Begin typing your search above and press return to search.
ఆర్థిక ప్యాకేజ్ 2.0 : రైతుల కోసం ఎమర్జెన్సీ ఫండ్ కింద రూ.30వేల కోట్లు
By: Tupaki Desk | 14 May 2020 11:50 AM GMTదేశంలో మహమ్మారి సృష్టించిన అల్లకల్లోలానికి దేశంలోని ప్రతి ఒక్కరిని ఆదుకోవడానికి ప్రధాని మోదీ రూ. 20 లక్షల కోట్ల రూపాయలతో భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్యాకేజీ పై నిన్న (బుధవారం) కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్యాకేజీకి సంబంధించిన వివరాలను ప్రకటించారు. అనేక సూక్ష్మ, చిన్న , మధ్యతరహా పరిశ్రమలకి కేంద్రం ఆసరాగా నిలిచింది. ఎంఎస్‌ఎంఈ, ఎన్‌బీఎఫ్‌సీలు, హెచ్‌ఎఫ్‌సీ, ఎంఎఫ్‌ఐ లాంటి ఫైనాన్సింగ్ కంపెనీలు ఎదుర్కొంటున్న ద్రవ్య సమస్యలను పరిష్కరించడానికి అనేక చర్యలను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఇకపోతే, రూ. 20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీ వివరాలపై ఈ రోజు సాయంత్రం 4 గంటలకు మరోసారి మీడియాకు వివరించనున్నారు. ఈ ఉద్దీపన ప్యాకేజీ వివరాలు తెలిపే రెండవ మీడియా సమావేశంలో వ్యవసాయ రంగానికి సంబంధించిన చర్యలను ప్రకటించే అవకాశం ఉందని నిపుణుల అంచనా...చూడాలి మరి ఈ రోజు మన కేంద్రమంత్రి గారు ఎవరి పై వరాల జల్లు కురిపిస్తారో .....
రైతులు పేదలు వలస కూలీల కోసం 9 పాయింట్ ఫార్ములా..
ఆత్మ నిర్భర్ లో రెండో ప్యాకేజీ ప్రకటిస్తున్న నిర్మలా సీతారామన్ గారు. ఈ ప్యాకేజీలో వలస కార్మికులు వీధి వ్యాపారులు చిన్న, సన్నకారు రైతులను ఆదుకోబోతున్నట్టు ప్రకటన. మిగిలిన ప్యాకేజీ లో రైతులకి సంబంధించి మరిన్ని సమాసాలు వస్తాయన్న కేంద్రమంత్రి. మూడు కోట్ల మందిక రైతులకు 4.22 లక్షల లోన్లు.. ఆ లోన్ ల పై మూడు నెలల మారటోరియం. ఇప్పటివరకు క్రాప్ లోన్ తీసుకున్న వాళ్ళు మే 31 వరకు వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదు. మార్చి 1 నుంచి మే 31 వరకు రైతు రుణాలపై వడ్డీ లేదు. 25 వేల కోట్లతో కొత్తగా 25 లక్షల కిసాన్ క్రెడిట్ కార్డులు మంజూరు
వలస కూలీల కోసం రాష్ట్రాలకి రూ.11వేల కోట్లు ఇచ్చాం ...
మార్చి 31 నుంచి ఏప్రిల్ 30 మధ్య 63 లక్షల మంది రైతులకు 86,600 కోట్ల రుణాలు ఇచ్చినట్టు తెలిపిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ గారు. అలాగే 25 వేల కోట్ల నాబార్డు రుణాలను రీ ఫైనాన్స్ స చేశాం అని తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తుల సేకరణకు రాష్ట్రాలకు 6700 కోట్లు వర్కింగ్ అసిస్టెంట్ అందించనున్న కేంద్రం గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కోసం 4200 కోట్ల రుణాలు ఇచ్చాం. పట్టణ పేదలకు లక్షా 25 వేల లీటర్ల శని టీచర్లు మూడు కోట్ల మాస్కులు ఉచితంగా అందించిన కేంద్రం. sbrs కింద వలస కూలీలకు బస, ఆహారం సాగునీరు అందించాం.. ఇందుకుగాను రాష్ట్రాలకు ఏప్రిల్ 3న 11002 కోట్లు చెల్లించిన కేంద్రం. నాబార్డు రూ.29500 కోట్లను ఇచ్చింది. కొత్తగా 7200 మంది స్వయం సహాయక బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది. వలస కూలీలు వారి సొంత రాష్ట్రాలకు వెళ్లిన సమయంలో ఉపాధి హామీ పథకంలో ఎన్‌రోల్ కావొచ్చు.
వలస కూలీలకి, కార్మికులకు భరోసా ...
వలస కూలీలపై ప్రస్తుతం రూ.10వేల కోట్లు మాత్రమే ఖర్చు చేస్తున్నాం. అవసరమైతే మరింతగా పెంచేందుకు చూస్తాం అని తెలిపిన నిర్మలా సీతారామన్. అలాగే దేశం మొత్తం ఒకే చెల్లింపు ఉండే విధానానికి శ్రీకారం చుడతాం అని ప్రకటించారు. నిన్న 2.33 కోట్ల వలస కార్మికులను పని కల్పించాం. 10 మంది ఉద్యోగులు ఉన్న సంస్థలకు ఈఎస్ ఐ సీకి అర్హత ఉండేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. ఈసీఐసీ కవరేజ్‌ను ప్రమాదకరమైన సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులకు కూడా ఇవ్వాలని భావిస్తున్నాం. ఇందుకోసం ఒక నోటిఫికేషన్ విడుదల చేస్తాం. అలాగే ప్రతి రంగంలో మహిళలకు సమాన హక్కులు కల్పించాలి. రాత్రివేళ్లలో కూడా పనిచేసేందుకు అనుమతి ఇవ్వాలి అయితే వారి భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. కనీస వేతనం హక్కులు కార్మికులందరికీ కల్పిస్తాం అని ప్రకటించిన కేంద్ర మంత్రి.
వలస కార్మికులకి రెండు నెలల రేషన్ ఫ్రీ : వన్ నేషన్ ..వన్ రేషన్
ఈ మహమ్మారి కారణంగా వలస కార్మికులు తమ సొంత ఊర్లకి వెళ్లిపోతున్నారు. అక్కడ వారికీ రేషన్ కార్డు ఉండచ్చు .. ఉండకపోవచ్చు. ఈ తరుణంలో వలస కూలీలకు ఉచితంగా మరో రెండు నెలలు ఆహార ధాన్యాలు అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.కార్డులు లేక పోయినప్పటికీ వారికి బియ్యం, గోదుమలు ఇవ్వడం జరుగుతుంది. ఉచిత రేషన్ కింద ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యం లేదా గోదుమలు ఇవ్వడం జరుగుతుంది కార్డు ఉన్నా..లేకున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం రేషన్ ఇవ్వాలని ఆదేశం. అలాగే రేషన్ కార్డు ఉన్నవారు దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా మీరు ఉన్న చోటునే రేషన్ తీసుకునే సదుపాయం., వచ్చే మూడు నెలల పాటు ఈ విధానం అమల్లో ఉంటుంది. వన్ నేషన్ ..వన్ రేషన్ ... విధానాన్ని తీసుకొస్తాం అంటూ ప్రకటన
వలస కార్మికులు ఉండేందుకు అందుబాటు ధరలో ఇళ్లను ఇస్తాం. కార్మికులు పని చేస్తున్న ఆయా సంస్థలకు ఇన్సెన్టివ్స్ ఇస్తాం. అలాగే , రాష్ట్రాలు వలస కూలీల గుర్తించి సాయం అందేలా చర్యలు తీసుకోవాలి. దేశంలో వలస కూలీల అందరికీ ప్రత్యేక రేషన్ కార్డులు ఇస్తాం... ఈ కార్డు ద్వారా 20 రాష్ట్రాల్లో ఎక్కడైనా రేషన్ పొందే సదుపాయం. 20 20 ఆగస్టు నాటికి 23 రాష్ట్రాల్లో 83 శాతం కూలీలకు అందుబాటులోకి రేషన్. వచ్చే ఏడాది మార్చి నాటికి 100% రేషన్ కార్డు పోర్టబిలిటీ పూర్తవుతుంది.
ముద్రశిశు లోన్ల పై వడ్డీ రాయితీ ... ఒక్కొక్కరికి రూ.10 వేలు !
తక్కువ మొత్తంలో రుణాలు తీసుకుంటున్న వారికి కూడా ఊరట కల్పించాలనుకుంటున్నాం.ముద్రశిశు లోన్లు తీసుకున్నవారికి రూ.1500 కోట్లు వడ్డీ రాయితీ ఇస్తున్నాం. ముద్ర యోజన కింద తీసుకున్న లోన్లు తీసుకున్న వ్యాపారులు ఇప్పటికే చితికిపోయారు.ఇప్పటివరకు ముద్ర లోన్ల కింద లక్ష 62 వేల కోట్లు ...అలాగే ఎవరైనా 50 వేల లోపు లోన్లు తీసుకున్నవారు, చిన్న వ్యాపారులకు 5 వేల కోట్లతో రుణాలు. ఇప్పటికి మూడు లక్షల అరవై రెండు వేల కోట్లు మంజూరు 50000 తీసుకున్న వాళ్లకి ఇప్పటివరకు సకాలంలో చెల్లించిన వారికి 2% వడ్డీ మాఫీ. దేశవ్యాప్తంగా ఉన్న 50 లక్షల మంది స్ట్రీట్ వెండర్స్‌కు రూ.5వేల కోట్లు రుణాలు ఇస్తున్నాం. ఒక్కొకరికీ రూ.10వేలు ఇచ్చి తద్వారా తిరిగి వారి వ్యాపారాలు ప్రారంభించుకునేలా సహకారం అందిస్తాం.
ఎంప్లాయిమెంట్ కోసం రూ.6వేల కోట్లు కేటాయింపు
గృహ నిర్మాణ రంగంలో మిడిల్ ఇన్‌కం గ్రూప్ వారికి లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ సబ్సీడీని 2021 మార్చి వరకు పొడిగిస్తోంది. గృహనిర్మాణ రంగంకు రూ.70వేల కోట్లు పెట్టుబడులు పెట్టాం. ఈ మహమ్మారి వాల్ల ఉద్యోగాలు కోల్పోయిన వారికీ కంపా ఫండ్స్ ద్వారా రూ.6వేల కోట్లు విలువ చేసే ఎంప్లాయిమెంట్ కల్పిస్తాం. దీని వల్ల దేశవ్యాప్తంగా ఉన్న ఆదివాసీలు, గిరిజనులకు మేలు కలుగుతుంది. వీరికి ఉపాధి కలుగుతుంది.
రైతుల కోసం ఎమర్జెన్సీ ఫండ్ కింద రూ.30వేల కోట్లు
రైతులను ఆదుకునేందుకు ఎమర్జెన్సీ ఫండ్‌ను ఏర్పాటు చేస్తున్నాం. అది ఇప్పటి నుంచి అమల్లోకి వస్తుంది. ఇందుకోసం రూ.30వేల కోట్లు కేటాయిస్తున్నాం. దీనివల్ల 3 కోట్ల చిన్న సన్నకారు రైతులకు లబ్ధి చేకూరుతుంది. కిసాన్ క్రెడిట్ కార్డులు మత్స్యకారులు, పశుసంరక్షణకు సంబంధించిన వారిని కూడా చేర్చాలని ప్రధాని మోడీ చెప్పారు.