Begin typing your search above and press return to search.
కేంద్ర బడ్జెట్: బీజేపీ గుప్పిట ‘పవర్’
By: Tupaki Desk | 5 July 2019 6:55 AM GMTకేంద్ర బడ్జెట్ ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా విద్యుత్ రంగంలో సంస్కరణలు చేపట్టబోతున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించారు. ఒకదేశం.. ఒకే పవర్ గ్రిడ్ ద్వారా రాష్ట్రాలకు తక్కువ ధరకే విద్యుత్ ను సరఫరా చేస్తామని నిర్మలా ప్రకటించారు.
పవర్ గ్రిడ్ ఏర్పాటు చేసి దేశంలో ప్రతీ ఒక్కరికి విద్యుత్ ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తామని నిర్మలా ప్రకటించారు. పవర్ గ్రిడ్ ద్వారా రాష్ట్రాలకు అతి తక్కువ ధరకే విద్యుత్ ను అందిస్తామని మంత్రి ప్రకటించారు. విద్యుత్ టారీఫ్ లోనూ సంస్కరణలు తీసుకొస్తామని ప్రకటించారు.
కాగా ఇన్నాళ్లు విద్యుత్ కొనుగోళ్లు - ఉత్పత్తి రాష్ట్రాల పరిధిలోనూ ఉండేవి. తెలంగాణ - చత్తీస్ గడ్ లకు సింగరేణి - చత్తీస్ ఘడ్ విద్యుత్ ఉత్పత్తి సొంత కేంద్రాలుండేవీ. ఆ విద్యుత్ ను అవే ఉత్పత్తి చేసుకొని వాడుకునేవి. రెగ్యులర్ గా డబ్బులు చెల్లించేవి కావు..
కానీ ఇప్పుడు విద్యుత్ రంగ సంస్కరణలు కేంద్రం చేపడితే మొత్తం పవర్ గ్రిడ్ కేంద్రంలోకి వెళుతుంది. తెలంగాణ - చత్తీస్ ఘడ్ కరెంట్ కూడా కేంద్రమే అమ్మాలి. తెలంగాణ కొనుక్కోవాలి. దీనివల్ల విద్యుత్ కొనుగోళ్లకు వాయిదా ఎప్పటికప్పుడు చెల్లించాలి. ఇప్పటికే తెలంగాణ సింగరేణి సహా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు కోట్ల బకాయి ఉంది. కేంద్రం సంస్కరణ తెచ్చి ఒకే పవర్ గ్రిడ్ ఏర్పాటు చేస్తే తెలంగాణ పెద్ద ఆర్థిక సంక్షోభమే. విద్యుత్ ను కొనుక్కోవాల్సి రావడం ఆర్థికంగా గుదిబండే. సింగరేణి బొగ్గు విద్యుత్ కూడా కేంద్రం అజామాయిషీ రావచ్చు. ఇదే ఇప్పుడు రాష్ట్రాలను కలవరపెడుతున్న అంశంగా మారింది.