Begin typing your search above and press return to search.

అమెరికాలో మారణహోమం : రెండు రోజుల రెక్కీ

By:  Tupaki Desk   |   15 Feb 2018 12:48 PM GMT
అమెరికాలో మారణహోమం : రెండు రోజుల రెక్కీ
X
అమెరికాలో గ‌న్ క‌ల్చర్ అమాయ‌కుల ప్రాణాలు తీసింది. స్కూల్లో పూర్వ విద్యార్ధి కాల్పులు జ‌ర‌ప‌డంతో 17మంది విద్యార్ధులు చ‌నిపోయారు. విద్యార్ధుల తో పాటు టీచ‌ర్లు కూడా ఉన్నారు. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం పార్క్ ల్యాండ్ లోని మార్జోయ్ స్టోన్ మన్ డగ్లస్ స్కూల్లో 19 ఏళ్ల నికోలస్ క్రూజ్ కాల్పుల‌కు తెగ‌బ‌డ్డాడు.

ఈ దారుణ ఘ‌ట‌న పై కొన్ని విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. నికోల‌స్ తీరు స‌రిలేద‌నే కార‌ణంతో స‌స్పెండ్ చేసినందుకు ఉక్రోషంతో ర‌గిలిపోయి కాల్పులు జ‌రిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. అయితే నికోల‌స్ అమెరికాలో ఓ నిషేదిత సంస్థ‌లో భాగ‌స్వామ్యం కావ‌డంతో స్కూల్ యాజ‌మాన్యం అత‌డ్ని స‌స్పెండ్ చేసింది. అప్ప‌టి నుంచి స్కూల్ కు దూరంగా ఉన్న నిందితుడు సైకోగా మారాడు.

తొల‌త కాల్పుల‌కు ముందు ఏం జ‌రిగింద‌నే విష‌యాన్ని విశ్లేషిస్తే..స్కూల్ నుంచి స‌స్పెండ్ అయిన నికోల‌స్ స్కూల్లో దాడులు చేసేందుకు కుట్ర‌ప‌న్నాడు. కుట్ర ప్ర‌కారం తాను అనుకున్న రోజు రానే వ‌చ్చి. స్థానిక కాలమానం ప్రకారం మంగ‌ళ‌వారం ఉదయం స్కూల్లో రిహార్స‌ల్స్ నిర్వ‌హించారు. ఆ త‌రువాత రోజే బుధ‌వారం కాల్పులు జ‌ర‌పాల‌ని కుట్ర ప‌న్నిన క్రూస్ మొహానికి ముసుగువేసుకొని ప్ర‌మాద‌క‌ర‌మైన ఏఆర్ -15 రైఫిల్ తో స్కూల్ లోపలికి వ‌చ్చాడు. వస్తూనే.. గేటు వద్ద ముగ్గురుని కాల్చేసిన అతడు.. ఆ వెంటనే బిల్డింగ్ ఫైర్ అలారంను మోగించాడు.

ఆ శబ్ధంతో ఉపాధ్యాయులు మొదలు.. విద్యార్థులంతా ఒక్కసారిగా బయటకు వచ్చే ప్రయత్నం చేశాడు. వారు బయటకు వెళ్లే ద్వారం వద్ద ఎదురుగా నిలబడిన ఆగంతుకుడు బయటకు వచ్చిన వారిని వచ్చినట్లుగా కాల్చేశాడు.

ఆ కాల్పులు జ‌రిగిన క్ష‌ణంలో ఏం జ‌రిగింద‌నే విష‌యాన్ని అదే స్కూల్లో చ‌దువుతున్న భార‌తీయ విద్యార్ధి లింగ శెట్టి అభిరామ్ క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లుగా చూపించాడు. నిజానికి స్కూల్లో డ్రిల్ నిర్వ‌హిస్తున్న‌ట్లు పొర‌బ‌డ్డామ‌ని అన్నాడు. కాల్పుల శ‌బ్ధం రాగానే తాను డెస్క్ కింద దాక్కున్నట్లు - త‌న టీచ‌ర్ అలా చేయాల‌ని చెప్పారు. అప్పుడే త‌న‌కు గ‌న్ షాట్స్ వినప‌డ్డాయని - అది పోలీస్ డ్రిల్ అని అనుకున్నా కానీ సైర‌న్ మోత రావ‌డంతో అనుమానం వ‌చ్చి దాక్కున్న‌ట్లు వివ‌రించాడు.

కాల్పుల అనంత‌రం నిందితుడు త‌ప్పించుకోవాల‌నే ఉద్దేశంతో స్కూల్ విద్యార్ధుల‌తో బ‌య‌ట‌కు వ‌చ్చాడు. అప్ప‌టికే సిద్ధంగా ఉన్న పోలీసులు క్రూస్ ను ఆధీనంలోకి తీసుకొని బుల్లెట్ మ్యాగ‌జైన్ ను స్వాధీనం చేసుకున్నారు.

కాల్పుల అనంత‌రం నిందితుణ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు. ఈ ద‌ర్యాప్తులో పోలీసుల‌కు క‌ళ్లు బైర్లు క‌మ్మే వాస్త‌వాల్ని వెలుగులోకి తెచ్చారు. కాల్పులు ఎలా చేశాడు..? ఎందుకు చేశాడు.? అత‌డి నేప‌థ్యం ఏంటనే విష‌యాల్ని శోధించిన పోలీసులు అత‌ని సోష‌ల్ మీడియా అకౌంట్ల‌పై దృష్టిసారించారు.

అందులో భాగంగా ఫేస్ బుక్ లో నికోలస్ ఫోటోల‌ను చూసిన పోలీసులు షాక్ అయ్యారు. గ‌న్ లంటే అత‌డికి ఎంతో ఇష్టం. ఆయుధాల క‌లెక్ష‌న్స్ త‌న ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. ముఖానికి మాస్క్ ధ‌రించి అతడు స్కూల్లో కాల్పులకు తెగ‌బ‌డ్డాడు. గ‌తంలో మాస్క్ ధ‌రించిన ఫోటోల‌ను పోస్ట్ చేశాడు.

ఇక కాల్పుల‌కు ఉప‌యోగించిన ఏఆర్ -15రైఫిల్ ను చూసిన అమెరికా పోలీసులు కంగుతిన్నారు. అమెరికా సైనికుల ద‌గ్గ‌ర క‌నిపించే అత్యాధునిక ఆయుదం . ఈ గ‌న్ అంటే అమెరికా యువ‌త‌కు ఎక్క‌డా లేని క్రేజ్. అయితే ఈ గ‌న్ కు ఉన్న క్రేజ్ ను అమెరికా వ్యాపారస్థులు క్యాష్ చేసుకున్నారు. అమెరికా సైనిక తుపాకీ కి కొన్ని మార్పులు - చేర్పులు చేసి ప్ర‌జ‌ల ముందుకు ఉంచారు. అందుకే అమెరిక‌న్లు సంతలో కూర‌గాయ‌లు కొన్నంత ఈజీగా ఈ ఏఆర్-15 రైఫిల్ గ‌న్ ను కొంటున్నారు. ఈ గ‌న్ ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు సుమారు 50ల‌క్ష‌ల‌మంది ద‌గ్గ‌ర ఈ తుపాకీ ఉందంటే ఈ తుపాకీకి ఎంత క్రేజ్ ఉంటుందో అర్ధం చేసుకోవ‌చ్చు. ఈ రైఫిల్ పొడ‌వు 16 ఇంచ‌ల‌ వ‌ర‌కు ఉంటుంది. ఒకే స‌మ‌యంలో 45 తూటాల్ని పేల్చ‌గ‌ల స‌త్తా ఈ రైఫిల్ సొంతం . నిమిషాల్లో వంద‌లాదిమందిని నేల‌కొరిగేలా చేస్తుంది. అమెరికాలో 50ల‌క్ష‌మంది ద‌గ్గ‌ర ఈ తుపాకీ ఉందంటే అగ్ర‌రాజ్యంలో తుపాకీ సంస్కృతి ఎంత‌లా క‌రాళ‌నృత్యం చేస్తుందో అర్ధం చేసుకోవ‌చ్చు.

అమెరికాలో అడుగుపెట్టాలంటే స‌వాల‌క్ష నిబంధ‌న‌లు విధించే అగ్ర‌రాజ్యం మ‌రి ఇంత‌టి ప్ర‌మాద‌క‌ర‌మైన ఆయుధాన్ని ఎలాంటి నిబంధ‌న‌లు లేకుండా మార్కెట్లో కూర‌గాయ‌లు అమ్మిన‌ట్లు అమ్మేస్తున్నార‌ని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు. ఈ గ‌న్ కొనాలంటే అక్క‌డ చాలా సింపుల్ ప్రాసెస్ ముందుగా కొనుగోలు దారుడు అమెరికా పౌరుడై ఉండాలి. అందుకు ధృవీక‌ర‌ణ ప‌త్రం ఉంటే చాలు సొంతం చేసుకోవ‌చ్చు. సాధార‌ణ ర‌కం ముప్పైవేల‌కు ల‌భిస్తుండ‌గా ఆధునిక ఫీచ‌ర్లు ఉన్న తుపాకీ ధ‌ర దాదాపు 60వేలు ఉంది. 2015 శాన్ బెన‌డీలో జ‌రిపిన కాల్పులు - 2012 అరోరా సినిమా థియేట‌ర్ - శాండీ ఎలిమెంట్రీ స్కూల్ - తాజాగా జ‌రిగిన కాల్పుల‌కు నికోల‌స్ ఉప‌యోగించిన తుపాకీ కూడా ఇదే . ఏటా దేశ‌వ్యాప్తంగా ఏఆర్ - 15రైఫిల్ 3ల‌క్స‌ల నుంచి 5ల‌క్ష‌ల వ‌ర‌కు అమ్ముడు పోతున్నాయి.