Begin typing your search above and press return to search.
శ్రీనగర్ లో 600 ఏళ్లలో జరగనిది ఇప్పుడు జరిగిందట
By: Tupaki Desk | 7 Sep 2019 1:30 AM GMTసరిగ్గా నెల దాటింది. ఆర్టికల్ 370నునిర్వీర్యం చేస్తూ నిర్ణయం తీసుకొని. దేశంలోని ఇతర రాష్ట్రాలకు భిన్నంగా జమ్ముకశ్మీర్ ను నిలిపే ఆర్టికల్ 370ను నిర్వీర్యం చేస్తూ మోడీ సర్కారు నిర్ణయం తీసుకొని నేటికి నెల పూర్తి అవుతుంది. అప్పటి నుంచి జమ్ముకశ్మీర్ లోనీ కశ్మీర్ వ్యాలీలో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి.
తాజాగా ఒక ఆసక్తికర అంశం బయటకు వచ్చింది. గడిచిన 600 ఏళ్లలో ఎప్పుడూ లేని రీతిలో తొలిసారి ఈద్ రోజున.. శుక్రవారాల్లో ముస్లింలు సామూహిక ప్రార్థనలు జరపకుండా ఉన్న పరిస్థితి లేదని.. అలాంటి పరిస్థితి తాజాగా వచ్చిందని చెప్పుకొచ్చారు శ్రీనగర్ లోని జీలం నది ఒడ్డున ఉన్న 14వ శతాబ్దం నాటి ఖాంక్ ఏ మౌలాకు డిప్యూటీ ఇమామ్ గా పని చేస్తున్న ఇస్లాం మత గురువు హాజీ బిలాల్ అహద్ అమ్దానీ.
గతంలోనూ ఎన్నో ఆందోళనలు జరిగాయని.. ఆ సమయంలోనూ ప్రార్థనలకు ఆటంకం కలగలేదన్నారు. కర్ఫ్యూ ఉన్నప్పుడు.. తుపాకీల తూటాల చప్పుడు వినిపిస్తున్న సందర్భంలోనూ ప్రార్థనలు జరిగాయని.. ఇప్పుడు మాత్రం లేవన్నారు. తాజాగా ఆయన స్థానిక మీడియా ప్రతినిధులతో మాట్లాడిన సందర్భంగా పలు అంశాల్ని ఆయన చెప్పుకొచ్చారు.
తమకు స్వాతంత్య్రం కావాలంటూ 1989లో పెద్ద ఎత్తున మిలిటెంట్లు జరిపిన ఆందోళన సందర్భంలో పలువురు మరణించారని.. 1947లో జరిగిన మతకలహాల్లో వందలాది మంది మరణించారని.. అలాంటి సమయంలోనూ ప్రార్థనలకు ఆటంకం కలుగలేదన్నారు. ఈ రెండు సందర్భాల్లోనే కాదు.. పలు ఉద్రిక్త పరిస్థితులుచోటు చేసుకున్నా సామూహికప్రార్థనలకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదని.. కానీ.. ఈసారి మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయన్నారు.
ప్రస్తుతం కశ్మీర్ లో అప్రకటిత ఆంక్షలు అమలవుతున్నాయని.. గడిచిన నెల రోజులుగా ల్యాండ్ లైన్లు.. సెల్ ఫోన్లు పని చేయటం లేదని.. బయట ప్రపంచంతో సంబంధాలు లేవన్నారు. శ్రీనగర్ లోని పలు చారిత్రక మసీదుల్లో సామూహిక ప్రార్థనలు నిలిచిపోయాయని.. అక్కడిప్పుు పావురాల రెక్కల చప్పుడు మినహా మరింకేమీ లేవన్నారు.