Begin typing your search above and press return to search.
షిర్డి సాయి భక్తులకు స్వీట్ న్యూస్
By: Tupaki Desk | 22 Sep 2017 4:42 AM GMTనిజంగానే.. షిర్డీ సాయి భక్తులకు ఇది స్వీట్ న్యూస్. రవాణా వ్యవస్థ ఇంత పెరిగిన తర్వాత కూడా షిర్డీకి వెంటనే వెళ్లి రావాలంటే కుదరని పని. లక్షలాది మంది భక్తులు నిత్యం షిర్డీ వెళ్లినా.. నేరుగా ఫ్లైట్ లో వెళ్లే సౌకర్యం లేకపోవటం దీనికో కారణంగా చెప్పాలి. ఇప్పటివరకూ షిర్డీకి నేరుగా వెళ్లాలంటే రైలు లేదంటే బస్సు కాదంటే కారు. అయితే.. ఈ ప్రయాణం గంటల కొద్దీ సాగి చాలా సమయం పట్టే పరిస్థితి.
నేరుగా విమాన సౌకర్యం లేకపోవటం దీనికో కారణంగా చెప్పాలి. ఎవరైనా విమానంలో వెళ్లాలంటే షిర్డీకి కాస్త దూరంగా ఉండే ఔరంగాబాద్ లేదంటే.. ముంబయికి వెళ్లి అక్కడ నుంచి కారులోనో.. బస్సు.. రైలులోనే చేరుకోవాల్సిన పరిస్థితి. ఇకపై అలాంటి తిప్పలన్నీ తొలిగిపోనున్నాయి. షిర్డీ నాథుడ్ని దర్శించుకోవాలంటే నేరుగా విమానంలోనే వెళ్లే అవకాశం రానుంది.
షిర్డీకి కేవలం 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాక్డీ గ్రామంలో రూ.350 కోట్ల ఖర్చుతో 400 హెక్టార్లలో ఎయిర్ పోర్ట్ ను నిర్మించారు. మహారాష్ట్ర విమానయాన సంస్థ యాజమాన్య బాధ్యతల్ని నిర్వహించనుంది. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ సేవల్ని ప్రారంభించేందుకు లైసెన్స్ జారీ అయ్యాయి. విమాన సర్వీసులు ప్రారంభం తర్వాత పర్యాటకంగా షిర్డీ మరింత డెవలప్ కావటం ఖాయమంటున్నారు. గంటల వ్యవధిలో షిర్డీ నాథుడ్ని దర్శించుకునే అవకాశం భక్తులకు కలగనుందన్న మాట.