Begin typing your search above and press return to search.
బూస్టర్ డోసు పై ఫైజర్ పరిశోధన రిపోర్టు ఏం చెప్పింది?
By: Tupaki Desk | 26 Jan 2022 10:37 AM GMTమూడో వేవ్ ముంచుకొచ్చేసి.. ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వేళ.. బూస్టర్ డోసు మీద అందరి చూపు పడింది. మొన్నటి వరకు బూస్టర్ డోస్ వేసుకోవాలా? వద్దా? అనుకున్న వారు సైతం.. ఇప్పుడు ఈ డోసు కోసం బారులు తీరుతున్నారు. ఇంతకీ బూస్టర్ డోసుతో కలిగే ప్రయోజనం ఎంత? అన్నది ప్రశ్నగా మారింది. దీనికి సమాధానం ఇచ్చేలా.. ఫైజర్ - బయో ఎన్ టెక్ టీకాను బూస్టర్ డోసుగా తీసుకున్న వారిపై ఎలాంటి ప్రభావం చూపుతోంది? కరోనా నుంచి వారు ఎంతమేర రక్షణ ఉంటుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. తాజా పరిశోధన ఫలితాలు..ఎన్నో సందేహాలకు సమాధానాలు ఇచ్చేలా ఉన్నాయి.
ఈ పరిశోధనకు సంబంధించిన పూర్తి వివరాల్ని రివ్యూ చేయనప్పటికీ.. ప్రాథమికంగా ఏయే అంశాల్ని ప్రస్తావించారన్న విషయంలోకి వెళితే..
- బూస్టర్ డోసు తీసుకున్న తర్వాత వైరస్ ను అడ్డుకోగల యాంటీ బాడీలు నాలుగునెలల పాటు స్థిరంగా ఉన్నాయి.
- బూస్టర్ డోసు తర్వాత నాలుగో షాట్ డోసు తీసుకోవాల్సిన అవసరం కనిపించలేదు
- బూస్టర్ డోస్ తీసుకున్న వారిలో దాదాపుమూడు నెలల పాటు యాంటీ బాడీలుఉన్నాయి.
- బూస్టర్ డోస్ ఒమిక్రాన్ వేరియంట్ ను గణనీయంగా అడ్డుకుంటున్నాయి
- సాధారణ వ్యాక్సిన్ వేసుకున్న నెల తర్వాత పరీక్షలు చేయిస్తే.. శరీరంలో యాంటీబాడీలు ఒమిక్రాన్ పై పని చేసే స్థితిలో ఉండవు.కానీ.. బూస్టర్ డోసు తర్వాత ఇమ్యూన్ రక్షణ వ్యవస్థను పునరుత్తేజ పరుస్తుంది.
- మూడో డోసు తర్వాత వచ్చ యాంటీ బాడీలు నాలుగు నెలల తర్వాత తగ్గుతాయా? లేదా? అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
- రెండు డోసులు మాత్రమే తీసుకున్న వారిలో మాత్రం యాంటీ బాడీలు వేగంగా తగ్గిపోతున్నట్లు గుర్తించారు.
- కొందరిలో నెల రోజుల తర్వాతే ఇవి శరీరంలో తగ్గిపోతున్నాయి.