Begin typing your search above and press return to search.
ప్రజలని మోసం చేస్తున్న విమానాయాన సంస్థలు!
By: Tupaki Desk | 15 April 2020 5:10 AM GMTకరోనా కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను మే 3 వరకు పొడిగిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విమాన సర్వీసులకు సంబంధించి కేంద్ర పౌరవిమానయానశాఖ స్పష్టతనిచ్చింది. అన్ని దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను మే 3వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. కాగా, మార్చి 24న మోదీ లాక్ డౌన్ ప్రకటన చేయడానికి ముందే అంతర్జాతీయ సర్వీసులపై భారత్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఏప్రిల్ 14 వరకు బుకింగ్స్ ని రద్దు చేసింది.
కాగా , లాక్ డౌన్ మొదట ఏప్రిల్ 14 తో ముగుస్తుంది అని చెప్పడంతో.. దానికి అనుగుణంగా కొన్ని విమానయాన సంస్థలు బుకింగ్ ప్రారంభించాయి. కానీ , కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని కేంద్రం లాక్ డౌన్ ను మే 3 వరకు పొడగించడంతో టికెట్లను రద్దు చేసినా, డబ్బులు మాత్రం నగదు రూపేణా తిరిగి ఇవ్వకూడదని విమానయాన సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఆ డబ్బులను తమ వద్దే పెట్టుకుంటామని, లాక్ప్ర డౌన్ తరువాత బుకింగ్ చేసుకునేటప్పుడు ఆ డబ్బుని ప్రయాణికులు వాడుకోవచ్చని చెప్పాయి.
మరికొన్ని సంస్థలు ఈ ఏడాది చివరకు మరికొన్ని ఏడాదికాలం వరకు బుకింగ్ లకు ఈ డబ్బులను ఉపయోగించు కోవచ్చు అని తెలిపాయి. మే 3 వరకు ప్రయాణాల కోసం ఎవరైతే టికెట్లు బుకింగ్ చేసుకున్నారో.. ఆ టికెట్లను రద్దు చేస్తున్నాం. టికెట్లు రద్దు చేశాక మీ డబ్బును మా వద్దే భద్రంగా అట్టేపెడుతాం. 2021 ఫిబ్రవరి 28 వరకు అదే ప్రయాణికుడు ఎప్పుడు కొత్తగా బుకింగ్ చేసుకోవాలనుకున్నా ఆ డబ్బులను ఉపయోగించుకోవచ్చు అని స్పైస్ జెట్ , ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థలు తెలిపాయి. అలాగే గోఎయిర్ సంస్థ ... ‘ప్రొటెక్ట్ యువర్ పీఎన్‌ఆర్’ పథకం 2020 మే 3 వరకు వర్తిస్తుందని తెలిపింది. ఈ పథకానికి అర్హత పొందిన వినియోగదార్లకు వచ్చే ఏడాది మే 3 వరకు ఎలాంటి రుసుం చెల్లించకుండానే ప్రయాణ తేదీని మరో తేదీకి మార్చుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు వెల్లడించింది. దీన్ని బట్టి చూస్తే ..విమానయన సంస్థలు ప్రజలను మోసం చెసాతున్నాయా అనే అనుమానం వ్యక్తం అవుతుంది. లాక్ డౌన్ పై ఒక క్లారిటీ రాకముందే బుకింగ్స్ ఓపెన్ చేసి ..ఇప్పుడు రిఫండ్ ఇవ్వలేం అని , తరువాత వాడుకోవాలని చెప్పడంపై పలువురు పెదవి విరుస్తున్నారు.