Begin typing your search above and press return to search.
ఆఫ్ఘనిస్థాన్ నుంచి భారతీయులతో బయల్దేరిన విమానం !
By: Tupaki Desk | 17 Aug 2021 7:30 AM GMTఅఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకోవడంతో భారత్ అప్రమత్తమయ్యింది. ప్రస్తుతం కాబూల్‌లో వందలాది మంది భారతీయులు ఉన్నారు. వారందరినీ సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రణాళిక రూపొందించింది. కాబూల్ లోని భారత రాయబార కార్యాలయంలో పని చేసే సిబ్బంది తో పాటు భారతీయుల ప్రాణాలకు ఎలాంటి హాని జరగకుండా చర్యలు చేపట్టినట్లు స్పష్టం చేశాయి. ఆ తర్వాత పరిస్థితులు గంట గంటకి మారిపోతుండటంతో ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన C-17 యుద్ధ విమానం, కాబూల్ ఎయిర్ పోర్ట్ నుంచి ఢిల్లీకి వచ్చేందుకు కాసేపటి కిందట బయలుదేరింది.
ఆ విమానంలో మొత్తం 120 మంది భారతీయ అధికారులు ఉన్నారు. వారిలో చాలా మంది అక్కడి భారత రాయబార కార్యాలయంలో పనిచేసేవారు ఉన్నారు. వారంతా, నిన్న సాయంత్రమే కాబూల్ ఎయిర్ పోర్టుకి వచ్చారు. అప్పటి నుంచి వారిని తరలించడం సాధ్యం కాలేదు. తాజాగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అమెరికా దళాలతో మాట్లాడుకొని వారిని తరలించేందుకు వీలు కుదిరేలా చేసింది. ఫలితంగా వారంతా ఆనందంగా బయలుదేరారని తెలిసింది.
ఆఫ్ఘనిస్థాన్ గగనతలాన్ని అమెరికా తన కంట్రోల్ లోకి తెచ్చుకోవడంతో అక్కడి నుంచి భారతీయుల్ని తరలించడం ఎయిర్ ఇండియాకి ఒకింత ఇబ్బందిగా ఉంది. సేఫ్ గా తరలించే ప్రయత్నాలు మాత్రం జరుగుతున్నాయి. భారత విదేశాంగ శాఖ,ప్రత్యేక ఆఫ్ఘనిస్థాన్ సెల్ ఏర్పాటు చేసింది. దీని ద్వారా ఆఫ్ఘనిస్థాన్ లో ఉన్నవారు ఇండియా వచ్చేందుకు అన్ని రకాల సాయమూ పొందే వీలు ఉంది. అంతేకాదు, విదేశాంగ శాఖ ఓ మొబైల్ నంబర్ కూడా ఇచ్చింది. అది +919717785379.
దీంతోపాటూ ఈమెయిల్ ఐడీ కూడా ఇచ్చింది. అది MEAHelpdeskIndia@gmail.com ఇప్పుడు ఎవరైనా సరే ఆప్ఘనిస్థాన్ నుంచి సాయం కోరేవారు ఈ నంబర్ లేదా మెయిల్ ఐడీ ద్వారా . అధికారులను సంప్రదించవచ్చు అని ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. కాబూల్ ఎయిర్‌పోర్టులో ఇంత గందరగోళ పరిస్థితులు ఉన్నా కూడా... ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ కావడంపై భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కాబూల్ సరిహద్దులన్నీ మూసుకుపోయాయి. కాబూల్ సమీపంలోని జలాలాబా ద్‌ను సైతం తాలిబన్లు ఆక్రమించడంతో నగరం మొత్తం దిగ్భంధనంలో చిక్కుకున్నట్లయ్యింది. దీంతో కాబూల్ నుంచి బయటకు వెళ్లాలన్నా, తిరిగి రావాలన్నా కేవలం విమాన మార్గమే మిగిలింది. స్వదేశానికి తిరిగి వెళ్లేవారితో కాబూల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు కిక్కిరిసిపోతోంది. చాలామంది తమ సామానుతో సహా ఇక్కడ పడిగాపులు కాస్తున్నారు. అఫ్గానిస్తాన్‌ను బాహ్య ప్రపంచంతో అనుసంధానించడానికి కాబూల్ ఎయిర్‌పోర్టులో కార్యకలాపాలు యథాతథంగా కొనసాగేలా సహకారం అందిస్తున్నట్లు ‘నాటో’ ప్రకటించింది.