Begin typing your search above and press return to search.

మన డీఎన్ ఏ అంత ఒక్కటే..: ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్

By:  Tupaki Desk   |   20 Dec 2021 7:18 AM GMT
మన డీఎన్ ఏ అంత ఒక్కటే..:   ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్
X
పూర్వం నుంచి భారతీయులంతా ఒక్కటేనని, 40 ఏళ్లుగా అందరీ డీఎన్ ఏ ఒక్కటేనని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. తమిళనాడులోని హెలిక్యాప్టర్ ప్రమాదంలో త్రివిధ దళపతి బిపిన్ రావత్ మరణించిన సంగతి తెలిసందే. ఆయన మృతిపట్ల హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో సంతాప సభను నిర్వహించారు.

ఈ సభలో పాల్గొన్న మోహన్ భగవత్ పలు విషయాలపై ప్రసంగం చేశారు. అంతకుముందు మరణించిన వారికి నివాళులర్పించారు. వారి సంతాప సూచకంగా ఒక నిమిషం మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో వెయ్యి మంది సైనికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోహన్ భగవత్ పలు ఆసక్తి విషయాలను వెళ్లడించారు.

కేంద్రంలో అధికారంలో కొనసాగుతున్న బీజేపీ ప్రభుత్వంపై ఆర్ఎస్ఎస్ నియంత్రణ ఉండదన్నారు. 96 సంవత్సరాలు సంఘ్ దేశం కోసం పనిచేస్తోందన్నారు. దేశానికి ఏ అవసరం వచ్చినా సంఘ్ ముందుండి బాధ్యత వహిస్తుందని అన్నారు. ప్రభుత్వాలకు వేర్వేరు కార్యనిర్వాహకులు, విభిన్న విధానాలు, విభిన్న పని పద్ధుతులు ఉంటాయన్నారు.

కానీ సంఘ్ కు సంస్కృతికి సంబంధించినదని అన్నారు. మీడియా మమ్మల్ని కేంద్ర ప్రభుత్వాన్ని కంట్రోల్ చేస్తున్నారని అంటున్నారు. కానీ ఇది పూర్తిగా అవాస్తవమన్నారు. మా కార్మికుల్లో కొందరు కచ్చితంగా ప్రభుత్వంలో ఉన్నారు. కానీ మీము వారికి ఎటువంటి హామీలు ఇవ్వమని స్పష్టం చేశారు.

ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి సౌకర్యాలు అందవని, అలా అందితే మా విలువ కోల్పోతుందిగా అని మోహన్ భగవత్ అన్నారు. 96 ఏళ్లుగా సంఘ్ ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా.. మారినా నిరాటంకంగా కొనసాగుతుంది. చాలా చోట్ల మా వలంటీర్లు నిస్వార్థ సేవ చేస్తున్నారు. సమాజ సేవ అవసరమన్నప్పుడల్లా వారు ముందుంటున్నారు. ప్రభుత్వానితో సంబంధం లేకుండా స్వయంప్రతిపత్తితో సేవ చేస్తున్నట్లు నిరూపించారు. ఎలంటి ప్రభుత్వ సాయం లేకున్నా సంఘ్ పరివార్ సమాజ సేవలో పాల్గొంటుందని చెప్పారు.

ఇక వేల సంవత్సరాల చరిత్ర భారత్ ది.. పూర్వీకుల నుంచే మనం వచ్చాం.. దాదాపు 40 ఏళ్లుగా భారతీయుల డీఎన్ఏ ఒక్కటేనని మోహన్ భగవత్ స్పష్టం చేశారు. ఇవి గాలి మాటలు కాదని, మనందరి పూర్వీకులంతా ఒక్కటనేనని అన్నారు. వారంత ఒక్కరు కావడంతో పాటు వారి కుటుంబ సభ్యులంతా భారత్ లో ఉండడంతో దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఇదే సమయంలో మన సంస్కృతిని కాపాడాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు.