Begin typing your search above and press return to search.

ఆకాశంలో సిటీ చైనాలో కనిపించింది

By:  Tupaki Desk   |   21 Oct 2015 9:51 AM GMT


వింతలు.. విశేషాలు మామూలే. కానీ.. హాలీవుడ్ సినిమాల్లో మాదిరి ఓ భారీ వింత చైనాలో కనిపించింది ప్రపంచం దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. ఆకాశంలో ఒక నగరం ఆవిష్కృతమై అందరిని విస్మయానికి గురి చేస్తోంది. మబ్బుల మధ్యన తేలియాడుతూ కనిపించిన ఈ నగరాన్ని చూసిన వారు నోరు వెళ్లబెట్టే పరిస్థితి. ఇదెలా జరుగుతుందన్న విషయాన్ని ఎవరూ కచ్ఛితంగా చెప్పలేనప్పటికీ.. ఈ నగరం కేవలం మూడు నిమిషాలు మాత్రమే కనిపించి మాయం కావటం మరింత సంచలనంగా మారింది.

చైనాలోని జియాంగ్జీ నగరంలో చోటు చేసుకుంది. మేఘాలలో తేలియాడే ఈ నగరాన్ని చూసిన వారంతా షాక్ తినే పరిస్థితి. ఏం జరుగుతుందో అర్థం చేసుకొని చేతిలో ఉన్న సెల్ ఫోన్ లో కెమేరాలు సర్దుకునే లోపల ఈ వింత కాస్త మాయమైంది. అయితే.. అప్పటికే ఓ పెద్దాయన మాత్రం చటుక్కున స్పందించి కెమేరాను ఆన్ చేయటంతో ఈ వింత ప్రపంచానికి చిత్ర సాక్ష్యంగా నిలిచింది. ఇప్పటికి ఈ యూట్యూబ్ చిత్రాన్ని దాదాపు 40 లక్షల మంది చూడటం గమనార్హం.

ఈ ఫోటోకి ఇంత పాపులారిటీ రావటంతో పాటు.. ఈ విశేషం మీద రకరకాల ఊహాగానాలు.. అభిప్రాయాలు మొదలయ్యాయి. కొందరేమో దీన్ని నాసా సృష్టిగా చెబుతున్నారు. తన కొత్త ప్రాజెక్టులో భాగంగా ఇలాంటిదేదో నాసా రూపొందించిందని చెబుతూ.. దీన్ని బీమ్ టెస్ట్ ప్రాజెక్టు అన్న పేరు కూడా చెప్పేస్తున్నారు.

ఇక.. మరికొందరి మాటలు చూస్తే ఇది మరో ప్రపంచమని.. వారు కాసేపు వచ్చి పోయారని కొందరంటే.. మరికొందరేమో హోలోగ్రాఫిక్ టెక్నాలజీతో ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. మరికొందరైతే.. ఇదంతా ఒట్టి భ్రమ.. ఇలాంటివి ఎలా సాధ్యమని తేల్చేస్తున్నారు. మరి.. ఈ ఫోటో ఏమిటంటే మాత్రం వారుసూటిగా సమాధానం చెప్పటం లేదు.