Begin typing your search above and press return to search.
టీడీపీ కోసం.. స్వయంగా రంగంలోకి రామోజీ?!
By: Tupaki Desk | 21 Sep 2022 2:30 AM GMTదాదాపు 40 ఏళ్ల కిందట... టీడీపీని స్థాపించిన సమయంలో ఆ పార్టీకి శతథా.. సహస్త్రథా..! అంటూ.. అండగా నిలిచిన పత్రికాధిపతి.. రామోజీరావు. అప్పటి కాంగ్రెస్ పాలనకు, రాజకీయాలకు.. వ్యతిరకంగా.. అన్నగారు స్తాపించిన పార్టీ.. టీడీపీని.. ప్రజల్లోకి తీసుకువెళ్లి.. మైలేజీ పెంచే ప్రయత్నంలో శక్తివంచన లేకుండా.. రామోజీ పనిచేశారనడంలో సందేహం లేదు. అన్నగారికి అనుకూలంగా.. కథనాలు.. వార్తలు.. కార్టూన్లు.. ఇలా.. ఒక్కటేమిటి.. అనేక రూపాల్లో అన్నగారికి.. టీడీపీకి మద్దతుగా నిలిచారు.
ఈ క్రమంలో ఆయన పత్రిక వండి వార్చిన వార్తలు.. ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. ఫలితంగా పార్టీ పెట్టిన మూడు నెలలకే.. అధికారంలోకి వచ్చారు. ఇలా.. రామోజీ రావు.. కష్టపడిన చరిత్ర తర్వాత ఈ రేంజ్‌లో మనకు కనిపించదు.
అయితే.. ఇప్పుడు ఆయన మరోసారి.. 40 ఏళ్ల కిందట ఎలా కష్టపడ్డారో.. ఇప్పుడు అలానే కష్టపడుతున్నారని అంటున్నారు పరిశీలకులు.. ఏపీలో వైసీపీ సర్కారును గద్దె దించడమే ధ్యేయంగా.. ఆయన టీడీపీని తోసిరాజని.. మరీ.. ప్రచ్ఛన్న పొలిటికల్ యుద్దాన్ని భుజానికెత్తుకున్నట్టు కనిపిస్తోంది.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆప పార్టీని.. సీఎం జగన్‌ను దీటుగా ఎదరించడంలో.. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నా.. అనుకున్న రేంజ్‌లో మాత్రం ఫలితం దక్కడం లేదు. ఈ విషయాన్ని చంద్రబాబే చెబుతున్నారు. నేను కష్టపడుతున్నాను.. మీరు మాత్రం ఇంట్లో శుభ్రంగా పడు కుంటున్నారు! అని ఇటీవల కూడా.. సీనియర్ నాయకులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అంతేకాదు.. తాను చేసిన శపథాన్ని(సీఎం అయ్యాకే.. అసెంబ్లీలో అడుగు పెడతానని) కూడా గుర్తు చేస్తున్నారు.
అయినా.. కూడా నాయకులు ముందుకురావడం లేదు. దీంతో చంద్రబాబు.. వైసీపీకి పెద్దగా కౌంటర్ ఇవ్వలేక పోతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు రామోజీ రావే.. టీడీపీని గెలిపించే బాధ్యతను భుజాన వేసుకున్నట్టుగా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు.
గత కొన్ని రోజులుగా ఈనాడులో వస్తున్న కథనాలు.. చేస్తున్న ప్రసారాలను గమనిస్తే.. నేరుగా.. జగన్‌పైనా.. ఆయన ప్రభుత్వంపైనా.. రామోజీరావు యుద్ధం చేస్తున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు.
ఇలాంటి పరిస్థితి గతంలో ఎన్టీఆర్ కోసం.. అప్పటి కాంగ్రెస్ వాదులపై ఇదే రామోజీరావు చేశారని అంటున్నారు. ఇప్పుడు.. ఇన్నాళ్లకు మళ్లీ.. టీడీపీ కోసం..87 ఏళ్ల వృద్ధాప్యంలోనూ.. రామోజీ రంగంంలోకి దిగారని.. చెబుతున్నారు.
అయితే.. అప్పటికి.. ఇప్పటికీ.. మీడియాలో వచ్చిన మార్పుల నేపథ్యంలో రామోజీ చెప్పే 'స్టోరీస్'ను ఎంత మంది నమ్ముతారో చూడాలని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా పెరిగిపోయింది. యూట్యూబ్.. ఇత్యాదివి రంగంలో ఉన్నాయి.. సో.. ఏం చెప్పినా చెల్లుతుందనే పరిస్థితి లేదు. దీంతో కోతి ఇప్పుడు పిరికితనం ప్రదర్శిస్తోందని అంటున్నారు పరిశీలకులు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.