Begin typing your search above and press return to search.
థ్యాంక్స్ మోడీజీ మరో బాదుడకు కేంద్రం ఓకే
By: Tupaki Desk | 20 March 2021 10:30 AM GMTఏమైనా మోడీ సర్కారు తీరే వేరు. ఆయన ప్రధాని కాక ముందు.. కేంద్రం కారణంగా ధరలు పెరిగితే తీవ్ర విమర్శలు చేసే వారు. అలాంటి వారిలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నమోడీ కూడా ఉండేవారు. ఎప్పుడైతే ఆయన ప్రధాని అయ్యారో.. అప్పటి నుంచి కేంద్రం కారణంగా ధరలు పెంచాల్సి వస్తే.. అది దేశం కోసం అంటూ కలర్ ఇవ్వటంషురూ చేశారు. చివరకు పరిస్థితి ఎలా తయారైందంటే.. ధరలు పెంపును తప్పుపట్టటం అంటే.. దేశద్రోహిగా మాటలు అనిపించుకునే వరకు వెళుతోంది.
దేశ చరిత్రలో ఎప్పుడూ లేనంతగా పెట్రోల్.. డీజిల్ ధరల్ని పెంచేసిన మోడీ సర్కారు పుణ్యమా అని మరికొన్ని ధరలు కూడా పెరుగుతున్నాయి. తాజాగా విమానయాన సంస్థలు టికెట్ల ధరలు పెంచుకోవటానికి వీలుగా కేంద్రం ఓకే చెప్పేసింది. ఈ ఏడాదిలో ఇలా ధరలు పెరగటం ఇది రెండోసారి. విమానాల ఇంధనం ధరలు భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో.. ఆ భారాన్ని మోయలేని విమానయాన సంస్థలు ఇప్పుడు టికెట్ల ధరల పెంపు దిశగా అడుగులు వేస్తున్నాయి.
అయితే.. విమాన టికెట్ల ధరల పెంపునకు కేంద్రం ఓకే చెప్పాల్సి ఉంది. దేశీయ ఎయిర్ ఫేర్ బ్యాండ్ ను 5 వాతం పెంచుతూ కేంద్రంతాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో.. విమానయాన సంస్థలు విమాన టికెట్ల ధరల్ని పెంచేందుకు వీలవుతుంది. అంతకంతకూ పెరిగే ధరలు భారం అవుతున్నాయన్న బాధ వద్దు. ఎందుకంటే.. దేశం కోసం ఆ మాత్రం త్యాగం చేయలేరా? మోడీని నమ్మి ఓట్లు వేసిన వారంతా.. తమ నమ్మకాన్ని నిలబెట్టే నమోకు ఒక పెద్ద థ్యాంక్స్ చెప్పాల్సిందే.