Begin typing your search above and press return to search.
వైరల్ః స్నేహితురాలి పెళ్లి కోసం.. అమ్మాయిలుగా మారిన అబ్బాయిలు!
By: Tupaki Desk | 7 Jun 2021 2:30 AM GMTపెళ్లి అంటే ఎన్ని సంప్రదాయాలో..! ప్రాంతానికో తీరుగా. వర్గానికో తీరుగా ఉంటాయి. అయితే.. చాలా మందికి కామన్ గా ఉండే అంశాలు కూడా ఉంటాయి. అలాంటి వాటిల్లో ఒకటి తోడు పెళ్లికొడుకు, తోడు పెళ్లి కూతురు. మన దగ్గర ఉండే ఈ పద్ధతి చైనాలో కూడా ఉంది. అయితే.. మన దగ్గర ఒక్కరే. కానీ.. చైనాలో మాత్రం ముగ్గురు ఉంటారు. హెనాన్ ప్రావిన్స్ పరిధిలోని పింగ్డిన్షాన్ నగరానికి చెందిన ఓ పెళ్లి కూతురికి ఇక్కడే సమస్య వచ్చింది.
తనకు తోడు పెళ్లి కూతుళ్లుగా ఉండడానికి ఎవ్వరూ లేరు. ఆమెకు ఆడ స్నేహితులు ఎవరూ లేకపోవడం విశేషం. కానీ.. సంప్రదాయం ప్రకారం స్నేహితులే తోడు పెళ్లికూతుళ్లుగా ఉండాలట. వాళ్లు లేకపోతే ఇబ్బందులు వచ్చేట్టున్నాయి. ఏం చేయాలా.. అని ఆలోచిస్తుండగా బుర్రలో అద్భుతమైన లైట్ వెలిగింది. వెంటనే అమలు చేసింది పెళ్లి కూతురు!
తన మగ ఫ్రెండ్స్ లోని ఓ ముగ్గురిని రంగంలోకి దింపింది. బ్యూటీ పార్లర్ కు పంపించింది.. కత్తిలాంటి ఫిగర్లుగా మార్చేసింది. అద్దిరిపోయే మేకప్ తోపాటు అందమైన డ్రెస్ వరకు అన్నీ పర్ఫెక్ట్ గా సెట్ చేయించింది. ఇంకేముందీ..? హబ్బ.. తోడిపెళ్లి కూతుళ్లు ఎంత బాగున్నారో.. అంటూ వచ్చిన వారంతా మెచ్చుకున్నారు. పనిలోపనిగా కొందరు అబ్బాయిలు సైట్ కూడా కొట్టేశారు. మరికొందరు సెల్ఫీలు తీసుకున్నారు.
కానీ.. ఆ తర్వాత ఎలా తెలిసిందోకానీ.. వాళ్లంతా అబ్బాయిలేనని, మేకప్ వేశారని తెలిసిపోయింది. వార్నీ.. ఖతర్నాక్ ఫిగర్స్ అనుకున్నామే.. భలే మాయచేశారంటూ నవ్వుకున్నారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో వాళ్ల ఫొటోలను షేర్ చేశారు. అంతే.. శరవేగంగా వైరల్ అయిపోయింది న్యూస్. అలా.. అలా.. మనదాకా వచ్చేసింది.