Begin typing your search above and press return to search.
పుట్ బాల్ దిగ్గజ ఆటగాడు మెస్సీ గురించి ఇవి తెలిస్తే అవాక్కే
By: Tupaki Desk | 25 Jun 2022 12:30 PM GMTడెబ్బైల్లో పుట్టినోళ్లకు.. ఫుట్ బాల్ అన్నంతనే గుర్తుకు వచ్చేటోడు పుట్ బాల్ మాంత్రికుడు డిగో మారడోనా. దేశాలతో సంబంధం లేకుండా ఫుట్ బాల్ క్రీడ మీద ఏ మాత్రం ఆసక్తి ఉన్నా.. అతగాడికి ఫ్యాన్ అయిపోవాల్సిందే. మరి.. ఇటీవల కాలంలో అన్నంతనే ఇద్దరి పేర్లను ఎక్కువమంది చెబుతుంటారు. అంతులో ఒకడు అర్జెంటీనా స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీ అయితే.. మరొకరు పోర్చుగల్ ఫుట్ బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో. మరి.. వీరిద్దరిలో ఎవరు గ్రేట్ అన్న విషయానికి వస్తే.. ఫ్యాన్స్ ఒకపట్టాన తేల్చరు. ఏ మాటకు ఆ మాటే చెప్పాలంటే మాత్రం.. ఇద్దరు ఇద్దరే.
ఈ రోజు మెస్సీ తన 35వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఇలాంటివేళ.. అతగాడి గురించి లోకానికి పెద్దగా తెలియని కొన్ని ముచ్చట్లు తెలుసుకుంటే.. నిజమా? అని కళ్లు పెద్దవి చేయకుండా ఉండలేం. అలాంటి వాటిల్లో ముఖ్యమైన మూడింటిని చూస్తే..మెస్సీకి పదకొండేళ్ల వయసులో ఉన్న వేళలో.. గ్రోత్ హార్మోన్ లోపం ఉన్నట్లుగా డాక్టర్లు గుర్తించారు. దీంతో.. మెస్సీ జీవితంలో ఫుట్ బాట్ ఆటగాడు కాలేడని చెప్పేశారు.
అప్పట్లోమెస్సీకి వైద్యం చేయించటం కోసం నెలకు 900 డాలర్లు అయ్యేవి. అంత ఖర్చును భరించలేని పరిస్థితుల్లో మెస్సీ తల్లిదండ్రులు ఉండేవారు. దీంతో.. అతనికి చికిత్స చాలా కష్టమయ్యేది. ఇలాంటివేళ.. మెస్సీ తండ్రితో ఉన్న అనుబంధంతో బార్సిలోనా పుట్ బాల్ క్లబ్ ముందుకు వచ్చింది. వారి కుటుంబానికి అండగా నిలుస్తూ.. మెస్సీని స్పెయిన్ కు తరలించి.. చికిత్స చేయించేందుకు ముందుకు వచ్చారు. దీంతో అతగాడు ఆ ఆరోగ్య సమస్య నుంచి బయటపడ్డారు.
సాధారణంగా గ్రేట్ స్టార్లుగా పేరు తెచ్చుకున్న వారిని చూస్తే.. ఆరంభమే అదిరేలా ఉంటుంది. విచిత్రమైన విషయం ఏమంటే.. మెస్సీ మాత్రం అందుకు భిన్నం. 2005లో అతగాడు అర్జెంటీనా తరఫున హంగేరీతో జరిపిన మ్యాచ్ లో ఫుట్ బాల్ క్రీడలోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే.. అతన్ని పూర్తిస్థాయి అటగాడిగా గ్రౌండ్ లోకి దించకుండా.. ఒక సబ్ స్టిట్యూట్ ప్లేయర్ గా రంగంలోకి దిగాడు. తొలి మ్యాచ్ లో మెస్సీ జెర్సీని పట్టుకొని హంగేరీ ఆటగాడు లాగటం.. దీంతో మెస్సీ మోచేయి సదరు ఆటగాడికి బలంగా తాకింది. దీంతో.. మెస్సీకి రెడ్ కార్డు చూపించాడు రిఫరీ.
ఈ రోజున మైదానంలో అదరగొట్టేస్తున్న మెస్సీ.. తన జీవితంలో దేశం తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ ఆడిన మొదటి మ్యాచ్ లో కేవలం 47 సెకన్లు మాత్రమే గ్రౌండ్ లో ఉన్నాడు. అనూహ్యంగా గ్రౌండ్ నుంచి బయటకు రావాల్సిన దుస్థితి. అలాంటి మెస్సీ.. ఈ రోజున ఎలా చెలరేగిపోతున్నాడో తెలిసిందే.
మెస్సీ కెరీర్ లో ఎన్నోసార్లు హ్యాట్రిక్ గోల్స్ నమోదు చేయటం తెలిసిందే. మరి.. అతగాడు హ్యాట్రిక్ కొట్టిన మొదటి మ్యాచ్ ఎప్పుడు.. ఎక్కడ.. ఎవరితో జరిగిందన్నది ఒక ఎత్తు అయితే.. చివరకు మ్యాచ్ ఫలితం గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు.
ఎందుకంటే.. హ్యాట్రిక్ గోల్స్ కొట్టిన తర్వాత కూడా ఆ మ్యాచ్.. 3-3 గోల్స్ తో డ్రాగా ముగిసింది. ఇదంతా మెస్సీ 19 ఏళ్ల వయసులో జరిగింది. ఎల్ క్లాసియో తరఫు రియల్ మాడ్రిడ్ తో జరిగిన మ్యాచ్ లో మెస్సీ మూడు గోల్స్ తో ఒక్కసారి మెరిశాడు. అయితేనేం మ్యాచ్ ఫలితం అనుకోని రీతిలో వచ్చి.. అతడి ఆనందానికి బ్రేకులు పడేలా చేశాయని చెప్పాలి.