Begin typing your search above and press return to search.
దేశ చరిత్రలోనే మొదటిసారి..ఎన్ కౌంటర్ లో పాల్గొన్న మహిళా ఎస్ ఐ!
By: Tupaki Desk | 27 March 2021 8:48 AM GMTదేశ చరిత్రలోనే ఇది తొలిసారి. ఇప్పటివరకు ఎన్ కౌంటర్ లు -ఎన్ కౌంటర్ స్పెషలిస్టు అనగానే గుర్తుకొచ్చేది మగ పోలీసులు. తీవ్రవాదులు - సంఘ విద్రోహ శక్తులను ప్రాణాలకు ఎదురించి ఎన్ కౌంటర్ చేస్తుంటారు. అయితే ఇప్పటివరకు ఒక్క మహిళా పోలీస్ కూడా ఎన్ కౌంటర్ లో పాల్గొన్న చరిత్రలేదు. కానీ , ఇప్పుడు ఆ లోటు తీరిపోయింది. దేశ రాజధాని ఢిల్లీలో తొలిసారిగా ఎన్ కౌంటర్ లో పాల్గొన్నారు ఓ మహిళా ఎస్ ఐ. 2008వ సంవత్సరంలో ఢిల్లీ పోలీసు క్రైంబ్రాంచ్ లో ఎస్ ఐ గా చేరిన ప్రియాంక ప్రగతి మైదానంలో జరిగిన ఎన్ కౌంటరులో పాల్గొన్నారు. ఈ ఎన్ కౌంటర్ లో గ్యాంగ్ స్టర్ రోహిత్ చౌదరి - అతని సహచరుడు పర్వీన్ అలియాస్ టిటును మహిళా ఎస్ఐ ప్రియాంక అరెస్టు చేశారు.
ఈ ఎన్ కౌంటరులో రోహిత్ చౌదరి, టిటూల కాళ్లకు గాయాలవడంతో వారిని ఆర్ఎంఎల్ ఆసుపత్రికి తరలించామని మహిళా ఎస్ ఐ ప్రియాంక తెలిపారు. ఎన్ కౌంటరులో గ్యాంగ్ స్టర్లు మహిళా ఎస్ఐ ప్రియాంకపై కాల్పులు జరపగా , ఆ బుల్లెట్లు ప్రియాంక వేసుకున్న బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కు తగిలాయి. దీంతో ఆమెకు ఎటువంటి హాని జరగలేదు. కాగా..ఎన్ కౌంటరులో పాల్గొన్న మహిళా ఎస్ ఐ ప్రియాంకను ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు. మహిళా ఎస్ ఐ ప్రియాంక అరెస్టు చేసిన గ్యాంగ్ స్టర్లకు రూ.5లక్షల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు.