Begin typing your search above and press return to search.

దీపావళి సీజన్ లో ఫ్లైట్ జర్నీ ప్లాన్ చేస్తున్నారా? అయితే.. ఈ షాక్ తప్పదు

By:  Tupaki Desk   |   21 Sep 2022 1:30 AM GMT
దీపావళి సీజన్ లో ఫ్లైట్ జర్నీ ప్లాన్ చేస్తున్నారా? అయితే.. ఈ షాక్ తప్పదు
X
మిగిలిన పండగలు ఎన్ని ఉన్నా.. దీపావళికి ఉండే హడావుడి అంతా ఇంతా కాదు. దక్షిణాదితో పాటు ఉత్తరాదిన కూడా ఈ పండక్కి ఇచ్చే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఈ పండుగ సందర్భంగా దేశీయ కార్పొరేట్ ప్రపంచం మొత్తం కళకళలాడిపోతూ ఉంటుంది. ఈ పండక్కి ఇచ్చే ప్రాధాన్యత కాస్తంత ఎక్కువే. ఈ సమయంలో ఫ్లైట్ జర్నీ చేయాలనుకునే వారికి ఛార్జీల మోత తప్పదని చెప్పక తప్పదు. గత ఏడాదితో పోలిస్తే.. ఈ సీజన్ లో టికెట్ల ధర భారీగా పెరగనుంది.

విమాన టికెట్ చార్జీలపై 20 నుంచి 30 శాతం వరకు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుందని చెబుతున్నారు. దీపావళి సీజన్ లో ప్రయాణానికి ముందస్తుగా టికెట్ల బుకింగ్ జోరు పెరగటమే కాదు.. విమాన ఇంధనం ధరలు భారీగా పెరగటం కూడా టికెట్ల ధరల మీద ప్రభావాన్ని చూపుతున్నాయని చెబుతున్నారు.

గత ఏడాది సెప్టెంబరుతో పోలిస్తే ఈసారి ఎటీఎఫ్ కోసం ఎయిర్ లైన్స్ 83 శాతం అధికంగా చెల్లించాల్సి వస్తోందని చెబుతున్నారు. దసరా.. దీపావళి సీజన్ లో విహార యాత్రల కోసం ఆన్ లైన్ సెర్చ్ లు దాదాపు పాతిక శాతానికి పైనే పెరిగినట్లుగా చెబుతున్నారు.

దాదాపుగా రెండేళ్ల తర్వాత ప్రయాణాల మీద ఆంక్షలు లేకపోవటంతో డిమాండ్ పెరిగిందని చెప్పక తప్పదు. కరోనాకు ముందు ఎలాంటి డిమాండ్ అయితే ఉందో.. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ అలాంటి డిమాండ్లు చూస్తున్నట్లుగా చెబుతున్నారు.

పండుగల సందర్భంగా ప్రయాణాల వృద్ధి 35 శాతం వరకు ఉండొచ్చన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా విడుదలైన ఒక డేటా ప్రకారం కొన్ని నగరాల మధ్య సర్వీసులకు అమితమైన డిమాండ్ ను గుర్తించారు. ఈ రూట్లలో ఛార్జీల మోత ఎక్కువగా ఉంది.

అలా డిమాండ్ ఉన్న దేశీయ రూట్లను చూస్తే.. ఢిల్లీ-ముంబై.. బెంగళూరు-ఢిల్లీ.. హైదరాబాద్‌-ఢిల్లీ ప్రధానమని చెప్పొచ్చు. వీటి సగటు ఛార్జీలు 20 నుంచి 33 శాతం మధ్య పెరగటం గమనార్హం. ఇదే సమయంలో కోల్ కతా - ఢిల్లీ.. కోల్ కతా - ముంబయి, ఢిల్లీ - ముంబయి, ఢిల్లీ - బెంగళూరు మధ్య విమాన టికెట్ల చార్జీలు కేవలం 2 నుంచి ఏడు శాతం మధ్య పెరిగితే.. అందుకు భిన్నంగా ముంబై-ఢిల్లీ, బెంగళూరు-ఢిల్లీ, హైదరాబాద్‌-ఢిల్లీ మార్గాల్లో మాత్రం చార్జీలు 20 నుంచి 33 శాతం పెరగటం గమనార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.