Begin typing your search above and press return to search.

కరోనా నుంచి కోలుకున్నాక ఈ డైట్​ ఫాలో అవ్వండి..!

By:  Tupaki Desk   |   9 May 2021 4:12 AM GMT
కరోనా నుంచి కోలుకున్నాక ఈ డైట్​ ఫాలో అవ్వండి..!
X
ప్రస్తుతం కరోనా మహమ్మారి ఏ రేంజ్​లో వ్యాపిస్తుందో చూస్తూనే ఉన్నాం. ఎవరికి కరోనా ఉందో? ఎవరికి లేదో? కూడా అర్థం కావడం లేదు. ఫస్ట్​ వేవ్​ టైంలో కరోనా వచ్చినవాళ్లకు ప్రభుత్వమే క్వారంటైన్​కు పంపించేది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. దీంతో మన పక్కింటివాళ్లకు కరోనా వచ్చినా మనకు తెలియడం లేదు. చాలా మందికి ఈ వ్యాధి నయమవుతున్నది. కానీ మరణాల రేటు మాత్రం గతంలో కంటే స్వల్పంగా పెరిగింది. మన చుట్టూ ఉన్నవాళ్లల్లో కొంతమంది ప్రతిరోజూ కరోనాతో ప్రాణాలు కోల్పోతున్నారు. దీన్ని బట్టి మనకు పరిస్థితి అర్థమవుతున్నది.

కరోనా విషయంలో అనవసరంగా భయపడొద్దని డాక్టర్లు చెబుతున్నారు. అలాగే నిర్లక్ష్యం కూడా పనికిరాదని సూచిస్తున్నారు. కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్షలు చేయించుకొని చికిత్స ప్రారంభించాలని.. ఏ మాత్రం ఆలస్యం చేసినా ప్రమాదం వాటిళ్లవచ్చని అంటున్నారు.
ఇదిలా ఉంటే కరోనా నుంచి కోలుకున్నాక ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవాలి. వాళ్ల డైట్​ను ఎలా మార్చుకోవాలి తదితర విషయాలను తెలుసుకుందాం.. సాధారణంగా కరోనా వచ్చి తగ్గాక మన శరీరం కొంత శక్తిని కోల్పోతుంది. దీంతో శక్తిని తిరిగి తెచ్చుకోవాల్సి ఉంటుంది.
కోవిడ్​ బారిన పడి కోలుకున్నాక.. రోగ నిరోధకశక్తిని పెంచుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.


ఉదయాన్నే నానబెట్టిన బాదం, ఎండుద్రాక్ష తీసుకోవాలి. బాదంలో ప్రొటీన్స్​ ఉంటాయి. ఎండుద్రాక్షలో ఐరన్ ఉంటుంది. ఈ ఐరన్​ శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. అనంతరం బ్రేక్​ఫాస్ట్​లో రాగి దోశ, లేదా గోధుమరవ్వ తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు.మధ్యాహ్నం భోజనం అనంతరం బెల్లం, నెయ్యి తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. రాత్రి భోజనంలో అన్ని కూరగాయలు కలిసి కిచిడీ తీసుకోవడం ఉత్తమమని డాక్టర్లు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఎండాకాలం కాబట్టి తరుచూ మజ్జిగ తీసుకోవాలి. వీటితో పాటు మంచి నీరు కూడా ఎక్కువగా తాగాలి. సో కరోనా తగ్గినా ఆహారం విషయంలో మాత్రం ఈ జాగ్రత్తలు పాటించండి.