దగా ఉందని కొందరు నవ్వుతూ కామెంట్ చేశారు. ఇకపై పిల్లలకు ఫోన్ ఇవ్వొద్దు అంటూ మరికొందరు సలహా ఇస్తున్నారు. పిల్లలు ఫోన్లు వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని పలువురు అభిప్రాయపడ్డారు.

పిల్లలు ఆన్ లైన్ లో వస్తువులు, ఫుడ్ ఐటమ్స్ ఆర్డర్ చేయడం వంటి సంఘటనలు ఇది వరకు చాలా జరిగాయని నెటిజన్లు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఓ చిన్నారి తన తల్లి ఫోన్ తో ఏకంగా సోఫా బుక్ చేసింది. ఆడుకుంటున్న సమయంలో ఫర్నిచర్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ ను క్లిక్ చేసింది. ఈ విధంగా ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయని కామెంట్ చేస్తున్నారు.