Begin typing your search above and press return to search.

దేశీయంగా విమానం ఎగిరే రోజు దగ్గరకు వచ్చేసినట్లేనా?

By:  Tupaki Desk   |   7 May 2020 6:15 AM GMT
దేశీయంగా విమానం ఎగిరే రోజు దగ్గరకు వచ్చేసినట్లేనా?
X
కరోనా కారణంగా ప్రజాజీవితం ఎంతలా ఛిన్నాభిన్నమైందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కలలోకూడా ఊహించని పరిణామాలు ఎన్నో చోటు చేసుకుంటున్నాయి ప్రపంచవ్యాప్తంగా. కరోనాకు చెక్ చెప్పేందుకు లాక్ డౌన్ అమలు చేస్తున్న వేళ.. కోట్లాది మంది ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. రోజులు కాస్తా వారాలు కావటమే కాదు.. ఇప్పుడు నెలలుగా మారుతున్నాయి. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం లాక్ డౌన్ 3.0 అమలవుతోంది. ఇలాంటి వేళ.. ప్రజా రవాణా ఎప్పుడు మొదలువుతుందన్నది ప్రశ్నగా మారింది.

బస్సు.. రైలు కంటే ముందు విమాన సర్వీసులే మొదలవుతాయన్న మాట వినిపిస్తోంది. ఇప్పటివరకూ అందుతున్న సమాచారం ప్రకారం మే 15నాటికి దేశీయంగా విమాన సర్వీసుల్ని ఎప్పటి నుంచి షురూ చేస్తారన్న దానిపై క్లారిటీ వచ్చే వీలుందని చెబుతున్నారు. మే 17 వరకు లాక్ డౌన్ 3.0 అమలు కానుంది. ఇదిలా ఉంటే.. లాక్ డౌన్ కు సంబంధించి సడలింపులు.. మరింత పొడిగించటం లాంటి అంశాలపై మే 15న సమీక్షించనున్నారు. ఈ సందర్భంగా దేశీయంగా విమాన సర్వీసుల్ని స్టార్ట్ చేసే అంశంపై కీలక ప్రకటన వెలువడుతుందని చెబుతున్నారు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కరోనాతో సహజీవనం చేస్తూ బతుకు బండిని లాగించటం తప్పించి మరో మార్గం లేదన్ విషయం ఒక్కొక్కరుగా చెబుతున్నారు. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఈ విషయాల్ని స్పష్టం చేస్తున్నాయి. అన్ని అనుకున్నట్లు జరిగితే మే మూడో వారం కానీ నాలుగో వారం కానీ దేశీయంగా పలు పరిమితుల మధ్య విమాన సర్వీసులు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది.

తొలిదశలో దేశీయంగా పలుప్రముఖ నగరాల మధ్య విమాన సర్వీసుల్ని ప్రారంభించనున్నారు. అయితే.. విమాన సామర్థ్యంలో 33 శాతాన్ని మాత్రమే వినియోగిస్తూ విమానాల్ని నడుపుతారు. ఈ ప్రయోగం సక్సెస్ అయితే.. ఆ తర్వాత ఆక్యుపెన్సీ రేటును పెంచాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. పరిస్థితులు మరిత చక్కపడే వరకూ రైలు.. బస్సులు లాంటి వాటికి మరింత సమయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. సో.. లాక్ డౌన్ తర్వాత తొలి విమానం మే చివర నాటికి ఎగిరే అవకాశం ఉన్నట్లేనని చెప్పాలి.