Begin typing your search above and press return to search.

మహిళ ముక్కులో 150 ఈగ లార్వాలు.. ఆపరేషన్ తో తొలగింపు

By:  Tupaki Desk   |   26 Aug 2022 6:30 AM GMT
మహిళ ముక్కులో 150 ఈగ లార్వాలు.. ఆపరేషన్ తో తొలగింపు
X
కరోనా ఎన్నో అనర్థాలకు దారితీస్తోంది. ఎన్నో ఇతర రోగాలకు కారణం అవుతోంది. కరోనా సోకిన ఓ మహిళకు స్టెరాయిడ్లు ఎక్కువగా ఇవ్వడంతో బ్లాక్ ఫంగస్ బారిన పడిన ఒక కన్నును కోల్పోయింది. అప్పటి నుంచి ఒకటే కన్నుతో ఉన్న ఆమెకు ఇటీవల ఆరోగ్యం విషమించింది.

తాజాగా స్పర్శ జ్ఞానం కూడా కోల్పోయింది. దీంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ ఆస్పత్రికి తరలించగా.. వైద్యలు ఆమె ప్రాణాలను కాపాడారు.

బంజారాహిల్స్ లోని సెంచురీ ఆస్పత్రికి వచ్చిన ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన 50 ఏళ్ల మహిళకు ఆపరేషన్ చేసి వైద్యులు కాపాడారు. కొంత కాలంగా కరోనా బారినపడిన అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెకు స్పర్శ జ్ఞానం పోవడంతో ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆ మహిళ ముక్కులో 150కి పైగా ఈగ లార్వాలను వైద్యులు గుర్తించారు. ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడారు.

అసలు ముక్కులో ఈగ లార్వాలు అన్ని ఎలా పెట్టాయన్న దానిపై ఆరాతీస్తున్నారు. ఆమె మంచానికే పరిమితమైతే ఇలా ఈగలు తమ లార్వాలను ముక్కులో పెట్టి ఉంటాయని అంటున్నారు. శస్త్రచికిత్స ద్వారా ముక్కునుంచి ఈగ లార్వాలను తొలగించారు. పూర్తిగా కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు.

బంజారాహిల్స్ లోని సెంచురీ ఆస్పత్రి ఈఎన్టీ వైద్యులు ఈ అరుదైన ఆపరేషన్ చేసి గుంటూరు మహిళను బతికించారు. బ్లాక్ ఫంగస్ వల్ల కూడా ఇలాంటి సైడ్ ఎఫెక్ట్ లు వస్తాయని.. ఇప్పటికే ఒక కన్నును కోల్పోయిన వృద్ధురాలికి ఇది ప్రాణాదానం అని వైద్యులు చెబుతున్నారు.

కుటుంబ సభ్యుల నిర్లక్ష్యం వల్ల ఈగ లార్వాలు ఆమె ముక్కులో గూడు కట్టాయని అంటున్నారు. అప్రమత్తంగా లేకుంటే మరింతగా ప్రమాదం వాటిల్లేదని చెబుతున్నారు.