Begin typing your search above and press return to search.

యాగంలో భోజనం అదిరిపోయింది

By:  Tupaki Desk   |   24 Dec 2015 4:48 AM GMT
యాగంలో భోజనం అదిరిపోయింది
X
ఓపక్క వేలాది మంది జనం.. మరోవైపు అత్యంత ప్రముఖులు. మరి.. ఇంతమందికి ఎలాంటి ఇబ్బంది లేకుండా భోజనాలు పెట్టటం సాధ్యమేనా? ఒక్కటంటే ఒక్క చిన్న లోటు లేకుండా అందరికి సంతృప్తిగా భోజనం పెట్టి పంపటం సాధ్యమేనా? మామూలుగా అయితే.. ఇలాంటివి అసాధ్యమనే చెప్పాలి. కానీ.. అసాధ్యాల్ని సుసాధ్యం చేసే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి వ్యక్తి తలుచుకుంటే.. ఎలాంటి లోటు లేకుండా పూర్తి చేస్తారని మరోసారి నిరూపించారు.

దాదాపుగా 50వేల వరకూ వచ్చిన భక్త జనానికి ఎలాంటి లోటు లేకుండా భోజన ఏర్పాటు చేయటం అంటే మాటలు కాదు. అందుకే.. తొలిరోజు అయుత చండీయాగంలో హైలెట్ గా నిలిచింది ఏదైనా ఉందంటే భోజన ఏర్పాట్లేనని పలువురు అనుకోవటం కనిపించింది. ఇక.. భోజనాల కోసం పక్కా ప్రణాళికతో వ్యవహరించటం కనిపించింది.

యాగశాలకు దగ్గరగా వీఐపీలు.. బ్రాహ్మణుల కోసం భోజనశాల ఏర్పాటు చేస్తే.. సాధారణ భక్త జనం కోసం యాగశాలకు కిలోమీటర్ దూరంలో భోజన ఏర్పాట్లు చేశారు. ఇక.. వీఐపీలకు.. సామాన్య భక్తులకు వేర్వేరు మెనూలు సిద్ధం చేశారు. భోజనశాల దగ్గర ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేలా అధికారులు పక్కాగా ఏర్పాట్లు చేయటం.. జాగ్రత్తలు తీసుకోవటం కనిపించింది. దీంతో.. భోజన కార్యక్రమం హైలెట్ గా నిలిచింది. తాగు నీటికి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకోవటంతో పాటు.. చేతులు శుభ్రం చేసుకోవటానికి ప్రత్యేక పద్ధతిలో నల్లా కనెక్షన్లు ఏర్పాటు చేశారు.

వీఐపీలకు వడ్డించిన మెనూ; వంకాయ కూర.. పాలకూర పప్పు.. సాంబారు.. ఆలూ బజ్జీ.. కేసరి స్వీట్.. అప్పడం. పెరుగు.

సామాన్యులకు వడ్డించిన మెనూ; దొండకాయ ఆవకాయ.. ఆలుగడ్డ కూర.. టమాటా పప్పు.. సాంబార్.. పెరుగు.. అప్పడం