Begin typing your search above and press return to search.
50 ఏళ్లలో మొదటి సారి.. రాజకీయ నేతలకు ఉరి
By: Tupaki Desk | 26 July 2022 12:30 AM GMTప్రపంచంలోని చాలా పాశ్చాత్య, అభివృద్ధి చెందిన దేశాల్లో ఉరిశిక్షను నిషేధించారు. కొన్ని కమ్యూనిస్టు, రెబలిస్టు దేశాల్లోనే దీన్ని అమలు చేస్తున్నారు. ఇక సైనిక నియంతల పాలనలో ఉన్న దేశాల్లో కూడా ఈ మరణశిక్ష విధిస్తున్నారు. తాజాగా మయన్మార్ లోని మిలటరీ ప్రభుత్వం కూడా ఈ సాహసానికి ఒడిగట్టింది. నలుగురు ప్రజాస్వామ్య అనుకూల రాజకీయ నేతలకు ఉరిశిక్ష అమలు చేసింది. సోమవారం ఈ విషయాన్ని ప్రకటించడంతో ప్రపంచం నివ్వెరపోయింది.
అంగ్ సూకీ నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వాన్ని గత ఏడాది కూల్చేసి అధికారంలోకి వచ్చిన మిలటరీ ప్రభుత్వం 25 ఏళ్ల తర్వాత దేశంలో ఉరిశిక్షను అమలు చేసింది. ఉరిశిక్ష ఎదుర్కొన్న నలుగురిని సైన్యం గత ఏడాది అరెస్ట్ చేసింది. వారిపై ఉగ్రవాదం, జుంటాకు వ్యతిరేకంగా పోరాడాలని ప్రజలకు ఆయుధాలు ఇవ్వడం వంటి అభియోగాలు మోపారు.
ఈ ఏడాది జనవరిలో వీరికి ఉరిశిక్ష విధించారు. దీనిపై వారు అప్పీలు చేసుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఉరిశిక్ష ఎదుర్కొన్న నలుగురిలో ఇద్దరు ముఖ్యమైన రాజకీయ నాయకులు కావడం గమనార్హం. రేపర్, హిప్ హాప్ ఆర్టిస్ట్ ఫియో జయర్ థా వీరిలో ఒకరు.
నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ సభ్యుడైన ఫియో.. 2012 నుంచి పార్లమెంట్ సభ్యుడు కూడా.. పార్టీ నేత అంగ్ సాన్ సూకీకి సన్నిహితుడు. రెండో వ్యక్తి కోజిమ్మీ సీనియర్ ప్రజాస్వామ్య కార్యకర్త.
మయన్మార్లో ఉరిశిక్ష అమలు చేయడం 25 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం సంచలనమైంది. గత 10 ఏళ్లు తప్ప మయన్మార్ ను సైన్యం దశాబ్ధాలుగా ప్రత్యక్షంగా పాలించింది. ప్రత్యర్థులకు మరణశిక్ష విధించింది. చివరిసారిగా 1990వ దశకంలో శిక్ష అమలు చేసింది.
జూన్ లో మయన్మార్ జుంటా ప్రభుత్వం కొంతమంది ఖైదీలను ఉరి తీయబోతున్నట్లు ప్రకటించినప్పుడు.. జుంటా సన్నిహిత మిత్రుడు, కాంబోడియా ప్రధానమంత్రి హున్ సేన్. సైనిక పాలకుడు జనరల్ మిన్ ఆంగ్ హ్లియాంగ్ కు లేఖ రాశారు. మరణ శిక్షలు అమలు చేయొద్దని అందులో అభ్యర్థించారు.
ఇక ఆగ్నేయాసియా దేశాలైన కంబోడియా, ఫిలిప్పీన్స్ దేశాలు మరణశిక్షను రద్దు చేశాయి. అమెరికా సహా అనేక దేశాల్లో మరణశిక్ష అమలులో ఉందని జుంటా అధికార ప్రతినిధి తెలిపారు. వారి కారణంగా భద్రతా దళాళలు మినహా కనీసం 50 మంది అమాయక పౌరులు మరణించారని వివరించారు.