Begin typing your search above and press return to search.

మోడీ కోస‌మే గ‌డ‌ప‌గ‌డ‌ప‌.. ఇది నిజ‌మేనా..?

By:  Tupaki Desk   |   10 Oct 2022 10:30 AM GMT
మోడీ కోస‌మే గ‌డ‌ప‌గ‌డ‌ప‌.. ఇది నిజ‌మేనా..?
X
ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించిన‌.. భ‌విస్తున్న 'గ‌డ‌ప గ‌డ‌ప‌కుమ‌న ప్ర‌భుత్వం' కార్య‌క్ర‌మం ల క్ష్యం ఏంటి? ఎమ్మెల్యేల‌ను, ఎంపీల‌ను.. మంత్రుల‌ను కూడా ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లాల‌ని సీఎం జ‌గ‌న్ చెప్ప డం వెనుక ఉద్దేశం ఏంటి? అంటే... దీనికి పెద్ద‌గా త‌డుము కోవాల్సిన అవ‌స‌రం లేదు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు.. ప్ర‌స్తుతం ప్ర‌బుత్వం చేస్తున్న సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను మ‌రింత పుంజుకునేలా చేసేందుకు.. వాటికి ప్రచారం క‌ల్పించేందుకు.. ప్ర‌భుత్వం ఎంచుకున్న కార్య‌క్ర‌మం.

అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు అంద‌రూ ఇదే అనుకున్నారు. కానీ తాజాగా.. మాత్రం.. ఈ గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు కార్య‌క్ర మంలో వెనుక ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీని మెప్పించే వ్యూహం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఏపీలో బీజేపీ విస్త‌రించాల‌ని అనుకుంటున్నా.. ఆ త‌ర‌హా సూచ‌న‌లు... సంకేతాలు క‌నిపించ‌డం లేదు. ఈ క్ర‌మంలో కేంద్రంలో మ‌ళ్లీ అధికారంలోకి రావాల‌నుకుంటున్న బీజేపీ నేత‌ల‌కు.. ముఖ్యంగా ప్ర‌ధాని మోడీకి ఏపీపై ఉన్న వ్యూహం ఏంటి? అనేది ఇంపార్టెంట్‌.

ఎందుకంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మెజారిటీ ఎంపీల‌ను బీజేపీ గెలుచుకునే అవ‌కాశం లేదు. ప్ర‌భుత్వ వ్య‌తిరే క ఓటు కావొచ్చు.. లేదా.. రెండు సార్లు గెలిపించిన బీజేపీ ఎంపీల‌ను ప్ర‌జ‌లు ప‌క్క‌న పెట్టొచ్చు. ఈ నేప థ్యంలో ఏ చిన్న తేడా వ‌చ్చినా.. మోడీ అధికారం మిస్స‌వుతారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌ ప్రాంతీయ పార్టీల మ‌ద్ద‌తుతో అయినా.. అధికారంలోకి రావాల‌ని భావిస్తున్నారు. ఇలా చూసుకుంటే.. ఏపీలో 25 మంది ఎంపీలు ఉన్నారు.

వీరిలో ఎక్కువ మంది ఏ పార్టీ కైవ‌సం చేసుకుంటే.. ఆ పార్టీ వైపు మోడీ మొగ్గు చూపుతారు.అందుకే.. అటు టీడీపీతోనూ.. ఇటు వైసీపీతోనూ.. మ‌ధ్య‌స్థంగానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ రెండు పార్టీల‌పై ప్ర‌త్యేక అభిమా నం లేదు.. అంత‌కు మించిన ప్రేమ కూడా లేదు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీకి 20+ ఎంపీ సీట్ల ద‌క్కుతాయ‌ని.. మోడీ భావిస్తే.. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆ పార్టీకి లోపాయికారీగా అండ‌గా ఉండే అవ‌కాశం ఉంది. అలా కాదు.. జ‌గ‌నే 20+ లో ఉంటార‌ని అనుకుంటే.. ఇప్పుడు కొన‌సాగుతున్న బంధాన్ని మ‌రికొంత పెంచే ఛాన్స్ ఉంది.

సో.. ఎలా చూసుకున్నా.. ఏపీపై మోడీ వ్యూహం ఎంపీ టికెట్ల‌ను ఎక్కువ‌గా గెలుచుకునే పార్టీ వైపే ఉంటుం ది. దీనిని ప‌సిగ‌ట్టిన జ‌గ‌న్‌.. మోడీ వ్యూహాన్ని త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకునే ప్ర‌య‌త్నంలో ఉన్నార నేది ప‌రిశీల‌కుల అంచ‌నా. అంటే..

జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి ప్ర‌జ‌ల్లో జోష్ ఉంది.. కాబ‌ట్టి..వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ జ‌గ‌న్‌కే ప్ర‌జ‌లు జై కొడ‌తారు.. అనే సంకేతాల‌ను మోడీకి పంపించాల‌నే వ్యూహాన్ని జ‌గ‌న్ అమ‌లు చేస్తున్నార‌నేది వీరి మాట‌. అందుకే.. గ‌డ‌ప‌గ‌డ‌ప కార్య‌క్ర‌మాన్ని ఆయ‌న ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నార‌ని చెబుతున్నారు. ఇది త‌న‌కు కూడా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని.. ముఖ్యంగా మోడీ వ్యూహానికి స‌రిపోతుంద‌ని.. జ‌గ‌న్ బావిస్తున్న‌ట్టు చెబుతున్నారు. మ‌రి జ‌గ‌న్ ఎత్తుగ‌డ ఏమేర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.