Begin typing your search above and press return to search.

ఫ్లైట్ నడుపుతూ శృంగారం.. వీడియో షేర్ చేసిన యువతి..

By:  Tupaki Desk   |   27 May 2022 7:30 AM GMT
ఫ్లైట్ నడుపుతూ శృంగారం.. వీడియో షేర్ చేసిన యువతి..
X
ప్రపంచం ఓ వైపు అన్ని రకాల అభివృద్ధి చెందుతున్న తరుణంలో సమాజంలో వింతలు చోటు చేసుకుంటున్నాయి. శృంగార విషయంలో కొందరు భిన్నంగా ఆలోచిస్తూ సమాజాన్ని పెడదోవ పట్టిస్తున్నారు. మహిళల అవసరాలను ఆసరాగా చేసుకుంటున్న కొందరు వారిని లోబరుచుకొని వారిపై అఘాయిత్యానికి పాల్పడుతున్నారు.

ఆ తరువాత వారితో పాటు వారు లోబరుచుకున్న వారిని రోడ్డున పడేస్తున్నారు. తాజాగా ఉద్యోగం కోసం వచ్చిన ఓ యువతిని ఫైలట్ లోబరుచుకున్నాడు. ఆమెతో శృంగారం జరిపిస్తూ అడ్డంగా దొరికిపోయాడు. అక్కడా ఇక్కడా కాదు.. ఏకంగా నడుస్తున్న ఫ్లైట్లోనే ఈ పని చేసి వార్తల్లో నిలిచాడు. ఈ వీడియో సోషల్ మీడియాలోకి రావడంతో రచ్చ రచ్చయింది. ఆ తరువాత వారి ఉద్యోగాలు పోయాయి. అసలు స్టోరీ ఏంటంటే..?

ఫైలట్ కావాలనే లక్ష్యంతో ఓ యువతి ట్రైనీగా జాయిన్ అయింది. దీంతో ఫ్లెయిన్స్ లో జర్నీ చేస్తూ శిక్షణ పొందుతోంది. అయితే తనకు శిక్షణ ఇచ్చే ఫైలట్ ఆమె అందానికి ముగ్ధుడయ్యాడు. దీంతో ఆమెకు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు.

తనకు శిక్షణ ఇచ్చే ఫైలట్ కాబట్టి ఆ యువతి ఏం చేసినా అడ్డు చెప్పలేకపోయింది. దీంతో ఫ్లైట్ నడుస్తుండగానే ఆమెతో శృంగారాన్ని జరిపాడు. అయితే యువతి సహకారంతోనే ఈ పనిచేసినా నడుస్తున్న ఫ్లైట్ లో ఇలా చేయడంతో సదరు ఎయిర్ సంస్థ ఆగ్రహానికి గురైంది. దీంతో వారిపై చర్యలు తీసుకుంది.

రియాజాన్ ప్రాంతంలో సెస్నా 172 అనే విమానంలో 28 సంవత్సరాలు ఓ యువతి ఫైలట్ గా శిక్షణ పొందుతోంది. ఆమెకు శిక్షణ ఇచ్చే ఓ ఫైలట్ తనకు ట్రైనింగ్ ఇస్తూ.. ఎక్స్ ట్రా క్లాసుల పేరిట తనతో ఉండాలని చెప్పాడు. దీంతో శిక్షణ పొందాలనే ఉద్దేశంతో ఫైలట్ మాట విని అతనితో ఉంది. అయితే సదరు యువతికి నడుస్తున్న ఫైయిట్లో ట్రైనింగ్ ఇస్తూ కొంచెం దూరం వెల్లగా ఆటో మోడ్లోకి పెట్టాడు. ఆ తరువాత యువతిని లోబరుచుకొని శృంగారాన్ని జరిపాడు. అంతేకాకుండా ఆ వీడియోను మొబైల్ ఫోన్లో రికార్డు చేశాడు.

ఇదే సమయంలో అక్కడ శిక్షణ పొందుతున్న మరో యువతి వీరి వీడియోను తీసి సోషల్ మీడియాలోకి షేర్ చేసింది. దీంతో ఈ విషయం ఎయిర్ సంస్థకు తెలియగానే ఫైలట్ తో పాటు ట్రైనీ ఫైలట్ ను విధుల నుంచి తొలగించింది. కానీ ఈ వీడియో వైరల్ కాకముందే ఆ యువతి రిజైన్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఆ తరువాత తనకు ఎక్స్ ట్రా క్లాసులు చెబుతానని హామీ ఇవ్వడంతోనే అతనితో శృంగారానికి ఒప్పుకున్నట్లు తెలిపింది.