Begin typing your search above and press return to search.
వణికిస్తోన్న ‘బిగ్ బిలియన్ డేస్’ సేల్
By: Tupaki Desk | 11 Oct 2015 5:30 PM GMTఆన్ లైన్ వర్గాల్లోనే కాదు.. మార్కెట్ వర్గాలకు ఇప్పుడో కొత్త భయం పట్టుకుంది. ఈ కామర్స్ కంపెనీల జోరు ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సమయానికి తగ్గట్లుగా బారీ ఆఫర్ లతో కస్టమర్ల మనసుల్ని దోచుకుంటూ భారీగా వ్యాపారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కామర్స్ లో అగ్రశ్రేణి సంస్థల్లో ఒకటైన ఫ్లిప్ కార్ట్ మరో రెండు రోజుల్లో బిగ్ బిలియన్ డేస్ పేరిట భారీగా సేల్ ను చేపట్టాలన్న విషయం తెలిసిందే.
ఐదు రోజుల పాటు సాగే ఈ బిగ్ బిలియన్ డేస్ సేల్ తో ప్రత్యేక ఆఫర్లతో వినియోగదారుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తారన్న అంచనాలు ఉన్నాయి. దాదాపు 5 కోట్ల మంది వినియోగదారుల్ని ఆకర్షించాలని భావిస్తున్న ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ మీద భారీ ఆశల్నే పెట్టుకుంది. ఈ నెల 13 నుంచి 17 వరకు నిర్వహిస్తున్న ఈ మహా సేల్ వెనుక పెద్ద వ్యూహమే ఉంది. పండుగ సీజన్లో నిర్వహిస్తున్న ఈ సేల్ తో.. మార్కెట్లో భారీ వాటాను తన సొంతం చేసుకోవాలని భావిస్తోంది.
పండుగ సమయాల్లో వచ్చే బోనస్ లతో పాటు.. ప్రతి ఏటా దసరా సమయంలో ప్రత్యేక షాపింగ్ చేయటం అలవాటు. ఈ సమయంలో జరిగే అమ్మకాల మీద వ్యాపార వర్గాలు ప్రత్యేకంగా ఫోకస్ చేస్తాయి. ఈ సమయంలో ఫ్లిప్ కార్ట్ నిర్వహిస్తున్న ఈ సేల్ తమ వ్యాపారాల మీద తీవ్రంగా ప్రభావం చూపిస్తుందన్న భయాందోళనలు మార్కెట్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.
దీనికి తగ్గట్లే ఫ్లిప్ కార్ట్ మార్కెటింగ్ వ్యూహం ఉందంటున్నారు. 5 కోట్ల మంది వినియోగదారుల్ని ఆకర్షించాలని భావిస్తున్న సదరు కంపెనీ.. పోస్టల్ కార్డుల సాయంతో వినూత్నంగా ప్రచారం చేస్తోంది. ఇప్పటికి 5 లక్షల మందికి పోస్టల్ కార్డులతో ప్రచారం చేసింది. ఈ పోస్ట్ కార్డులో బిగ్ బిలియన్ డేస్ సేల్ గురించి ప్రస్తావిస్తూ వీటిని పంపింది. రానున్న రెండు రోజుల్లో మరింత భారీగా పోస్టల్ కార్డు పంపే వీలుందని చెబుతున్నారు.
ఈ సేల్ ను కేవలం మొబైల్ యాప్ లోనే నిర్వహించటం మరో విశేషం. డెస్క్ టాప్ మీద కాకుండా మొబైల్ యాప్ ద్వారానే ఈ సేల్ ను నిర్వహిస్తోంది. తమ వినియోగదారుల్లో అత్యధికులు మొబైల్ ఫోన్ ద్వారానే కొనుగోలు చేస్తున్నారని అందుకే.. ఈ మహా సేల్ ను మొబైల్ యాప్ మాత్రమే ఇస్తున్నామని కంపెనీ తెలియజేస్తుంది.
గత కొద్ది రోజులుగా హాట్ టాపిక్ గా మారిన బిగ్ బిలియన్ డేస్ సేల్.. ఓపెన్ అయ్యాక మరెన్ని సంచలనాలు సృష్టిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఎందుకుంటే.. ఈ సేల్ లో ప్రకటించనున్న ఆఫర్లు భారీగా ఉంటాయన్న అంచనాలు ఉన్నాయి. మరి.. వినియోగదారుల అంచనాల్నిఫ్లిప్ కార్ట్ ఎంతమేరకు నిజం చేస్తుందో చూడాలంటే 13 వరకు ఆగాల్సిందే.