Begin typing your search above and press return to search.
‘పూజ’కు వెళ్లిన 11 మందికి దేశ బహిష్కరణ
By: Tupaki Desk | 9 Dec 2015 9:33 AM GMTకొన్ని దేశాల్లో చట్టాలు చూస్తే షాక్ తినాల్సిందే. ముస్లిం దేశాలకు వెళ్లే వారు ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది. ఏ మాత్రం తేడా దొర్లినా భారీగా శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. శిక్షల తాలూకు తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందనటానికి తాజాగా కువైట్ లో భారతీయులకు ఎదురైన అనుభవమే దీనికి నిదర్శనం. కువైట్ లో హిందువులు ఎవరూ పూజలు చేసుకోకూడదు. ఒకవేళ ఇంట్లో పూజలు చేసుకోవాలంటే.. ముందుగా అనుమతి తీసుకోవాలి.
ఇంట్లో జరిగే దానికి అనుమతి ఏముందిలో అని చిన్నపాటి భరోసాకు భారీ మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఇటీవల కర్ణాటకకు చెందిన సంతోష్ అనే వ్యక్తి తన ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేపట్టారు. దీనికి స్నేహితుల్ని పిలిచారు. ఇంట్లో జరిగిన కార్యక్రమం సంగతి పోలీసులకు ఎలా తెలిసిందో కానీ.. వారు సంతోష్ ను అరెస్ట్ చేశారు.
అంతేకాదు.. వ్రతంలో పాల్గొన్న 11 మందిని అదుపులోకి తీసుకొని.. విచారించి వారికి దేశ బహిష్కరణ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పూజకు వెళ్లినందుకు దేశ బహిష్కరణ ఎదుర్కోవాల్సి వచ్చిందంటూ వాపోతూ వారు విదేశాంగ శాఖకు ఫిర్యాదు చేశారు. కొన్ని దేశాల్లో ఎలాంటి సంఘటన జరిగినా ఎవరికి పట్టదు. అదే సమయంలో.. కొన్ని అంశాలకు మాత్రం భారీ ప్రచారం ఇచ్చేసి పెద్దస్థాయిలో చర్చలు జరుపుతుంటారు. మరి.. ఇలాంటి వాటి మీద చర్చ ఎందుకు జరగదంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.