Begin typing your search above and press return to search.
ముద్దంటే చేదా.? మూడేళ్ల జైలు చాలా.?
By: Tupaki Desk | 14 Aug 2019 11:08 AM GMTముద్దిస్తానన్నాడు.. మురిపిస్తానన్నాడు.. కవ్వించాడు.. తన కౌగిలిలోకి బంధిస్తానని రమ్మన్నాడు. అయితే ఇదో ప్రేయసినో.. భార్యనో పిలవలేదు.. పక్కింటి వ్యక్తి పెళ్లాన్ని పిలిచాడు. ఆమెపై వల విసిరాడు.. ఆమె కొట్టిన దెబ్బకు ఇప్పుడు మూడేళ్లు జైల్లోనే పడ్డాడు.
తెలంగాణ- ఆంధ్రాలో షీటీంలున్నాయి.. ఆడవాళ్లపై సైగ చేస్తే పట్టుకొని లోపలేస్తాయి.. కానీ అది పంజాబ్. అక్కడ చట్టాలు- పోలీసులు ఇంత కఠినంగా ఉన్నాయో లేదో.. తెలియదు.. కానీ ధైర్యం చేసి ముద్దిస్తానన్న వ్యక్తిపై పోలీసుల గడప తొక్కింది మహిళ. కోర్టు సీరియస్ గా తీసుకొని మూడేళ్ల జైలు శిక్ష వేసింది.. మహిళల పట్ల వికృతంగా ప్రవర్తిస్తే ఎంత డేంజరో తెలియజేసే సంఘటన తాజాగా చోటుచేసుకుంది.
తాజాగా పంజాబ్ లోని మొహాలీలో పోకిరీకి కోర్టు పెద్ద శిక్ష విధించి గట్టి షాక్ ఇచ్చింది. మహిళలను వేధించే వారి వెన్నులో వణుకుపుట్టేలా తీర్పునిచ్చింది. మొహాలీలోని ఓ హౌసింగ్ సొసైటీలో వినోద్ అనే యువకుడు నివసిస్తున్నాడు. అదే అపార్ట్ మెంట్ లో వినోద్ పక్క ఫ్లాట్ లో ఓ మహిళ భర్తతో కలిసి జీవిస్తోంది.
కొద్దికాలంగా వినోద్ ఆ మహిళపై కన్నేసి ఆమెకు ఫ్లైయింగ్ కిస్ లు విసరడం.. అసభ్యంగా ప్రవర్తించడం చేస్తున్నాడు. వివిధ భంగిమల్లో ఆ మహిళను ఆకర్షించడం చేస్తున్నాడు. దీనిపై సదురు మహిళ విషయాన్ని భర్తకు చెప్పింది. అతడు వార్నింగ్ ఇచ్చినా వినోద్ బుద్ది మారలేదు. అదే వేధింపులు కొనసాగాయి. దీంతో విసిగివేసారిన దంపతులు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాళ్లు వినోద్ ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరుచగా.. ఏకంగా మూడేళ్ల జైలు శిక్ష, 3వేల జరిమానా విధించి షాకిచ్చింది. మహిళలను వేధించేవారికి ఇదో హెచ్చరిక అని ఈ తీర్పుతో కోర్టు స్పష్టం చేసింది.