Begin typing your search above and press return to search.

ఏపీలో ప్లాట్లు.. కొనుగోలుదారుల పాట్లు..!

By:  Tupaki Desk   |   31 Oct 2019 8:43 AM GMT
ఏపీలో ప్లాట్లు.. కొనుగోలుదారుల పాట్లు..!
X
రెక్కలు ముక్కలు చేసుకొని నెలనెలా డబ్బు దాచుకొని మన చిరకాల వాంఛ అయిన సొంత ఇళ్లును కొనుగోలు చేస్తాం. గ్రామాల్లో అయితే ఇండిపెండెంట్ ఇళ్లు సాధ్యమే..కానీ సిటీలో అది సాధ్యం కాదు. అంత లక్షలు, కోట్లు పెట్టలేం. అందుకే అందరూ నగరాల నడిబొడ్డున ఉండేలా ప్లాట్లను కొనుగోలు చేస్తారు. ఏపీలో ఇలానే నగరాల్లో ప్లాట్ల కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. కానీ వారికి రక్షణగా నిలువాల్సిన ప్రభుత్వ సంస్థ నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు కొనుగోలు దారులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది.

ఏపీలో ప్లాట్లు కొనే వారికి కష్టాలు మొదలయ్యాయి. అపార్ట్ మెంట్లలో సమస్యలపై ఫిర్యాదు చేసినా స్పందన రావడం లేదట.. ఏపీ ప్రభుత్వం ఏర్పాడ్డాక కొనుగోలు దారులకు రక్షణగా ‘ఆంధ్రప్రదేశ్ స్థిరాస్తి వ్యాపార నియంత్రణ సంస్థ’(ఏపీ రెరా)ను ప్రభుత్వం ఏడాదిన్నర క్రితం చంద్రబాబు హయాంలో ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటికీ కొనుగోలు దారులు అపార్ట్ మెంట్ల వల్ల సమస్యలపై ఫిర్యాదులు చేస్తున్న ఏపీ రెరా సంస్థ నిమ్మకు నీరెత్తనట్టు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.

రాష్ట్రంలో ఇప్పటికే 2000 అపార్ట్ మెంట్లు నిర్మాణం ఉన్నాయి. వీటిని పర్యవేక్షించాల్సిన ఏపీ రెరా పట్టించుకోవడం లేదు. దీంతో ఇప్పటివరకు రెరాలో 935 వ్యాపార సంస్థలే అపార్ట్ మెంట్స్ పై దరఖాస్తులు చేశాయి. 2017 మే 1 నుంచి అపార్ట్ మెంట్ల వివరాలు అన్ని రెరాలో నమోదు చేయాల్సి ఉన్నా ఆ విభాగం పట్టించుకోవడం లేదు.

రెరా చేతులు ముడుచుకొని కూర్చోవడంతో బిల్డర్లు ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది. బిల్డర్లు కొనుగోలుదారులకు రిజిస్ట్రేషన్ చేయకపోవడం.. అదనంగా డబ్బు వసూలు చేయడం.. ప్లాట్లు అప్పగించకపోవడంపై రెరాకు ఇప్పటికే ఫిర్యాదు చేస్తున్నా ఆ సంస్థ పట్టించుకోవడం లేదు. కొనుగోలు దారులు మాత్రం తమ హక్కుల రక్షణకు రెరా స్పందించాలని కోరుతున్నారు.