Begin typing your search above and press return to search.
సీబీఐ, ఈడీ చీఫ్ ల పదవీ కాలం ఐదేళ్ళా ?
By: Tupaki Desk | 15 Nov 2021 6:15 AM GMTసెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చీఫుల పదవీకాలాన్ని కేంద్రప్రభుత్వం తాజాగా ఐదేళ్ళకు పొడిగించింది. ప్రస్తుతం వీళ్ళిద్దరి పదవీ కాలం 2 ఏళ్ళు మాత్రమే. పార్లమెంటు బిల్లు ప్రవేశపెట్టడం ద్వారా పెంచుకోవాల్సిన పదవీ కాలాన్ని నరేంద్రమోడి సర్కార్ ఆర్డినెన్సుద్వారా పెంచేసుకున్నది. ఈ నెల 29వ తేదీనుండి మొదలవ్వబోతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్ల బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదింప చేసుకోవాలన్నది మోడి సర్కార్ ఆలోచన.
నిజంగానే పై రెండు దర్యాప్తు సంస్దల చీఫ్ ల పదవీ కాలాన్ని ఐదేళ్ళకు పెంచటమన్నది వివాదాస్పదమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈడీకన్నా సీబీఐ పనితీరు దేశవ్యాప్తంగా చాలా వివాదాస్పదమైన విషయం అందరు చూస్తున్నదే. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన దర్యాప్తు సంస్ధ రాజకీయ నేతల ఒత్తిళ్ళకు లొంగిపోయి వాళ్ళ ఆదేశాలకు తగ్గట్లుగా పనిచేస్తోందనే ఆరోపణలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.
ఇదే విషయమై సుప్రింకోర్టు మాట్లాడుతు స్వతంత్రంగా వ్యవహరించాల్సిన సీబీఐ పాలకుల చేతిలో ‘పంజరంలో చిలకలాగ తయారైంది’ అంటూ తీవ్రంగా ఆక్షేపించిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. తన పనితీరుతో సీబీఐ తనంతట తానుగానే విశ్వనీయతపై చెత్త వేసుకుంది. ఒకపుడు సీబీఐ విచారణ అంటే ఇంకేముంది అన్నీ నిజాలు బయటకు వచ్చేస్తాయని, నిందితులు దొరికిపోతారని, న్యాయస్ధానాల్లో శిక్షలు పడిపోతాయనే అభిప్రాయం జనాల్లో ఉండేది.
అయితే కాలం గడిచేకొద్దీ పాలకులు సీబీఐని తమ చెప్పుచేతల్లోకి తీసేసుకున్నారు. ప్రత్యర్ధులను వేధించటానికి సీబీఐ దర్యాప్తు, విచారణను ఒక అస్త్రంగా వాడుకోవటం మొదలుపెట్టారనే ఆరోపణలు బాగా పెరిగిపోయాయి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా సీబీఐపై ఇలాంటి ఆరోపణలు వస్తుండటం గమనార్హం. దాంతో సీబీఐ అంటే జనాల్లో నమ్మకం కూడా పోయే పరిస్ధితి వచ్చేసింది. ఇదే సమయంలో కొన్ని కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారితో లేకపోతే నిందితులతోనే సీబీఐ చీఫ్ స్వయంగా భేటీలు జరిపినట్లు ఆధారాలతో సహా బయటపడ్డాయి.
ఇలాంటి వివాదాస్పద వ్యవహారాలతో సీబీఐ చీఫ్ పదవిని కూడా గబ్బుపట్టించిన వారున్నారు. పైగా అత్యంత వివాదాస్పద సర్వీసున్నవారిని చీఫ్ లుగా నియమించినపుడు కూడా నానా గోలైంది. నిజానికి సీబీఐ చీఫ్ పదవీకాలం 2 ఏళ్ళంటేనే చాలా ఎక్కువ. ఎందుకంటే చీఫ్ గా ఉన్నవాళ్ళు స్వతంత్రంగా వ్యవహరించి బ్రహ్మాండాన్ని బద్దలుకొట్టేదేమీ ఉండదు. పాలకులు చెప్పినట్లు తలూపటం, వాళ్ళ ఆదేశాలకు తగ్గట్లు పనిచేయటం మినహా ఇపుడు చేస్తున్నదేమీ లేదు. ఇంతోటిదానికి వీళ్ళ పదవీకాలాన్ని రెండేళ్ళ నుండి ఐదేళ్ళకు పెంచటమం వేస్టనే అనుకోవాలి.