Begin typing your search above and press return to search.

విమానాలు బందేనా? ఎయిర్ ఇండియాపై పిడుగు

By:  Tupaki Desk   |   11 Oct 2019 10:36 AM GMT
విమానాలు బందేనా? ఎయిర్ ఇండియాపై పిడుగు
X
ఇప్పటికే అప్పుల్లో కూరుపోయి నిర్వహణ భారంతో కునారిల్లుతున్న ఎయిర్ ఇండియా సంస్థపై మరో పిడుగుపాటు పడింది. మరో వారం రోజుల తర్వాత ఎయిర్ ఇండియా విమానాలన్నీ నడిచే పరిస్థితి లేదట.. ఈనెల 18 నుంచి భారత విమానయాన రంగంలో సంక్షోభం మొదలు కాబోతోందట.. ప్రభుత్వ రంగ ఎయిర్ ఇండియాకు 18వ తేదీ నుంచి ఇంధనం సరఫరా చేయబోమని చమురు రంగ సంస్థలు తేల్చిచెప్పాయి.

పాత బకాయిలు పేరుకుపోయాయని... అవి చెల్లించేంతవరకు ఎయిర్ ఇండియాకు ఇంధనం అందించబోమని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, భారత్ పెట్రోలియం, హిందుస్తాన్ పెట్రోలియం సంస్థలు స్పష్టం చేశాయి. 8 నెలలుగా ఈ కంపెనీలు ఎయిర్ ఇండియాకు ఇంధనం సరఫరా చేస్తున్నాయి. 5వేల కోట్ల బకాయిలు ఎయిర్ ఇండియా చెల్లించాల్సి ఉంది.

ఆగస్టులోనే 5000 కోట్ల బకాయిలు తీర్చాలని ఎయిర్ ఇండియా డిమాండ్ చేసి సరఫరా నిలుపుదలకు చర్యలు తీసుకున్నాయి. కానీ కేంద్ర పౌర విమానాయన శాఖ కల్పించుకొని చక్కదిద్దింది. కానీ ఇప్పటికీ చెల్లించకపోవడంతో 18 నుంచి సరఫరాను నిలిపివేయాలని డిసైడ్ అయ్యాయి.

ఎయిర్ ఇండియా ఇప్పటికే 60వేల కోట్ల అప్పుల్లో ఉంది. చమురుకంపెనీలు ఇంధనం సరఫరా నిలిపివేస్తే విమాన సేవలు నిలిచిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే జరిగితే భారత ఏవియేషన్ చరిత్రలోనే అతిపెద్ద సంక్షోభంగా మారి విమానాలు ఎక్కడికక్కడే నిలిచిపోయే పరిస్థితి దాపురిస్తుంది.