Begin typing your search above and press return to search.
నిర్మలమ్మ నాలుగు గంటలకే ప్రెస్ మీట్ పెడుతున్నారెందుకు?
By: Tupaki Desk | 15 May 2020 7:15 AM GMTతెల్లనివన్ని పాలు.. నల్లనివన్ని నీళ్లు కావన్నట్లే.. కనిపించే వాటి వెనుక అసలు లెక్కలు వేరే ఉంటాయి. తెర వెనుక జరిగే ఎన్నో పరిణామాల ఫలితాల్ని మాత్రమే ప్రజలు చూస్తుంటారు. తెర మీద కనిపించే సీన్ వెనుక కతలేందన్న విషయాలు చాలా వరకూ బయటకు రావు. మోడీ మాష్టారు లాంటోళ్ల చేతుల్లో ఉన్నప్పుడు సమాచారం బయటకు రావటం అంత తేలికైన విషయం కాదు. ఆ మాటకు వస్తే.. కేంద్రంలోనే కాదు.. రాష్ట్రాల్లోనూ పాలకులు అనుసరిస్తున్న విధానాలతో చాలా విషయాలు బయటకు పొక్కని పరిస్థితి నెలకొంది.
మూడు రోజుల క్రితం ప్రధాని మోడీ టీవీలో జాతిని ఉద్దేశించి ప్రసంగించటం తెలిసిందే. ఈ సందర్భంగా తమ ప్రభుత్వం రూ.20లక్షల కోట్ల భారీ ప్యాకేజీ ప్రకటన చేశారు. దగ్గర దగ్గర నలభై నిమిషాలకు పైనే మాట్లాడిన ఆయన.. ప్యాకేజీ విలువ చెప్పారే కానీ.. అందులోని అంశాల్ని మాత్రం ప్రస్తావించలేదు. దీంతో.. ప్రభుత్వం ప్రకటించే ప్యాకేజీ మీద భారీ అంచనాలు వ్యక్తమయ్యాయి. తీరా చూస్తే.. అందులో ఏమీ లేదన్న విమర్శలు అంతకంతకూ పెరుగుతున్నాయి.
ప్యాకేజీ వివరాల్ని దశల వారీగా వెల్లడిస్తామన్న మోడీ మాష్టారి మాటకు తగ్గట్లే.. బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడారు. ఆమె చెప్పిన వివరాల షాక్ నుంచి తేరుకోక ముందే.. ఆమె హడావుడిగా వెళ్లిపోయారు. గురువారం సాయంత్రం మళ్లీ ఠంచనుగా నాలుగు గంటల వేలలో నిర్మలమ్మ మళ్లీ మరో ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా వలసకూలీలు.. రైతులకు సంబంధించి వివరాల్ని వెల్లడించారు. పలు రంగాలకు సంబంధించిన ఆర్థిక వెసులుబాట్లను వెల్లడించారు.
వాటితో ఏమైనా ప్రయోజనమా? అంటే వెంటనే సమాధానం చెప్పలేని పరిస్థితి. ఈ రోజు కూడా సాయంత్రం నాలుగు గంటలకు నిర్మలమ్మ ప్రెస్ మీట్ ఉంటుందని చెబుతున్నారు. అందరికి కనిపించేది నిర్మలమ్మ ప్రెస్ మీట్ కానీ.. సరిగ్గా సాయంత్రం నాలుగు గంటలకే ఆమె ప్రెస్ మీట్ ఎందుకు పెడుతున్నారన్న ప్రశ్నకు సమాధానం వెతికితే ఆశ్చర్యపోయే సమాచారం తెలుస్తుంది.
గడిచిన రెండు రోజులుగా నిర్మలమ్మ 4పీఎంకు ప్రెస్ మీట్ పెట్టటం.. నాలుగు మాటలు చెప్పి వెళ్లిపోతున్నారు. అయితే.. అదే సమయానికి గడిచిన కొన్నివారాలుగా కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న లవ్ అగర్వాల్ ప్రెస్ మీట్ పెట్టేవారు. ఒక విధంగా చూస్తే.. 4పీఎం స్లాట్ లవ్ అగర్వాల్ అన్నట్లుగా అందరికి అలవాటైంది. రెండు రోజులుగాలవ్ అగర్వాల్ ను టీవీల్లో కనిపించకుండా.. ఆయన ప్లేస్ ను నిర్మలమ్మ రీప్లేస్ చేసిన విషయాన్ని చాలామంది గుర్తించలేదు కూడా. అంటే.. ఆరోగ్య శాఖ నుంచి ఆర్థిక మంత్రి చేతికి 4పీఎం స్లాట్ వెళ్లిపోయిందని చెప్పాలి.
మాయదారి రోగంపై మన పోరులో ప్రాణాలు నిలుపుకోవటం ముఖ్యమన్న మోడీ మాష్టారు.. ఇటీవల కాలంలో కరోనాతో పాటు బతకటం తప్పనిసరి అని.. అందుకు తగ్గట్లుగా పని చేయాలన్న ప్రధాని మాటలకు అనుగుణంగా.. ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ నుపక్కన పెట్టేయటం ఆసక్తికరంగానే కాదు అండర్ లైన్ చేసుకోవాల్సిన అవసరాన్ని చెబుతుంది. చూస్తుంటే.. ఆర్థికవ్యవస్థను పట్టాల మీదకు ఎక్కించటమే తమ ముందున్న లక్ష్యమన్న సందేశాన్ని 4పీఎం ప్రెస్ మీట్ స్పష్టం చేస్తుందని చెప్పక తప్పదు.