Begin typing your search above and press return to search.
ఈ చిట్కాలు ఫాలో అయితే వర్క్ ఫ్రం హోం హ్యపీయే!
By: Tupaki Desk | 31 Aug 2021 4:30 AM GMTకొవిడ్ మహమ్మారి వల్ల ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఫెసిలిటీని కంపెనీలు కల్పించాయి. కొన్ని కంపెనీలు అయితే లైఫ్ లాంగ్ వర్క్ ఫ్రం హోం ఇచ్చేశాయి. అయితే, కరోనా పరిస్థితుల వల్ల ఇలా పని చేసే పద్ధతి మారింది. దాంతో ఇల్లే ఆఫీసుగా మారింది. కానీ, వర్కింగ్ ఎన్విరాన్‌మెంట్ ఆఫీసు మాదరిగా అస్సలు ఉండదు. ఆఫీసు అయితే సీటింగ్ ఎన్విరాన్‌మెంట్, వర్క్ కల్చర్, కొలీగ్స్, డిస్కషన్స్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. వర్క్ ఫ్రం హోంలో అయితే కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్ ముందర గంటల తరబడి కూర్చొని పని చేస్తూనే ఉండాల్సి ఉంటుంది.
ఇకపోతే టైం లిమిట్ దాటిపోయినా సరే ఒక్కో సారి టార్గెట్ పూర్తయ్యే వరకు వర్క్ చేయాల్సే ఉంటుంది. ‘ఇండియా హెల్త్ ఆఫ్ ది నేషన్స్ స్టేట్స్: లెవెల్ డిసీజ్ బర్డెన్ ఇన్షియేటివ్’ అనే అంశంపై భారత ప్రభుత్వం అధ్యయనం చేసింది. ఈ అధ్యయనం ద్వారా వర్క్ ఫ్రమ్ హోంలో ఉద్యోగుల్లో ‘డయాబెటిస్, హైపర్ టెన్షన్, ఒబెసిటి’లాంటి వ్యాధులు పెరిగినట్లు తేల్చింది. ఒత్తిడి, టైంకి తినకపోవడం ఇందుకు కారణాలని స్పష్టం చేసింది. అదే టైంలో అంటువ్యాధుల బారిన సైతం పడుతున్నారని తెలిపింది. అయితే వీటన్నింటికంటే కూడా ప్రధానమైన సమస్యగా వెన్ను నొప్పి ఉందని వివరించింది ఈ స్టడీ.
యూత్‌లోనే ఈ వెన్ను నొప్పి ఎక్కువగా ఉన్నట్లు స్టడీ స్పష్టం చేసింది. యంగ్ వర్కింగ్ పాపులేషన్ అనగా 18 నుంచి 25ఏళ్ల లోపు వాళ్లు 25 నుంచి 31 శాతానికి పెరగడం, వాళ్లలోనే ఇది అధికంగా ఉండటం ఆందోళన కలిగించే అంశమని పేర్కొంది. నొప్పి, కీళ్ల సమస్యలు ఒకప్పుడు వయసు మళ్లిన వాళ్ల సమస్యల కిందే ఉండేవి. కానీ, ఇప్పుడా పరిస్థితులు అస్సలు లేవు. జనరేషన్స్ మారుతున్నా లైఫ్ స్టైల్ మారే పరిస్థితులు అప్పుడు తక్కువే. కానీ, ఇప్పుడు ఎక్కువ కాలం పాటు వర్క్ ఫ్రం హోం కొనసాగడం వల్ల సీటింగ్ పొజిషన్ ఎప్పుడూ ఒకేలా ఉండటం వల్ల బ్యాక్ పెయిన్ చాలా మందకి వస్తున్నట్లు వైద్య నిపుణులు చెప్తున్నారు.
ఉద్యోగుల కోసం కొన్ని కంపెనీలు ఆఫీస్ చెయిర్‌లను ఇప్పటికే సమకూర్చగా, మరికొందరు వాళ్లంత వాళ్లే కొనుక్కుంటున్నారు. అందుబాటులో ఉన్న ప్లాస్టిక్ చెయిర్‌లు, నేల మీద కూర్చుని పీటల మీద ల్యాప్‌ట్యాప్‌లు పెట్టుకుని వర్క్ చేస్తున్నారు. ఇక మధ్య, చిన్న జీతగాళ్లు తమకు అందుబాటులో ఉన్న సౌకర్యాలతోనే వర్క్ చేస్తుండటం మనం చూడొచ్చు. అడ్డదిడ్డంగా కూర్చుని-పడుకుని.. ఇలా రకరకాల పోశ్చర్స్‌లో వర్క్ చేయడం.. అదీ ఎక్కువ గంటలు ఒక క్రమపద్ధతిని పాటించకుండా చేయడం వల్ల వెన్ను నొప్పికి విపరీతం వస్తున్నది. ఇకపోతే వ్యాయామాలకు బాడీని దూరంగా ఉంచడం కూడా ఓ కారణమే.
ఎక్కువసేపు కూర్చుని వర్క్ చేయడం వల్ల ప్రెషర్ పెరిగిపోతున్నది. కనీసం వాకింగ్ కూడా చేసే పరిస్థితి ఉండటం లేదు. అదే పనిగా సిస్టమ్ ముందర కూర్చోవాల్సి వస్తే సిట్టింగ్‌లోనే కాళ్లు చేతులూ ఆడించడం, వెన్నెముకకు రిలీఫ్ ఇవ్వడంలాంటివి ఎక్సర్‌సైజులు చేయాలి. కానీ, చేయడం లేదు. ఈ నేపథ్యంలో నిపుణుల పర్యవేక్షణలోయోగా, ఎక్స్‌ర్‌సైజులు చేయడం ద్వారా రిలీఫ్ లభిస్తుంది. చెయిర్‌ను ఎప్పుడూ నిటారుగా ఉంచేలా చూసుకోవడం చాలా మంచిది. అయితే అలా నిటారుగా ఉండటం మీకు మరీ ఇబ్బందిగా ఉంటే కేవలం కొద్దిగా మాత్రమే వెనక్కు వాలేలా, కాస్తంత ఏటవాలుగా సీట్ ఒంచాలి. హైట్‌కు అనుగుణంగా చెయిర్‌ను అడ్జెస్ట్ చేసుకోవాలి.