Begin typing your search above and press return to search.

ఫొటోలు, వీడియోలు ఫేస్ బుక్ లో పెడుతానని బెదరింపులు: ఫుడ్ డెలివరీభాయ్ పై కేసు

By:  Tupaki Desk   |   2 Jun 2022 3:21 AM GMT
ఫొటోలు, వీడియోలు ఫేస్ బుక్ లో పెడుతానని బెదరింపులు: ఫుడ్ డెలివరీభాయ్ పై కేసు
X
బతుకు దెరువు కోసం ఏదో ఒక పనిచేసుకుంటానన్నాడని అతడిని నమ్మారు.. నమ్మకంగా ఫుడ్ డెలివరీ చేస్తున్న అతనితో మంచిగా మాట్లాడారు.. కానీ దీనిని ఆసరాగా తీసుకున్న ఆ వ్యక్తి అమ్మాయిలు, ఆంటీలను వంచించబోయాడు. వారితో చనువుగా ఉండేందుకు ప్రయత్నించి వారి పర్సనల్ ఫొటోలు, వీడియోలు సేకరించాడు. ఆ తరువాత వాటిని సోషల్ మీడియాలో పెడుతానని బెదిరిస్తూ బ్లాక్ మెయిల్ కు పాల్పడ్డాడు.

అయితే ఇతని టార్చర్ భరించలేని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతని భరతం పట్టారు.. మరోసారి ఇలాంటి తప్పుడు పనులు చేయకుండా హెచ్చరించారు. కర్ణాటకలో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం వైరల్ గా మారుతోంది.

నిత్యం బిజీగా ఉండే కొందరు ఆహారాన్ని తయారు చేసుకోవడానికి సమయం ఉండదు. ఈ సమయంలో ఆన్లైన్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేస్తూ ఉంటారు. అవసరమైన వారికి కేటాయించిన సమయంలో ఫుడ్ డెలివరీ చేయడం జోమాటో ప్రత్యేకత. ఈ సంస్థలో ఎందరో యువకులు ఉపాధి పొందుతున్నారు.

ఇందులోకర్టాటకలోని బెంగుళూర్ నగరంలోని మడివాళకు చెందిన పురుషోత్తం (40) కూడా పనిచేస్తున్నాడు. నగరంలోని ఐటీ కారిడార్ లో చాలా మంది ఫుడ్ ఆర్డర్ చేస్తుంటారు. ఇలా పుడ్ ఆర్డర్ చేసిన కొందరు మహిళలు, యువతులు ఫోన్ నెంబర్లను పురుషోత్తం సేకరించాడు. ఆ నెంబర్లను ఎప్పటికప్పుడు సేవ్ చేసుకుంటూ వచ్చాడు.

ఫుడ్ డెలివరీ చేసే సమయంలో కొందరు యువతులు, మహిళలతో పురుషోత్తం చనువుగా ఉంటూ వచ్చాడు. వారితో పరిచయం ఏర్పరుచుకొని తరుచూ ఫోన్లు చేసేవాడు. ఇదే సమయంలో ఫేస్ బుక్ లో వారి నెంబర్ల ఆధారంగా ఫ్రెండ్స్ రిక్వెస్ట్ పంపించేవాడు. ఆ తరువాత కొందరికి మాయమాటలు చెప్పి వారికి దగ్గరయ్యాడు. ఇలా వారికి దగ్గరవుతూ వారి పర్సనల్ ఫొటోలు, వీడియోలు సేకరించాడు. అయితే తమతో మంచిగా ప్రవర్తిస్తున్నాడని మహిళలు, యువతులు అతడు అడగ్గానే వాటిని పంపించారు.

కొన్ని రోజుల తరువాత పురుషోత్తం అసలు రూపం బయటపడింది. ఆయన సేకరించిన వారి ఫొటోలను మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో పెడుతానని సదరు మహిళలకు ఫోన్ చేసేవాడు. వారి జీవితాలతో చెలగాటమాడుతూ వారిని టార్చర్ చేసేవాడు. ఈయన వేధింపులు తట్టుకోలేని ఓ యువతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసిన పోలీసులు పురుషోత్తంపై కేసు నమోదు చేసి ఆయన బెండు తీశారు. అమాయకులైన యువతులు, మహిళలను నమ్మించి మోసం చేస్తున్నాడి పోలీసులు ఈ సందర్బంగా మీడియాతో తెలిపారు.